📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

ఏలూరు జిల్లా : ముదినేపల్లి (స్వచ్ఛవార్త) :

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కైకలూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ అస్యూరెన్సెస్ కమిటీ చైర్మన్ డాక్టర్ కామినేని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శనివారం ముదినేపల్లిలోని వీ కన్వెన్షన్‌లో నిర్వహించిన కూటమి మండల స్థాయి సమావేశంలో ఆయన ఎన్నికలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ముదినేపల్లి జడ్పీటీసీ అభ్యర్థిగా టీడీపీ నాయకుడు బొర్రా చలమయ్యను, ఎంపీపీ అభ్యర్థిగా బీజేపీ నాయకుడు కోటప్రోలు కృష్ణ తల్లి కోటప్రోలు నాగరత్నకుమారిని ప్రకటించారు. కూటమి శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కామినేని సూచించారు.

సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ కొత్తా నాగేంద్రకుమార్ (నాగబాబు), ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం