Showing posts with the label క్రీడలు
📅 డేట్ లోడింగ్...
|
⏰ టైమ్ లోడింగ్...
ఏలూరు జిల్లా : కామవరపుకోట : స్వచ్ఛవార్త : మాస్టర్స్ (వెటరన్) అథ్లెటిక్స్ రాష్ట్రస్థాయి పోటీల్లో కామవరపుకోట మండలం తూర్పు యడవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు గజ్జవల్లి రవి సత్తా చాటారు. తణుకు ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన పోటీల్లో 40+ విభాగంలో హైజంప్‌లో స్వర్ణ పతకం, హేమర్ త్రోలో కాంస్య పతకం సాధించారు. ఈ ప్రతిభతో రవి జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. అక్టోబర్ 9 నుంచి 11 వరకు కోయంబత్తూరులో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీల్లో ఆయన పాల్గొననున్నారు. రవి విజయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.ఏ.ఎల్. కోటేశ్వరి, ఉపాధ్యాయులు, సిబ్బంది, ఎస్ఎంసీ సభ్యులు, గ్రామ పెద్దలు అభినందనలు తెలిపారు.
ఏలూరు జిల్లా : టి.నరసాపురం : స్వచ్ఛవార్త : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరుస్తున్న 50 మంది విద్యార్థులకు జనసేన పార్టీ మండల అధ్యక్షులు, మధ్యాహ్నపువారిగూడెం పిఎసిఎస్ చైర్ పర్సన్ అడపా నాగరాజు సొంత నిధులతో ఉచితంగా స్పోర్ట్స్ డ్రెస్సులను పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకే ఈ సాయం చేశానని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి పాఠశాలకు, మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా నాగరాజు ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో క్రీడాకారులకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉచితంగా క్రీడా దుస్తులను అందించిన అడపా నాగరాజును పాఠశాల యాజమాన్యం, అధికారులు ప్రత్యేకంగా అభినందించి ధన్యవాదములు తెలిపారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి -1 టి. రామ్మూర్తి, హెచ్ఎం బి.లింగస్వామి, పీడీ ఎ. రామకృష్ణతో పాటు పలువురు జనసేన పార్టీ నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.