మారుమూల గ్రామాలలో పర్యటించిన జిల్లా మలేరియా అధికారి ప్రసాద్
వ్యాధుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని సూచన...
పోలవరం జిల్లా : పోలవరం : స్వచ్ఛవార్త :
వర్షాకాలంలో ప్రజలే వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రజలను చైతన్య పరచాలని జిల్లా మలేరియా అధికారి ప్రసాద్ సూచించారు. మంగళవారం వేలేరుపాడు మండలం కట్కూరు పంచాయతీలోని పలు గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులకు సిబ్బందికి పలు సూచనలు అందించడంతోపాటు, ప్రజలకు పారిశుధ్యం పై అవగాహన కల్పించారు.
ముఖ్యంగా గ్రామ గృహాల పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని నిల్వ ఉన్న నీటిలో విషపూరితమైన దోమలు వృద్ధి చెంది పలు వ్యాధులు ఎందుకు కారణం అన్నారు. ఇది దృష్టిలో పెట్టుకొని ఎవరికి వారు పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు సిబ్బంది తదితరులంతా ఉన్నారు.

