Showing posts from August, 2026
📅 డేట్ లోడింగ్...
|
⏰ టైమ్ లోడింగ్...
కృష్ణా జిల్లా : చల్లపల్లి : స్వచ్ఛవార్త : పర్యావరణ పరిరక్షణలో భాగంగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజి తెలిపారు. ప్రజలు, వ్యాపారులు, ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో చల్లపల్లిలో నిర్వహించిన ప్లాస్టిక్ రహిత చల్లపల్లి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా “ప్లాస్టిక్ వద్దు.. కాటన్ సంచులే ముద్దు”, “ప్లాస్టిక్ వాడకం మానేద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం” వంటి నినాదాలతో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని, అనంతరం ప్రజలు, విద్యార్థులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు మానవహారం నిర్వహించి ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. క్యారీ బ్యాగులు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులతో పాటు లోపల ప్లాస్టిక్ కోటింగ్ ఉన్న పేపర్ కప్పుల వినియోగాన్ని కూడా నియంత్రించాల్సి ఉందన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు ఇప్పటికే అవగాహన కల్పించామని, చల్లపల్లిలో రెం...
ఏలూరు జిల్లా : కైకలూరు : స్వచ్ఛవార్త : రహదారి ప్రమాద రహిత జిల్లాగా ఏలూరును తీర్చిదిద్దడమే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం చర్యలు వేగవంతం చేసింది. ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ మరియు ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు నిన్న సోమవారం కైకలూరు రూరల్ ఇన్స్పెక్టర్ వి. రవికుమార్ పర్యవేక్షణలో సర్కిల్ పరిధిలో ప్రత్యేక భద్రతా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐతో పాటు సర్కిల్ పరిధిలోని ఎస్సైలు ప్రత్యేక భద్రతా చర్యలపై మాట్లాడారు సీఐ వి. రవికుమార్ మాట్లాడుతూ : ప్రజల ప్రాణ రక్షణే ధ్యేయంగా కైకలూరు రూరల్ సర్కిల్ పరిధిలో ప్రమాద రహిత వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని సీఐ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తూనే, ప్రతి ఒక్కరిలో రహదారి భద్రతపై బాధ్యత పెరిగేలా నిరంతరం క్షేత్రస్థాయి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల రక్షణ కోసం పోలీసులు చేపడుతున్న చర్యలకు వాహనదారులు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. కైకలూరు రూరల్ ఎస్సై రాంబాబు మాట్లాడుతూ : రాత్రి వేళల్లో చీకటి కారణంగా జరిగే ఘోర ప్రమాదాలను అరికట్టేందుకు, వాహన...
ఇంకా బాధితులు ఉంటే జిల్లా పోలీసులను సంప్రదించాలి... ఆదిలాబాద్ వన్ టౌన్ ఎస్హెచ్ఓ బి. సునీల్ కుమార్... ఆదిలాబాద్ జిల్లా : ఆదిలాబాద్ : స్వచ్ఛవార్త : ఆదిలాబాద్ పట్టణంలోని బొక్కలగూడకు చెందిన షేక్ సద్దాం తన స్నేహితుడితో కలిసి హజ్ యాత్రకు వెళ్లేందుకు 2026 సంవత్సరంలో గోల్డెన్ ట్రావెల్స్ ద్వారా ఏజెంట్లను సంప్రదించినట్లు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. హజ్ యాత్రకు సంబంధించి ఏజెంట్లకు మొత్తం రూ.42 లక్షలు చెల్లించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏజెంట్లు గోల్డెన్ ట్రావెల్స్‌కు రూ.31 లక్షలు మాత్రమే చెల్లించారని, మరో రూ.11 లక్షలు బకాయి ఉన్నట్లు గోల్డెన్ ట్రావెల్స్ ద్వారా తెలిసిందని ఫిర్యాదుదారు తెలిపారు. దీంతో ఫిర్యాదుదారు రూ.6 లక్షలు, రూ.5 లక్షల చొప్పున రెండు చెక్కుల ద్వారా మిగిలిన రూ.11 లక్షలను నేరుగా గోల్డెన్ ట్రావెల్స్‌కు చెల్లించినట్లు పేర్కొన్నారు. హజ్ యాత్ర పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన అనంతరం ఏజెంట్లను సంప్రదించి రూ.11 లక్షల మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని కోరగా పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చారని, అనంతరం ఫోన్లు స్విచ్ఛాఫ్‌గా ఉన్నాయని ఫిర్యాదుదారు తెలిపారు. ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ వన్ టౌన్ పోల...
ప.గో జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త : స్థానిక ప్రముఖ ఇలవేల్పు శ్రీ మావుళ్లమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్రం ప్రాజెక్టుకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం భీమవరానికి చెందిన మంగిన గురుమూర్తి నాయుడు 8 గ్రాముల బంగారాన్ని మావుళ్లమ్మవారి దేవస్థానానికి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం దాతను శేషవస్త్రంతో సత్కరించగా, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, పాపోలు ఏడుకొండలు అమ్మవారి ప్రసాదం, జ్ఞాపికను అందజేశారు. అమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్ర ప్రాజెక్టుకు భక్తులు, దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందిస్తున్నారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా : ఏలూరు కలెక్టరేట్ : స్వచ్ఛవార్త : పిజిఆర్ఎస్ ద్వారా అందిన సేవలపై ప్రజల అభిప్రాయాలను క్యూ ఆర్ కోడ్ ద్వారా తెలియజేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి కోరారు. ప్రజలకు మరింత పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన సేవలను అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఈ కార్యక్రమంలో భాగంగా పిజిఆర్ఎస్ ద్వారా అందించే సేవలపై ప్రజలను అభిప్రాయాలను క్యూఆర్ కోడ్ ద్వారా కోరుతున్నదన్నారు. జిల్లా, మండల స్థాయి పి.జి.ఆర్.ఎస్ కేంద్రాలలో ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాలలో ప్రజలకు స్పష్టంగా కనిపించేలా క్యూ.ఆర్ కోడ్ ప్రముఖంగా ప్రదర్శించడం జరిగిందన్నారు. పి.జి.ఆర్.ఎస్ సేవల పొందిన ప్రజలు తమ మొబైల్ ఫోన్ల ద్వారా క్యూ.ఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తమ అభిప్రాయాన్ని, సంతృప్తి స్థాయిని తెలియజేయవచ్చన్నారు. క్యూ.ఆర్ కోడ్ ప్రజల స్పందన అధికారిక పి.జి.ఆర్.ఎస్ పోర్టల్ చేరుతుందని అన్నారు. ఆర్జీల స్థితిగతులు తెలుసుకొనుటకు టోల్ ఫ్రీ నంబర్ 1100 కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు. క్యూ.ఆర్ కోడ్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేస్తూ మరింత మెరుగైన సేవలు అందించుటకు సహకరించా...
ఏలూరు జిల్లా : టి.నరసాపురం : స్వచ్ఛవార్త : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరుస్తున్న 50 మంది విద్యార్థులకు జనసేన పార్టీ మండల అధ్యక్షులు, మధ్యాహ్నపువారిగూడెం పిఎసిఎస్ చైర్ పర్సన్ అడపా నాగరాజు సొంత నిధులతో ఉచితంగా స్పోర్ట్స్ డ్రెస్సులను పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకే ఈ సాయం చేశానని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి పాఠశాలకు, మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా నాగరాజు ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో క్రీడాకారులకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉచితంగా క్రీడా దుస్తులను అందించిన అడపా నాగరాజును పాఠశాల యాజమాన్యం, అధికారులు ప్రత్యేకంగా అభినందించి ధన్యవాదములు తెలిపారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి -1 టి. రామ్మూర్తి, హెచ్ఎం బి.లింగస్వామి, పీడీ ఎ. రామకృష్ణతో పాటు పలువురు జనసేన పార్టీ నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప.గో జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త : భీమవరం పట్టణంలో వెలసిన మావుళ్ళమ్మ వారి ఆలయానికి భక్తులు ఉదారంగా విరాళాలు అందజేశారు. అమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్రం ప్రాజెక్టు కోసం కాకినాడకు చెందిన కంటిపూడి విద్యాసాగర్–సావిత్రి దేవి దంపతులు రూ.2 లక్షలు విరాళంగా సమర్పించారు. అదేవిధంగా మావుళ్లమ్మ వారి శాశ్వత అన్నదాన కార్యక్రమం కోసం తమ కుటుంబ సభ్యుడు చి. వివేక్ పేరు మీద రూ.1,00,116 విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి, దాతలకు అమ్మవారి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ఆలయ ధర్మకర్త రామాయణం శ్రీనివాస్ దాతలను సత్కరించి అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. భక్తుల సహకారంతో అమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్రం ప్రాజెక్టు, శాశ్వత అన్నదాన కార్యక్రమాలు మరింత విజయవంతంగా కొనసాగుతున్నాయని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు. అమ్మవారిపై భక్తి, సేవాభావంతో భక్తులు ముందుకు వచ్చి విరాళాలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.
బాపట్ల జిల్లా : వేటపాలెం : స్వచ్ఛవార్త : ఓటర్ల జాబితా పరిశీలనలో ధ్రువీకరణ పత్రాలే కీలకమని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి తెలిపారు. వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం స్వర్ణ గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరును ఆయన పరిశీలించారు. ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవల తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ ఓటర్ల జాబితా పరిశీలనలో భాగంగా నోటీసులు అందుకున్న వారితో కలెక్టర్ స్వయంగా మాట్లాడారు. 194 బిఎల్ఓ నుండి గొల్లప్రోలు ఆదిలక్ష్మి మహిళకు నోటీసులు జారీ అయ్యాయి. ఆమె పేరులో స్వల్ప అక్షర దోషం ఉండడంతో ఆమెకు నోటీసులు జారీపై ఆరా తీశారు. ఆమె తన ఓటు హక్కు పొందడానికి నమోదు చేసుకున్న దరఖాస్తును కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. గతంలో ఓటు హక్కు వినియోగించుకున్నానంటూ ఆమె తన ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు పత్రాలను కలెక్టర్ కు చూపారు. ఆమె అందించిన ధ్రువీకరణ పత్రాలను నిశితంగా పరిశీలించిన కలెక్టర్ తక్షణమే సరి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. బి ఎల్ ఓ యాప్ ద్వారా జరుగుతున్న ఓటర్ పరిశీలన ప్రక్రియను పరిశీలించారు. ప్రజల ...
ఏలూరు జిల్లా : కైకలూరు : స్వచ్ఛవార్త : తెలుగు భాషను సరళంగా, సహజంగా ఉపయోగించడంతో పాటు దాని గొప్పతనాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జాగృతి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ప్రిన్సిపాల్ జయ కిషోర్ బాబు అన్నారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వ్యావహారిక భాషోద్యమానికి విశేష కృషి చేసిన గిడుగు వెంకట రామమూర్తి పంతులు సేవలను ఈ సందర్భంగా జయ కిషోర్ బాబు స్మరించుకున్నారు. తెలుగు భాషను పండితుల పరిధి నుంచి సామాన్యులకు సైతం సులభంగా అర్థమయ్యే రీతిలో తీసుకురావడంలో గిడుగు చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే తెలుగు భాషపై మక్కువ పెంచుకోవాలని, మాట్లాడటం, చదవడం, రాయడం ద్వారా భాషపై పట్టు సాధించాలని సూచించారు. తెలుగు భాషను కాపాడటంతో పాటు దాని ప్రాధాన్యతను తదుపరి తరాలకు తెలియజేయాలని అన్నారు. ఈ సందర్భంగా తెలుగు ఉపాధ్యాయులు వేదకుమారి, దేవి, ఎల్.వి. శ్యామల, సుభాషిణిలను జయ కిషోర్ బాబు చేతుల మీదుగా సన్మానించారు. తెలుగు పండితుడిగా సేవలందిస్తున్న జయ కిషోర్ బాబును ఉపాధ్యాయులు సత్కరించారు. కార్యక్రమంలో విద్యార్థు...
రూ.1.82 లక్షల విలువైన నకిలీ రూ.500 నోట్లు, ప్రింటర్, పేపర్ కట్టర్ స్వాధీనం... కృష్ణాజిల్లా : బంటుమిల్లి : స్వచ్ఛవార్త : కిరాణా దుకాణంలో నకిలీ రూ.500 నోటును చలామణి చేసేందుకు ప్రయత్నించిన ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నకిలీ నోట్లు తయారు చేసి చలామణి చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.1,82,500 విలువైన నకిలీ రూ.500 నోట్లు, కలర్ ప్రింటర్, 197 ఏ4 షీట్లు, పేపర్ కట్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 26న కిరాణా దుకాణంలో వాటర్ బాటిల్, సిగరెట్ ప్యాకెట్ కొనుగోలు చేసిన వ్యక్తి రూ.500 నోటు ఇచ్చాడు. ఆ నోటుపై అనుమానం వచ్చిన వ్యాపారి పరిశీలించగా అది నకిలీదిగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దర్యాప్తు చేపట్టారు. మిలేష్ రొయ్యల కంపెనీ సమీపంలో ఐదుగురు అనుమానితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద తనిఖీలు నిర్వహించగా భారీగా నకిలీ కరెన్సీ నోట్లు, నకిలీ నోట్లు తయారు చేసేందుకు ఉపయోగించిన పరికరాలు లభించాయి. పోలీసులు షేక్ జానీ, చిట్టి బొమ్మ చినపాము, వీళ్ల రామకృష్ణ, దాసరి రామకృష్ణ, గ...
ఏలూరు జిల్లా : ఏలూరు : స్వచ్ఛవార్త : రాఖీ పౌర్ణమి సందర్భంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి క్యాంపు కార్యాలయంలో రక్షాబంధన్ వేడుకలు ఆత్మీయ వాతావరణంలో జరిగాయి. శుక్రవారం టీడీపీ మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఎమ్మెల్యే బడేటి చంటికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వీట్లు తినిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయం రాఖీ పండుగ సందడితో కళకళలాడింది. మహిళా నాయకులు ఎమ్మెల్యేతో సోదర అనుబంధాన్ని పంచుకుంటూ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల సంక్షేమం, భద్రత, సాధికారతకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పలువురు పేర్కొన్నారు. తనకు రాఖీలు కట్టిన మహిళా నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే బడేటి చంటి కృతజ్ఞతలు తెలిపారు. రక్షాబంధన్ సోదర–సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, నమ్మకానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో మరింత ముందుకు సాగేందుకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు. అక్కచెల్లెమ్మలకు చీరల పంపిణీ : రాఖీ వేడుకల అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మహిళలకు చీరలను పంపిణీ చేశారు. చీరలు అందుకున్న మహిళలు ఎమ్...
