Posts

Showing posts from September, 2026
📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Eluru : భూములు కోల్పోయే వారికి న్యాయం చేస్తాం : బాధితులకు ఎంపీ పుట్టా మహేష్‌ హామీ

Image
ఏలూరు జిల్లా : ఎంపీ కార్యాలయం : స్వచ్ఛవార్త : అభివృద్ధి పనులకు భూసేకరణలో ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, ఎవరికీ అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్‌ తెలిపారు. బుధవారం ఏలూరు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. అమరావతి–ఖరగ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే భూసేకరణలో భూములు, ఇళ్లు నష్టపోకుండా చూడాలని జంగారెడ్డిగూడెం మండలంలోని బయ్యనగూడెం, సీతంపేట, వీరన్నగూడెం, సరిపల్లి గ్రామాల ప్రజలు కోరారు. ఈ అంశంపై జాతీయ రహదారుల అధికారులతో, కేంద్ర మంత్రితో మాట్లాడి న్యాయం చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు నేవీ డిపోపై సీఎంతో చర్చ : కొయ్యలగూడెం మండలం బోడిగూడెం గ్రామస్థులు నేవీ ఆయుధ డిపో కోసం భూములు కోల్పోతున్న తమ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేయగా, ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఎంపీ తెలిపారు. రైతులకు, గ్రామస్థులకు న్యాయమైన పరిహారం, హామీల అమలు అనంతరం ప్రజల అంగీకారంతోనే ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. కూటమి ఐక్యతతో స్థానిక ఎన్నికలపై తీర్మానం : అనంతర...

Mandavalli : లింగాలలో సీసీ కెమెరాల ఏర్పాటు.. ఎమ్మెల్యే డా. కామినేని చేతులు మీదుగా ప్రారంభం

Image
ఏలూరు జిల్లా : మండవల్లి : స్వచ్ఛవార్త : గ్రామంలో భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా లింగాల గ్రామంలో సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. గ్రామానికి చెందిన కతగని వెంకటేశ్వరరావు, బోయిడి సురేష్, బొమ్మిశెట్టి వెంకట శాస్త్రి, అనిశెట్టి రామకృష్ణల సహకారంతో ఏర్పాటు చేసిన నాలుగు సీసీ కెమెరాలను కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. కామినేని మాట్లాడుతూ : గ్రామంలో జరిగే కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉండేలా సీసీ కెమెరాలు దోహదపడతాయని ఎమ్మెల్యే తెలిపారు. నేరాల నియంత్రణతో పాటు, ఏదైనా ఘటన చోటుచేసుకున్నప్పుడు నిందితులను గుర్తించేందుకు, కేసుల దర్యాప్తులో కీలక ఆధారాలను సేకరించేందుకు కెమెరాల దృశ్యాలు ఉపయోగపడతాయన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల ప్రజల్లో భద్రతపై విశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు. “సేఫ్ సిటీ–సేఫ్ విలేజ్” లక్ష్యాన్ని గ్రామస్థాయిలో బలోపేతం చేయడంలో ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. గ్రామ భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకొచ్చిన దాతలను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో మండవల్లి పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ, లింగాల గ్రామ...

Tadepalligudem : ఎంఆర్‌ఎఫ్‌ కేంద్రంలో స్వచ్ఛతా కార్యక్రమం*

Image
ప.గో జిల్లా : తాడేపల్లిగూడెం : స్వచ్ఛవార్త : స్వచ్ఛత హి సేవ–2026లో భాగంగా తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో 24వ వార్డు ఎంఆర్‌ఎఫ్‌ (మెటీరియల్‌ రికవరీ ఫెసిలిటీ) కేంద్రంలో మంగళవారం శుభ్రతా కార్యక్రమం నిర్వహించారు. *కమిషనర్‌ ఎం. యేసుబాబు ఆధ్వర్యంలో* కేంద్రం పరిసరాల్లో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలను తొలగించారు. తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలను వేర్వేరుగా సేకరించడంపై సిబ్బంది, స్థానికులకు అవగాహన కల్పించారు. చెత్త నుంచి సంపద సృష్టించడంలో ఎంఆర్‌ఎఫ్‌ కేంద్రాలు కీలకమని, ప్రజలు ఇంటి నుంచే చెత్తను వేరు చేసి అందించాలని కమిషనర్‌ సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ అధికారులు, పారిశుధ్య, వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Kalidindi : మట్టగుంట జెడ్పీ ఉన్నత పాఠశాల SMC కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

