Bhimavaram : భీమవరం శ్రీ మావుళ్లమ్మవారి కానుకల హుండీ ఆదాయం ₹73.81 లక్షలు
పశ్చిమ గోదావరి జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త :
భీమవరంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మావుళ్లమ్మవారి దేవస్థానంలో భక్తులు సమర్పించిన కానుకల హుండీల లెక్కింపును గురువారం నిర్వహించారు. గత 79 రోజుల కాలానికి గాను భక్తుల నుంచి కానుకల రూపంలో మొత్తం ₹73,81,359 ఆదాయం సమకూరినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఓ ప్రకటనలో తెలిపారు. నగదుతో పాటు 23 గ్రాముల 150 మిల్లీగ్రాముల బంగారం, 360 గ్రాముల వెండి కానుకలుగా వచ్చినట్లు ఆయన వెల్లడించారు.
కాకినాడ ఎంఎస్‌ఎన్ చారిటీస్ అసిస్టెంట్ కమిషనర్ చాగంటి సురేష్‌నాయుడు పర్యవేక్షణలో ఈ లెక్కింపు కార్యక్రమం పటిష్ట భద్రత నడుమ సాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, ధర్మకర్తల మండలి చైర్మన్ బొండాడ నాగభూషణం, పాలకమండలి సభ్యులు, బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది, ఆలయ ఉద్యోగులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