ఏలూరు జిల్లా : కొయ్యలగూడెం : స్వచ్ఛవార్త : టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, పోలవరం పరిశీలకుడు కోళ్ల నాగేశ్వరరావు(KNR ) కొయ్యలగూడెం మండలం గవరవరం గ్రామంలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల నుంచి వచ్చిన సూచనలు, సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు కేఎన్ఆర్ కు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల ఆత్మీయతకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని సోదరీమణులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేసిన కేఎన్ఆర్, రాఖీ కట్టిన గవరవరం మహిళలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సోదర–సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలని ఆకాంక్షించారు.
పశ్చిమగోదావరి జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త : భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ పౌర్ణమి వేడుకలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా దేవస్థానంలో యథావిధిగా నిర్వహించే చండీహోమాన్ని ఆలయ అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రజల క్షేమం, పాడిపంటలు సమృద్ధిగా పండడం, వ్యాపారాభివృద్ధి, ఆయురారోగ్యాలు, సకల సంపదలు చేకూరాలనే సంకల్పంతో నిర్వహించిన ఈ చండీహోమంలో 99 మంది దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు. భక్తులకు కనువిందు చేసిన అష్టభుజ శ్రీ మహాలక్ష్మి అవతారం : దేవస్థానం ఉత్సవ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 18 చేతులతో కూడిన అష్టభుజ శ్రీ మహాలక్ష్మి ఉత్సవమూర్తి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అమ్మవారి ఉత్సవమూర్తి చుట్టూ వివిధ దేవతామూర్తుల ముద్రలతో నవకలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ అలంకరణ, పూజా విధానం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. చండీహోమం సందర్భంగా వేదపండితుల మంత్రోచ్ఛారణలు, హోమగుండం నుంచి వె...
ఏలూరు జిల్లా : కైకలూరు : స్వచ్ఛవార్త : కైకలూరు కరగట్టు శివారున ఉన్న శ్రీ శివనాగేంద్రస్వామి ఆలయం వద్ద శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. స్వామివారి ఆలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన అమ్మవారి రూపం వద్ద ముత్తయిదువులంతా అమ్మవారికి పూజలు నిర్వహించారు. తొలుత దానగూడెం రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద నుంచి కాలనీవాసులు, భక్తులు అమ్మవారికి మంగళవాయిద్యాలతో కలిసి శ్రావణమాస సారె తీసుకువచ్చారు. స్వామివారికి, అమ్మవారికి శ్రావణమాస సారె అందించారు. అనంతరం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. సుమారు 120 మంది ముత్తయిదువులు సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొని పూజలు చేశారు. ముత్తయిదువులకు దాతల సహకారంతో పూజాసామాగ్రి, జాకెట్లు, గాజులు, పసుపుకుంకుమ తాంబూలంతోపాటు లక్ష్మీదేవి అమ్మవారి వెండి కాయిన్, రాగి రూపు అందించారు. భక్తులకు దాతలు ఉచిత ప్రసాదం అందించారు. కార్యక్రమంలో దాతలు, భక్తులు, ముత్తయిదువులు పాల్గొన్నారు.
ప.గో జిల్లా : తణుకు : స్వచ్ఛవార్త : తణుకు పట్టణం రూట్స్ పాఠశాలలో సజ్జాపురం లయన్స్ క్లబ్, భారత్ బయోటెక్ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు గురువారం టైఫాయిడ్ నివారణ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా టైఫాయిడ్ వంటి వ్యాధులను నివారించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా గ్లోబల్ యాక్షన్ టీమ్ లీడర్షిప్ కోఆర్డినేటర్ పుట్టా విజయశ్రీ తెలిపారు. తణుకులో మిగిలిన పాఠశాలల్లో కూడా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు. డాక్టర్ గుత్తుల బాలసుబ్రమణ్యం సూచనలతో 250 మంది విద్యార్థులకు టైఫాయిడ్ నివారణ టీకాలు వేశారు. కార్యక్రమంలో సజ్జాపురం లయన్స్ క్లబ్ కార్యదర్శి గమిని రమేష్, లయన్స్ సభ్యుడు పుట్టా రామచంద్రరావు, పాఠశాల డైరెక్టర్లు K. త్రిపాఠీ,N.V.S.S. సుధాకర్ వర్మ, B.విద్యాకాంత్, భారత్ బయోటెక్ కంపెనీ కోఆర్డినేటర్లు వేముల మురళి, ఠాగూర్ రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా : జంగారెడ్డిగూడెం : స్వచ్ఛవార్త : పట్టణంలో గత ఐదేళ్లుగా వైద్య సేవలు అందిస్తున్న సూర్యతేజ హాస్పిటల్‌ను ఎమర్జెన్సీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా అన్ని విభాగాల్లో ఆధునిక సదుపాయాలతో విస్తరించారు. నూతన సదుపాయాలతో కూడిన మల్టీ స్పెషాలిటీ విభాగాన్ని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. ఇప్పటికే ఐదేళ్లుగా వైద్య సేవలు అందిస్తున్న సూర్యతేజ హాస్పిటల్‌ను మరింత విస్తరించడం ద్వారా పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని అన్నారు. వివిధ వైద్య విభాగాలకు చెందిన నిపుణులు, స్పెషలిస్ట్ వైద్యులను అందుబాటులో ఉంచడం అభినందనీయమన్నారు. అత్యవసర పరిస్థితుల్లోనూ స్థానికంగానే వైద్య సేవలు పొందే అవకాశం ఉండటంతో ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ఆసుపత్రి ఫౌండర్లు, చైర్మన్లు కాసాని రామకృష్ణ, నూజల్ల హేమంత్ కుమార్, డైరెక్టర్లు పోలినాటి రవికిషోర్ (రాజా), డాక్టర్ పసుపులేటి దిలీప్ మాట్లాడుతూ ప్ర...