Image
ఏలూరు జిల్లా : కలిదిండి : స్వచ్ఛవార్త : మండలంలోని మట్టగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ (SMC) నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా మంగళవారం జరిగింది. చైర్మన్‌గా కోపనాతి రాము, వైస్ చైర్మన్‌గా తెనాలి బేబీ ఎన్నికయ్యారు. అనంతరం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అండ్రాజు శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధిలో SMC కీలక పాత్ర పోషించాలని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతులు, మంచి విద్యా వాతావరణం కల్పించేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రతి విద్యార్థికి మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ లక్ష్య సాధనలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలని కోరారు. నూతనంగా ఎన్నికైన SMC కమిటీ సభ్యులకు శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేసి వ...

Machilipatnam : సమన్వయమే బలం.. కూటమి గెలుపే లక్ష్యం.. కూటమి సమన్వయ కమిటీ సమావేశంలో నేతలు

Image
కృష్ణాజిల్లా : మచిలీపట్నం : స్వచ్ఛవార్త : జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి అధ్యక్షతన కూటమి సమన్వయ కమిటీ సమావేశం శనివారం మచిలీపట్నంలో జరిగింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అనుసరించాల్సిన విధానాలు, మూడు పార్టీల మధ్య క్షేత్రస్థాయి సమన్వయం, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో, ఐక్యతతో ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా కూటమి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు. పదవులను ఆశించే నాయకులు, కార్యకర్తలు ఎంతోమంది ఉన్నప్పటికీ, ఎవరికి ఏ సీటు కేటాయించాలన్నది కూటమి పార్టీల అధిష్ఠానాలు నిర్ణయిస్తాయని, ఆ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించి కూటమి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని నాయకులు స్పష్టం చేశారు. అవసరమైన చోట వ్యక్తిగత ఆశలను పక్కనపెట్టి త్యాగాలకు కూడా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సీటు ఏ పార్టీకి దక్కిందనేది ముఖ్యం కాదు.. పోటీ చేసేది కూటమి అభ్యర్థి. అభ్యర్థి ఎవరిదైనా గెల...

Eluru : ‎పొగాకు రైతుల తరపున కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ పుట్టా మహేష్ కృతజ్ఞతలు.

Image
‎ఫలించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషి.. ‎రైతులు అదనంగా పండించిన పొగాకును ఎలాంటి పెనాల్టీ లేకుండా వేలం కేంద్రాల్లో అమ్ముకునేందుకు అనుమతిస్తూ కేంద్రం ఉత్తర్వులు.. ‎50 వేల చొప్పున వడ్డీ లేని రుణంపై కూడా నోటిఫికేషన్.. ‎అదనపు పొగాకు విక్రయాల అనుమతికి కృషి చేసిన ఎంపీకి పొగాకు రైతుల కృతజ్ఞతలు.. ‎ఏలూరు జిల్లా : ‎ఏలూరు ఎంపీ కార్యాలయం : స్వచ్ఛవార్త : రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీగా తాను చేసిన విజ్ఞప్తులు, రైతుల ఇబ్బందులు అర్థం చేసుకుని అదనపు పొగాకు అమ్మకాలకు అనుమతి ఇస్తూ కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వడం పట్ల ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. పొగాకు రైతుల తరపున కేంద్ర ప్రభుత్వానికి, పొగాకు బోర్డుకు ఎంపీ కృతజ్ఞతలు తెలియచేశారు.  ఈమేరకు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసిన ఎంపీ, పొగాకు బోర్డు గతంలోనే అంగీకరించిన విధంగా బార్న్‌కు రూ.50 వేల చొప్పున వడ్డీ లేని రుణానికి ఆమోదం తెలపడంతో పాటు, 2025-26 పంట కాలంలో  అదనపు పొగాకు విక్రయాలకు అనుమతి ఇస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం పట్ల ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.  పొగాకు బోర్డులో నమోదైన డీలర్లు, వ్యాపారులు ఎలాంటి పెనాల్టీలు,...

రాజమహేంద్రవరం : భారీ వర్షాలు, గోదావరి వరదలపై అప్రమత్తత

Image
ప్రభుత్వ ఉద్యోగులు సెలవులు పెట్టొద్దు.. ప్రధాన కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలి : జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తూ.గో జిల్లా : రాజమహేంద్రవరం : స్వచ్ఛవార్త : ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం, అలాగే గోదావరి నదికి ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో పనిచేస్తున్న అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, రెవెన్యూ శాఖ సిబ్బంది, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పోలీసు, విద్యుత్, నీటిపారుదల, రహదారులు, మున్సిపల్ తదితర అత్యవసర సేవల విభాగాల సిబ్బంది ఎటువంటి సెలవులు పెట్టరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇప్పటికే సెలవులో ఉన్న అధికారులు, సిబ్బంది కూడా వెంటనే తమ విధులు నిర్వహిస్తున్న ప్రధాన కార్యాలయాలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సేవలు అందించేందుకు ప్రతి శాఖకు చెందిన అధికారులు, సిబ్...

Kalidindi : స్థానిక ఎన్నికలకు పోలీసుల ముందస్తు కసరత్తు.. ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల పరిశీలన

Image
ఏలూరు జిల్లా : కలిదిండి : స్వచ్ఛవార్త : రాబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో కలిదిండి మండలంలోని వివిధ పోలింగ్ కేంద్రాలను కైకలూరు రూరల్ సీఐ వి. రవికుమార్, కలిదిండి ఎస్సై ఎస్.ఎస్.ఎస్. పవన్ కుమార్ శనివారం సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న వసతులు, భద్రతా పరిస్థితులను వారు పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ఆరా తీశారు. ఓటర్ల రాకపోకలకు అనుకూలంగా ఉండే పరిస్థితులు, అవసరమైన మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అవసరమైన చర్యలను పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత సిబ్బందికి సీఐ రవికుమార్, ఎస్సై పవన్ కుమార్ సూచించారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.

Bhimavaram : పౌర్ణమి సందర్భంగా శ్రీ మావుళ్లమ్మ సన్నిధిలో చండీహోమం

Image
ప.గో జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త : భీమవరం పట్టణంలోని ప్రముఖ ఆరాధ్యదైవం మావుళ్లమ్మవారి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా శనివారం చండీహోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో వేదపండితులు ప్రత్యేక పూజలు, చండీహోమ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 64 మంది దంపతులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్‌ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు గొంతెన రమణ, పాపోలు ఏడుకొండలు తదితరులు చండీహోమంలో పాల్గొన్నారు. పౌర్ణమి సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులతో పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, సమాజానికి శాంతి, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షిస్తూ చండీహోమం నిర్వహించినట్లు ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ బుద్ధ మహాలక్ష్మి నగేష్‌ తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.

Amaravati : అమరావతి ఉద్యమకారులకు డాక్టర్ మనోజ్ శ్రద్ధాంజలి.. విజయవాడలో పాస్టర్ల రూ.116 సాయం

Image
మందడంలో సంస్మరణ సభ.. అనంతరం విజయవాడలో పాస్టర్ల రూ.116 సాయం కార్యక్రమం అమరావతి/విజయవాడ : స్వచ్ఛవార్త : ఇటీవల జరిగిన వరుస దురదృష్టకర సంఘటనల్లో మృతి చెందిన అమరావతి ఉద్యమానికి చెందిన ఆత్మీయులకు శ్రద్ధాంజలి ఘటించేందుకు శనివారం ఉదయం మందడం గ్రామంలో సంస్మరణ సభ నిర్వహించారు. కట్టా రాజేంద్ర ఇంటి ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యుడు, అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ అంబుల మనోజ్ పాల్గొని ఆలూరి జతిన్, జేఏసీ సమన్వయకర్త ధనేకుల రామారావు, ఇడుపులపాటి ఎల్లేశ్వరరావులకు శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపారు. అమరావతి ఉద్యమంలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆలూరి జతిన్, ఉద్యమ విజయానికి జేఏసీ సమన్వయకర్తగా దిశానిర్దేశం చేసి న్యాయ పోరాటంలో కీలక పాత్ర పోషించిన ధనేకుల రామారావు, అమరావతి నిర్మాణం, ఉద్యమానికి మొదటి నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించిన ఇడుపులపాటి ఎల్లేశ్వరరావుల సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అనంతరం విజయవాడకు చేరుకున్న డాక్టర్ అంబుల మనోజ్ ఆధ్వర్యంలో స్థానిక ఐలాపురం హోటల్‌లో “అమరావతికి జీవం పోద్దాం–రూ.116 సాయం చేద్దాం” కార్యక్రమం నిర్వహించారు....

Kaikaluru : పార్టీ బలోపేతానికి సమన్వయంతో పనిచేస్తా : కొత్త

Image
పల్లా శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపిన కైకలూరు నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ నాగబాబు ఏలూరు జిల్లా : కైకలూరు : స్వచ్ఛవార్త : కైకలూరు నియోజకవర్గ టీడీపీ కన్వీనర్‌గా అత్యున్నత బాధ్యతలు అప్పగించేందుకు సహకరించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను టీడీపీ కేంద్ర కార్యాలయంలో కొత్త నాగేంద్రకుమార్ (నాగబాబు) మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. తనపై నమ్మకం ఉంచి నియోజకవర్గ పార్టీ కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించడంలో సహకరించినందుకు పల్లా శ్రీనివాస్‌కు నాగేంద్రకుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలియజేస్తూ శాలువాతో సత్కరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ, కూటమి అభ్యర్థులు నూరు శాతం విజయాన్ని సాధించేలా కృషి చేయాలని పల్లా శ్రీనివాస్ సూచించారు. పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని, కన్వీనర్ బాధ్యతను పదవిగా కాకుండా పార్టీ కోసం పనిచేసే బాధ్యతగా భావించాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నాగేంద్రకుమార్ మాట్లాడుతూ..  కన్వీనర్‌గా తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు ...

Gudlavalleru : కొండలమ్మ సన్నిధిలో భక్తులకు అన్నప్రసాద వితరణ

Image
కృష్ణాజిల్లా : గుడ్లవల్లేరు : స్వచ్ఛవార్త : మండలంలోని వేమవరం గ్రామంలో కొలువైన శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. విజయవాడకు చెందిన పుట్టగుంట రంగ, కనకదుర్గ, రాజారావు, నిర్మలాదేవి ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.  శుక్రవారం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శనం, క్యూలైన్లు, అన్నప్రసాద వితరణ తదితర ఏర్పాట్లను పర్యవేక్షించారు. అన్నప్రసాద వితరణకు సహకరించిన దాతలను దేవస్థానం ఈవో ఆకుల కొండలరావు శేషవస్త్రంతో సత్కరించి, అమ్మవారి లడ్డూ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ ఈడే మోహన్, ధర్మకర్తల మండలి సభ్యులు వడ్లమూడి రవీంద్రబాబు, కళ్లేపల్లి సుగుణశేఖర్ పాల్గొన్నారు.

Bhimavaram : స్థానిక ఎన్నికల్లో కూటమి 100 శాతం విజయం సాధించాలి : కేఎన్ఆర్

Image
టీడీపీ సర్వసభ్య సమావేశంలో కేఎన్ఆర్ శ్రేణులకు దిశానిర్దేశం.. పశ్చిమగోదావరి జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త : పశ్చిమగోదావరి జిల్లా నూతన జిల్లా పరిషత్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు భీమవరంలో శుక్రవారం నిర్వహించిన టీడీపీ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు (కేఎన్ఆర్) పాల్గొన్నారు. సమావేశంలో పార్టీ శ్రేణులతో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ..  సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ, అసలైన పరీక్ష రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలేనని అన్నారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు భీమవరం నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసి ఎన్నికలకు సమాయత్తం చేయడానికే ఈ ఫీడ్‌బ్యాక్ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. భీమవరం మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య 58కి పెరిగే అవకాశం ఉన్నందున వార్డులు, మండలాల వారీగా బలమైన అభ్యర్థుల సమాచారాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. పొత్తు ధర్మానికి కట్టుబడి ఉంటామని చెబుతూనే, గతంలో బీజేపీకి ఎంపీ, జనసేనకు ఎమ్మెల్యే స్థానాలను కేటాయించి గెలిపించుకున్నామని గుర్తుచేశారు. ఈసారి భీమవరం మున్సిపాలిట...