కృష్ణాజిల్లా : మచిలీపట్నం : స్వచ్ఛవార్త : మద్యం దశలవారీగా అరికడతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు బెల్ట్ షాపులకు అనుమతులు ఇచ్చి మద్యం విక్రయాలను మరింత పెంచుతోందని ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాకా రామచంద్రరావు తీవ్రస్థాయిలో ఆరోపించారు.కృష్ణాజిల్లా మచిలీపట్నంలో గురువారం ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ గంగాధర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వాకా రామచంద్రరావు మాట్లాడుతూ.. కల్లుగీత వృత్తి రాష్ట్రంలో రోజురోజుకూ కనుమరుగవుతోందని, దీనికి ప్రభుత్వ విధానాలే ప్రధాన కారణమని ఆరోపించారు. ఎన్నికల ముందు మద్యం దశలవారీగా నియంత్రిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బెల్ట్ షాపులను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నట్టుగా పరిస్థితి కనిపిస్తోందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయాయని, అనధికారికంగా పెద్దఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని ఆయన అన్నారు. కల్లుగీత కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాల...
పశ్చిమగోదావరి జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త : శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని భీమవరం పట్టణంలోని మావుళ్లమ్మవారి దేవస్థానంలో శుక్రవారం ఉదయం 8 గంటలకు విశేష చండీ హోమం నిర్వహించనున్నట్లు దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. లోకక్షేమం, సర్వజన సౌభాగ్యం, ప్రజల సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం ఈ వైదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. అమ్మవారి సన్నిధిలో వేదమంత్రోచ్ఛారణలు, చండీ పారాయణం, నవావరణ పూజలు, హోమం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఆలయ ఉత్సవ మండపంలో అష్టాదశ భుజ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ తెలిపారు. చండీ హోమంలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. సమాజంలో శాంతి, కుటుంబాల్లో సౌఖ్యం, ప్రజలకు ఆరోగ్యం, రైతులకు సమృద్ధి, వ్యాపారులకు అభివృద్ధి, సర్వజనులకు సుఖసంతోషాలు కలగాలనే సంకల్పంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొనాలని దేవస...
ఏలూరు జిల్లా : బుట్టాయగూడెం : స్వచ్ఛవార్త : మండలంలోని బూసరాజుపల్లి, ఆంధ్ర ప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల కళాశాల విద్యార్థులకు జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక పోలీస్ అధికారులు కొత్త చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. గురుకుల విద్యాలయాల ఆవరణలో గురువారం జరిగిన ఈ సదస్సులో పోలవరం డి.ఎస్.పి మాట్లాడుతూ.. మహిళలు, బాలికల పైన జరిగే నేరాలు గూర్చి వివరించారు. మహిళలు, బాలికలు ఏ విధంగా అప్రమత్తం గా వుండాలో అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు గూర్చి వివరిస్తూ సోషల్ మీడియా లో వారి వ్యక్తిగత సమాచారం పెట్టడం వలన జరిగే సైబర్ వేదింపుల గూర్చి విద్యార్ధులకు వివరించారు. అటువంటి నేరాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్త లు గూర్చి విద్యార్థులకు తెలిపారు. శక్తి యాప్ ఉపయోగాలు, డయల్ 112 గూర్చి చెప్పారు. పోలీస్ సేవలు24 గంటలు అందుబాటులో ఉంటాయని, ఎటువంటి సహాయం కావాలన్న 112 కి కాల్ చేయాలని చెప్పారు. ఈ అవగాహన సదస్సులో గురుకుల కళాశాల, పాఠశాల విద్యార్థులు, బోధన, బాధనేతర సిబ్బంది, బుట్టయిగూడెం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా : స్వచ్ఛవార్త : బీసీ, రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ అన్నారు. గురువారం చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేసిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శుభకార్యాల్లో పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో శ్రీనివాసపురం సొసైటీ గోడౌన్‌ను ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో కలిసి ప్రారంభించారు. అనంతరం ‘రెండేళ్ల కూటమి ప్రభుత్వం–అభివృద్ధి, సంక్షేమం’ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎంపీ మహేష్ మాట్లాడుతూ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. టీడీపీ అంటేనే బీసీల పార్టీ అని పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన ఎంపీ రైతులతో మాట్లాడారు. పొగాకు ధర ప్రస్తుతం కిలో రూ.293కు చేరిందని, మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. రైతులకు రూ.50 వేల వరకు వడ్డీలేని రుణ సదుపాయం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కిలోకు రూ.10 అదనపు సాయం అందిస్తున్నట్లు తెలిపార...
ఏలూరు జిల్లా : ఏలూరు : స్వచ్ఛవార్త : గతంలో పాదయాత్ర సందర్భంగా గుర్తించిన ప్రజా సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే దిశగా పనిచేస్తున్నామని జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఏలూరు నగరంలో 15వ ఆర్థిక సంఘం నిధులతో 26వ డివిజన్లో రూ.30.30 లక్షలు, 27వ డివిజన్లో రూ.45 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను గురువారం ఆర్టీసీ విజయవాడ జోన్-2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ : కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని, కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తోందని, ఏలూరుకు అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ ద్వారా సుమారు రూ.180 కోట్ల నిధులు రానున్నాయని బడేటి చంటి తెలిపారు. వాటితో రోడ్లు, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త : భీమవరంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మావుళ్లమ్మవారి దేవస్థానంలో భక్తులు సమర్పించిన కానుకల హుండీల లెక్కింపును గురువారం నిర్వహించారు. గత 79 రోజుల కాలానికి గాను భక్తుల నుంచి కానుకల రూపంలో మొత్తం ₹73,81,359 ఆదాయం సమకూరినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఓ ప్రకటనలో తెలిపారు. నగదుతో పాటు 23 గ్రాముల 150 మిల్లీగ్రాముల బంగారం, 360 గ్రాముల వెండి కానుకలుగా వచ్చినట్లు ఆయన వెల్లడించారు. కాకినాడ ఎంఎస్ఎన్ చారిటీస్ అసిస్టెంట్ కమిషనర్ చాగంటి సురేష్‌నాయుడు పర్యవేక్షణలో ఈ లెక్కింపు కార్యక్రమం పటిష్ట భద్రత నడుమ సాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, ధర్మకర్తల మండలి చైర్మన్ బొండాడ నాగభూషణం, పాలకమండలి సభ్యులు, బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది, ఆలయ ఉద్యోగులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
కృష్ణాజిల్లా : అవనిగడ్డ : స్వచ్ఛవార్త : అవనిగడ్డ గ్రామ పంచాయతీలో 2012–16 మధ్య కాలంలో సుమారు రూ.50 లక్షల నిధుల దుర్వినియోగానికి సంబంధించిన వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సామాజిక కార్యకర్త, యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్ ప్రతినిధి జంపాన శ్రీనివాస గౌడ్ చేసిన ఫిర్యాదు ఆధారంగా రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ వి.ఆర్. కృష్ణతేజ మైలవరపు నలుగురు అధికారులపై ‘ఆర్టికల్ ఆఫ్ ఛార్జెస్’ జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. లోకాయుక్తను ఆశ్రయించిన "జంపాన" : నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జంపాన శ్రీనివాస గౌడ్ 31 జనవరి 2020న లోకాయుక్తను ఆశ్రయించారు. కేసు నెం. 115/2020/లోక్/బి1 కింద ఫిర్యాదు దాఖలు చేశారు. ఫిర్యాదుతోపాటు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన లోకాయుక్త న్యాయమూర్తులు జస్టిస్ పి. లక్ష్మణరెడ్డి, జస్టిస్ పి. రజని సమగ్ర విచారణకు ఆదేశించారు. అనంతరం కృష్ణా జిల్లా పంచాయతీ అధికారి జె. అరుణ విచారణ నిర్వహించి నివేదిక సమర్పించారు. పంచాయతీరాజ్ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి–1991లోని రూల్ 9 ప్రకారం తదుపరి చర్యలు చేపట్టి, నలుగురిపై అభియోగాలను ఖరారు చేసినట్లు సమాచారం. నలుగురిపై అభియ...