Ghantasala : జోరు వర్షంలోను కొనసాగిన వీఆర్ఏల దీక్ష.. ఘంటసాలపాలెంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పణ

Image
కృష్ణా జిల్లా : ఘంటసాలపాలెం, ఘంటసాల : స్వచ్ఛవార్త : వీఆర్ఏల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన సమ్మె భారీ వర్షంలో కూడా బుధవారం కొనసాగించారు.  ఈ సందర్భంగా ఘంటసాలపాలెం గ్రామంలోని చిన ఎస్సీ కాలనీ వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘంటసాల మండల వీఆర్ఏలు వినతిపత్రం అందించి నినాదాలు చేశారు. ముందుగా ఘంటసాల తహసీల్దార్ కార్యాలయం వద్ద శిబిరంలో వీఆర్ఏలు సమ్మె నిర్వహించారు.  మా న్యాయమైన సమస్యలను ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు తమ డిమాండ్లకు మద్దుతు తెలపాలని కోరారు.  కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం కృష్ణాజిల్లా సభ్యులు కొమ్ముకూరి బాబూజీ, మండల అధ్యక్షులు వక్కలగడ్డ వేణు గోపాలరావు, కార్యదర్శి నెరుసు వెంకటేశ్వరరావు, కోశాధికారి కొండేటి మౌనిక, వీఆర్ఏలు పాల్గొన్నారు.

Gudlavalleru : శ్రీ కొండలమ్మ ఆలయ అభివృద్ధికి మంత్రి ఆనం ప్రశంస.. శరవేగంగా పనులు సాగుతున్నాయని అభినందన

Image
కృష్ణా జిల్లా : గుడ్లవల్లేరు : స్వచ్ఛవార్త : మండలంలోని వేమవరం శ్రీ కొండలమ్మ ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్న తీరుపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రశంసలు కురిపించారు. ఆలయ చైర్మన్ ఈడే మోహన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి కొడాలి రామరాజు బుధవారం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ ఈడే మోహన్ ధర్మకర్తలతో కలిసి చేపడుతున్న ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ఆనం అభినందించారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రోత్సాహంతో ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్న తీరును ప్రశంసించారు. శ్రీ కొండలమ్మ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులు కేటాయించాలని చైర్మన్ ఈడే మోహన్, కొడాలి రామరాజు మంత్రిని కోరారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Paderu : రూ.50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఎస్ఆర్ జిల్లా డీఆర్ఓ

Image
అల్లూరి సీతారామరాజు జిల్లా : పాడేరు : స్వచ్ఛవార్త : జిల్లా డీఆర్ఓ (ఎఫ్‌ఏసీ) మారోతు వెంకట సూర్య లోకేశ్వరరావు రూ.50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కలెక్టరేట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అమ్ము సూర్య చక్రవర్తికి సంబంధించిన జీతాల బకాయిలు, పెండింగ్ వార్షిక ఇంక్రిమెంట్లు, పే స్కేల్ రెగ్యులరైజేషన్ బిల్లులను ఆమోదించేందుకు డీఆర్ఓ రూ.50 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీకి ఫిర్యాదు అందింది. దీంతో విశాఖపట్నం రేంజ్ ఏసీబీ అధికారులు పథకం ప్రకారం బుధవారం పాడేరు ఆర్‌డీవో కార్యాలయంలో దాడి నిర్వహించారు. బాధితుడి నుంచి రూ.50 వేల నగదును లోకేశ్వరరావు స్వీకరిస్తుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకున్న అనంతరం ఆయన చేతులకు రసాయన పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