ఏలూరు జిల్లా : కైకలూరు రూరల్ సర్కిల్ : స్వచ్ఛవార్త : మహిళలు, చిన్నారుల రక్షణ విషయంలో పోలీసు సిబ్బంది మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని కైకలూరు రూరల్ సీఐ వి. రవికుమార్ సూచించారు. మహిళలు, బాలలపై జరిగే నేరాలను ముందుగానే గుర్తించి అడ్డుకునే విధంగా గ్రామస్థాయిలో నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలు, డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ సూచనల మేరకు కైకలూరు రూరల్ సర్కిల్ పరిధిలోని కోరుకొల్లు, దొడ్డిపట్ల, ముదినేపల్లి, లింగాల హై స్కూల్ లలో గురువారం పోలీసులు విద్యార్థినులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. శక్తి యాప్ వినియోగంపై ప్రచారం : మహిళలు, బాలికలకు అత్యవసర పరిస్థితుల్లో రక్షణ కల్పించేందుకు ఉపయోగపడే శక్తి యాప్‌పై ప్రతి గ్రామంలో అవగాహన పెంచాలని సీఐ సూచించారు. మహిళా సంరక్షణ కార్యదర్శులు విద్యాసంస్థలు, గ్రామాల్లో విద్యార్థినులు, మహిళలకు యాప్ సేవలను వివరించాలని తెలిపారు. బాలల రక్షణ చట్టాలపై ప్రత్యేక దృష్టి : బాలలపై లైంగిక వేధింపులు, దాడులను అడ్డుకునేందుకు POCSO చట్టంపై అవగాహన కల్పించడంతో పాటు మైనర్ల హక్కులు, రక్షణకు సంబంధించిన జువైనల్ జస్టిస్ చట్టా...
ఏలూరు జిల్లా : కలిదిండి : స్వచ్ఛవార్త : మండలంలోని పెదలంక గ్రామంలో చాబత్తిన నరేంద్ర బాబు, ఛాయాదేవి దంపతుల కుమార్తె నవ దంపతులు చి||సౌ|| హనీ, చి|| జాన్ హైడ్ల వివాహ రిసెప్షన్ వేడుక గురువారం ఘనంగా నిర్వహించారు. చాబత్తిన నరేంద్ర బాబు ఆహ్వానం మేరకు జరిగిన ఈ కార్యక్రమానికి అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ అండ్రాజు శ్రీను, టీడీపీ నాయకులు మరియు రాష్ట్ర దళిత నాయకులు జక్కుల విజయ్ కుమార్, దళిత నాయకులు భూపతి దానియేలు, టీడీపీ నాయకులు నాగిడి రాజబాబు, ఏడుకొండలు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను నాయకులు అక్షింతలు వేసి ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, బంధువులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
పశ్చిమగోదావరి జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త : భీమవరం నుంచి కాళీపట్నం వెళ్లే ప్రధాన రహదారిపై జరుగుతున్న మున్సిపల్ డ్రైనేజీ నిర్మాణ పనులను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు (కేఎన్ఆర్) గురువారం పరిశీలించారు. డ్రైనేజీ తవ్వకాల కారణంగా వాహనదారులు, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన పరిశీలించారు. అనంతరం మున్సిపాలిటీ ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, నిర్మాణ పనుల సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలని కేఎన్ఆర్ అధికారులకు సూచించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ పనుల్లో వేగం పెంచాలని అధికారులను కోరారు.
- జగన్ రెడ్డికి ప్రజా సమస్యల కంటే.. రాజకీయమే ముఖ్యమైపోయింది... - ఐదేళ్ల వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థల్ని నాశనం చేశాడు... - రాష్ట్రంలో రైతాంగానికి అత్యంత ద్రోహం చేసింది జగన్ రెడ్డే... - బీసీలకు టీడీపీ బతుకునిస్తే.. వైసీపీ బుగ్గిపాలు చేసింది... - ఎన్ని అబద్దాలు చెప్పినా వైసీపీని ప్రజలు నమ్మేదే లేదని మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్... అమరావతి : స్వచ్ఛవార్త : రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక సాగునీటి రంగాన్ని, వ్యవసాయాన్ని ప్రథమ ప్రాథాన్యంగా తీసుకుని పాలన సాగిస్తున్నామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. వైసీపీ నేతల కల్తీ మద్యం నుండి, గంజాయి గూండాల నుండి, డ్రగ్స్ మాఫియాల నుండి కాపాడుకుంటున్నామన్నారు. ఈ మేరకు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, రైతుల సంక్షేమం, బీసీ రిజర్వేషన్లు, డ్రగ్స్, మద్యం, పెట్టుబడులు, ఉద్యోగాల అంశాలపై జగన్ చేస్తున్న విమర్శలు రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప ప్రజల కోసం ఏ మాత్రమూ కాదని ఆరోపించారు. జగన్ రెడ్డికి ప్రజల పట్ల చిత్తశుద్ధి, ప్రజాస్వామ్యం పట్ల బాద్యత ఉ...