Proddutur : విద్యుత్ వైర్ల చోరీ నిందితుల ముఠా అరెస్ట్

Image
ఆరుగురు నిందితులు, 15 ఏళ్ల బాలుడి అరెస్ట్..  రూ.5.40 లక్షల నగదు, 61 కిలోల వైర్లు, మూడు వాహనాలు స్వాధీనం.. కడప జిల్లా : ప్రొద్దుటూరు క్రైమ్ : స్వచ్ఛవార్త : ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ వైర్లను దొంగిలిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న ముఠాను రూరల్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ విభూకృష్ణ తెలిపారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. విద్యుత్ వైర్ల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాపై నిఘా పెట్టిన పోలీసులు, దర్యాప్తులో భాగంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో పోలిచెట్టి వెంకటేశ్వర్లు, మద్దికం కృష్ణయ్య, ముక్కమల్ల మహేష్, మాలికి సాయికిరణ్, పోలంకి రంగనాయకులు, మరో వ్యక్తితో పాటు 15 ఏళ్ల బాలుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ వెల్లడించారు. నిందితుల నుంచి రూ.5.40 లక్షల నగదు, 61 కిలోల విద్యుత్ వైర్లు, మూడు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దొంగతనాలకు ఉపయోగించినట్లు భావిస్తున్న వాహనాలను కూడా స్వాధీనం చేసుకుని తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల్లో జరిగిన విద్యుత్ వ...

Machilipatnam : మచిలీపట్నంలో గోవా షిప్‌యార్డు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం – ఎంపీ బాలశౌరి హర్షం

Image
కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ఎంపీ కార్యాలయం : స్వచ్ఛవార్త : మచిలీపట్టణం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గోవా షిప్‌యార్డు లిమిటెడ్ ఆధ్వర్యంలో భారీ రక్షణ, నౌకా నిర్మాణ ప్రాజెక్టు ఏర్పాటుకు బుధవారం రాష్ట్ర కేబినెట్ లో ఆమోదం తెలపడంపై మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి హర్షం వ్యక్తం చేశారు. ఈ కీలక ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర కేబినెట్‌కు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సుమారు రూ.8,000 కోట్ల పెట్టుబడితో మచిలీపట్టణం పోర్టు కేంద్రంగా గోవా షిప్‌యార్డు ఏర్పాటు కానుండటం నియోజకవర్గ పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యత కలిగిన పరిణామమని బాలశౌరి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 3,000 మందికి ప్రత్యక్షంగా, 5,000 మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని తెలిపారు. గోవా షిప్‌యార్డు లిమిటెడ్ చేపడుతున్న ఈ విస్తరణ ప్రాజెక్టు మచిలీపట్టణాన్ని రక్షణ, నౌకా నిర్మాణ రంగంలో కీలక కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. భారత నౌకాదళం, కోస్ట్‌గార్డ్ అవసరాలకు అనుగుణంగా నౌకా నిర...

Bhimavaram : అశ్వద్ధ గణపతి సన్నిధిలో ఎమ్మెల్యే రామాంజనేయులు చేతుల మీదుగా అన్నదానం

Image
భక్తులకు అన్నప్రసాదం.. 51 కేజీల లడ్డూ వితరణ పశ్చిమ గోదావరి జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త : పట్టణంలోని మావుళ్లమ్మవారి ఉపాలయమైన శ్రీ అశ్వద్ధ గణపతి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని బుధవారం భీమవరం ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. భక్తులకు స్వయంగా  అన్నప్రసాదాన్ని అందించి  కార్యక్రమంలో  పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాపేశ్వరానికి చెందిన సురుచి స్వీట్స్‌ వారు స్వామివారికి సమర్పించిన 51 కేజీల లడ్డూను ఎమ్మెల్యే రామాంజనేయులు భక్తులకు వితరణ చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఊరేగింపు కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Bhimavaram : రక్తదానంతో ప్రాణదాతలుగా నిలవాలి.. ఉచిత రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు, కేఎన్‌ఆర్

Image
పశ్చిమగోదావరి జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త : పట్టణంలోని మెంటేవారి తోటలో బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల సందర్భంగా బుధవారం నిర్వహించిన ఉచిత రక్తదాన శిబిరాన్ని భీమవరం శాసనసభ్యులు అంజిబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు (కేఎన్‌ఆర్) ప్రారంభించారు. ఈ సందర్భంగా అంజిబాబు, కేఎన్‌ఆర్ లు మాట్లాడుతూ..  అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారని, రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని, రక్తదానం చేయడం ద్వారా సమాజానికి విలువైన సేవ చేసినట్లవుతుందని పేర్కొన్నారు. పండుగలను సేవా కార్యక్రమాలతో అనుసంధానం చేయడం అభినందనీయమన్నారు. బాల గణేష్ యూత్ సభ్యులు మాట్లాడుతూ గణపతి నవరాత్రుల సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించాలనే ఉద్దేశంతో ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో యూత్ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

Kaikaluru : ఐదేళ్ల పదవీకాలం పూర్తి.. ఎంపీపీ అడవి కృష్ణకు కూటమి నేతల ఘన సత్కారం

Image
ఏలూరు జిల్లా : కైకలూరు : స్వచ్ఛవార్త : కైకలూరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా ఐదేళ్ల పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న అడవి కృష్ణను కైకలూరు నియోజకవర్గ కూటమి నాయకులు ఘనంగా సత్కరించారు. బుధవారం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఆయనను సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ..  గత ఐదేళ్లుగా కైకలూరు మండల అభివృద్ధికి అడవి కృష్ణ అందించిన సేవలను కొనియాడారు. మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా తన పదవీకాలంలో మండల అభివృద్ధి కార్యక్రమాల్లో కీలకంగా పనిచేశారని పేర్కొన్నారు. కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ నాయకత్వంలో అడవి కృష్ణ భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు బీకేఎం నాని, జనసేన నాయకుడు కొల్లి వరప్రసాద్ (బాబి), రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు డైరెక్టర్ నల్లగోపుల చలపతి, మాజీ సర్పంచ్ బోయిన శ్రీనివాస్, యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కరేటి శ్రీహరి, బీజేపీ మండల అధ్యక్షుడు జగదీష్, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు గంగుల అశోక్‌తో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Kaikaluru : డ్రైనేజీ సమస్యపై నేతల చొరవ.. రాచపట్నం ఎస్సీ, బీసీ కాలనీల్లో సమస్యకు తక్షణ పరిష్కారం

Image
ఏలూరు జిల్లా : కైకలూరు : స్వచ్ఛవార్త : రాచపట్నం గ్రామంలోని ఎస్సీ, బీసీ కాలనీల్లో పూడిపోయిన డ్రైనేజీలతో మురుగునీరు రోడ్లపైకి వచ్చి గ్రామస్తులు, పాఠశాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని టీడీపీ, రాష్ట్ర దళిత నాయకుడు జక్కుల విజయ్ కుమార్ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం సమస్యను పరిశీలించిన ఆయన వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామ సచివాలయ కార్యదర్శి టీ. శ్రీవిద్యకు తెలియజేశారు. జక్కుల విజయ్ కుమార్‌తో పాటు రాష్ట్ర దళిత నాయకులు పాట్రిక్ పాల్, మానికొండ రాజారావు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన గ్రామ సచివాలయ కార్యదర్శి వెంటనే సిబ్బందిని పంపి డ్రైనేజీ పూడిక తీయించారు. దీంతో కాలనీల్లో మురుగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. సమస్యను వెంటనే పరిష్కరించేందుక చొరవ చూపిన జక్కుల విజయ్ కుమార్, పాట్రిక్ పాల్, ఇతర నాయకులు, సచివాలయ సిబ్బందికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Kaikaluru : రాచపట్నంలో ఉపాధిహామీ పనులపై ఆడిట్

Image
ఏలూరు జిల్లా : కైకలూరు : స్వచ్ఛవార్త : మండలంలోని రాచపట్నం గ్రామ సచివాలయంలో మంగళవారం ఉపాధిహామీ పనులపై ఆడిట్ నిర్వహించారు. ఉపాధిహామీ పథకం కింద గ్రామంలో చేపట్టిన పనులు, వాటికి సంబంధించిన రికార్డులు, ఖర్చులు, పనుల అమలు తీరును పరిశీలించేందుకు డీఆర్‌పీ మహేష్ గ్రామానికి విచ్చేసి ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధిహామీ పనులకు సంబంధించిన రికార్డులను పరిశీలించడంతో పాటు పనుల వివరాలు, పథకం అమలు తీరుపై సంబంధిత సిబ్బందితో వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉపాధిహామీ పనులు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. ఆడిట్ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి టీ. శ్రీవిద్య, టీడీపీ, రాష్ట్ర దళిత నాయకుడు జక్కుల విజయ్‌కుమార్, జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు గొట్రూ పాల్ పాట్రిక్, యలవర్తి శివయ్య, మణికొండ రాజారావు, యలవర్తి కృష్ణ, చేబ్రోలు రాజు, గ్రామస్తులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Kaikaluru : మత్స్యకారుడికి రూ.24 లక్షల ఇన్సులేటెడ్ వాహనం.. తాళం నమూనా అందజేసిన ఎమ్మెల్యే కామినేని