కోట్లు వెచ్చించి డ్రీమ్ హోమ్ కొనుగోలు చేశారా..? కొద్ది నెలలకే గోడలపై తేమ, ప్లాస్టరింగ్ ఊడిపోవడం, స్లాబ్‌లలో క్రాక్స్ రావడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయా..? అయితే రేరా చట్టం గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. సాధారణంగా ఫ్లాట్ హ్యాండోవర్ ఇచ్చిన ఏడాది తిరగకుండానే బిల్డర్లు ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం, ఆ తర్వాత వచ్చే మేజర్ రిపేర్లకు నివాస సంఘాలు లేదా ఫ్లాట్ యజమానులే తమ సొంత జేబుల నుంచి లక్షలాది రూపాయలు ఖర్చు చేయడం నగరంలోని అనేక గేటెడ్ కమ్యూనిటీలలో నిత్యకృత్యంగా మారింది. అయితే, ఈ నిర్మాణ లోపాల బాధ్యత బిల్డర్దేనని, చట్టప్రకారం ఉచితంగా బాగుచేయించే హక్కు తమకు ఉందనే విషయం మెజారిటీ కొనుగోలుదారులకు తెలియడం లేదు. వాస్తవానికి రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(RERA) చట్టం కొనుగోలుదారులకు అత్యంత బలమైన భద్రతా కవచాన్ని కల్పించింది. "రెరా" చట్టం సెక్షన్ 14(3) ప్రకారం.. ప్లాట్ లేదా ఫ్లాట్ పొజిషన్ అప్పగించిన తేదీ నుంచి 5 ఏళ్ల వరకు ఆ భవనంలో ఎలాంటి స్ట్రక్చరల్ లోపాలు లేదా నాణ్యతా లోపాలు వచ్చినా దానికి పూర్తి బాధ్యత బిల్డర్‌దే. గోడల పగుళ్లు, ప్లాస్టరింగ్ లోపాలు, ప్లంబింగ్ సమస్యలు, స్లాబ్ లీకేజీలు ...
ఏలూరు జిల్లా : కలిదిండి : స్వచ్ఛవార్త : ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం పేదలంక గ్రామానికి చెందిన చి. దాసరి జాన్ హైడ్, అదే గ్రామానికి చెందిన హనీ వివాహ వేడుకలు బుధవారం పెదలంకలో ఘనంగా జరిగాయి. జాన్ హైడ్ ఆహ్వానం మేరకు టీడీపీ నాయకులు, రాష్ట్ర దళిత నాయకులు జక్కుల విజయ్ కుమార్, వాసురాజు, దళిత నాయకులు భూపతి దానియేలు, చాబత్తిన రాజు, టీడీపీ నాయకులు మానికొండ రాజారావు, జక్కుల మల్లేష్ తదితరులు వివాహ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : స్వచ్ఛవార్త : ఎంపీ ల్యాడ్స్ నిధులను అభివృద్ధి పనులకు సద్వినియోగం చేయడంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ దూకుడుగా ముందుకు సాగుతున్నారు. గత రెండేళ్లలో పార్లమెంటు పరిధిలో సుమారు రూ.9.38 కోట్ల విలువైన 102 పనులకు ప్రతిపాదనలు పంపగా, 96 పనులకు దాదాపు రూ.9 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వీటిలో 65 పనులు పూర్తికాగా, మరో 31 పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. 2024-25లో రూ.4.45 కోట్లు, 2025-26లో రూ.4.93 కోట్ల విలువైన పనులకు అనుమతులు లభించాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ల్యాబొరేటరీలు, ఆసుపత్రుల్లో పరికరాలు, అంబులెన్స్‌లు, క్రీడా సదుపాయాలు, వీధిలైట్లు, రహదారులు, సామాజిక సంక్షేమ భవనాలు తదితర పనులకు నిధులు కేటాయించారు. ఏలూరు పట్టణంలో రూ.64 లక్షలతో పోలీస్ బ్యారక్స్ నిర్మాణం పూర్తయింది. వివిధ సామాజిక వర్గాల సంక్షేమ భవనాల కోసం తొమ్మిది పనులకు రూ.2.86 కోట్ల మేర నిధులు కేటాయించారు. అలాగే ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో 54 శ్మశానవాటికల అభివృద్ధి పనులు చేపట్టారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికే రూ.2.88 కోట్ల విలువైన పనులకు ప్రతిపాదనలు పంపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి వ...
ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : స్వచ్ఛవార్త : ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకుని నందిగామలోని ప్రతిభ హైస్కూల్లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సందర్శించారు. ముస్లిం మత పెద్దలు, కూటమి నాయకులతో కలిసి శిబిరాన్ని పరిశీలించి రక్తదాతలను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ ... అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడే రక్తదానం గొప్ప మానవతా సేవ అని, సమాజంలో మానవతా విలువలను పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తాయని, ప్రవక్త బోధించిన ప్రేమ, దయ, సేవా భావాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలు సోదరభావంతో ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో మత పెద్దలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, యువత, రక్తదాతలు పాల్గొన్నారు.