Image
ఏలూరు జిల్లా : కైకలూరు : స్వచ్ఛవార్త : ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద 40 శాతం రాయితీతో మంజూరైన రూ.24 లక్షల విలువైన ఇన్సులేటెడ్ వాహనాన్ని లబ్ధిదారుడు కొండపల్లి శ్యాంబాబుకు కైకలూరు ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్ డా. కామినేని శ్రీనివాస్ మంగళవారం అందజేశారు. కైకలూరు మండలం కైకలూరులోని ట్రావెలర్స్ బంగ్లాలో జరిగిన కార్యక్రమంలో వాహన తాళం నమూనాను లబ్ధిదారుడికి అందించారు. ఈ సందర్భంగా కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ..  కూటమి ప్రభుత్వం పేదలకు జీవనోపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యంగా అనేక పథకాల ద్వారా సబ్సిడీలను అందిస్తూ అండగా నిలుస్తోందన్నారు. అందులో భాగంగానే మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద 40 శాతం రాయితీతో ఇన్సులేటెడ్ వాహనాన్ని మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ సబ్సిడీలను సద్వినియోగం చేసుకుని లబ్ధిదారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యుడు కమ్మిలి విఠల్‌రావు, నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ కొత్త నాగేంద్రకుమార్, ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Kalidindi : స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులపై వైసీపీ నేతల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం : అండ్రాజు శ్రీను

Image
ఏలూరు జిల్లా : కలిదిండి : స్వచ్ఛవార్త : విజయవాడలో డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్పడటం తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అండ్రాజు శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం కలిదిండి మండలంలోని మట్టగుంట గ్రామంలో ఆయన మాట్లాడుతూ... మెగా DSC-2025 ద్వారా ఉద్యోగాలు పొందిన స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, మెడల్స్‌తో తమ అర్హతలను వివరించేందుకు వచ్చిన సమయంలో వారిపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడటం బాధాకరమన్నారు. అర్హతలపై అనుమానాలు ఉంటే ఆధారాలతో అధికారులను లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి కానీ, ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడటం సరికాదన్నారు. నియామక ప్రక్రియపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా చట్టపరంగా పరిష్కరించుకోవాలని, రాజకీయ ఆందోళనల పేరుతో ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురిచేయడం మానుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులపై దాడికి పాల్పడిన వైసీపీనాయకులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, DSC ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులకు ప్రభుత్వం పూర్తి భద్రత కల్పించాలని అండ్రాజు శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని ...

Eluru : ఎక్సైజ్ రెన్యువల్ దరఖాస్తుల గడువు 23 వరకు పొడిగింపు

Image
  ఏలూరు జిల్లా : ఏలూరు : స్వచ్ఛవార్త : ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాల మేరకు రెన్యువల్ దరఖాస్తుల సమర్పణ గడువును మరో రెండు రోజులు పొడిగించినట్లు ఏలూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆవులయ్య సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. లైసెన్సుదారులు, ఎస్‌హెచ్‌ఓలు ఈ విషయాన్ని గమనించి నిర్ణీత గడువులోగా దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటివరకు రెన్యువల్ దరఖాస్తులు సమర్పించలేని లైసెన్సుదారులకు అదనపు అవకాశం కల్పిస్తూ గడువును ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు పొడిగించినట్లు తెలిపారు. సంబంధిత లైసెన్సుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని గడువు ముగిసేలోగా రెన్యువల్ అప్లికేషన్లను సమర్పించాలని సూచించారు. ఎక్సైజ్ శాఖకు సంబంధించిన రెన్యువల్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత అధికారులు, లైసెన్సుదారులు చర్యలు తీసుకోవాలని ఆవులయ్య కోరారు. ఈ గడువు పొడిగింపు విషయాన్ని ఎస్‌హెచ్‌ఓలు తమ పరిధిలోని లైసెన్సుదారులకు తెలియజేయాలని పేర్కొన్నారు.

Machilipatnam : ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం చూపితే ఉపేక్షించేదే లేదు : మంత్రి కొల్లు రవీంద్ర

Image
మచిలీపట్నంలో డ్రైనేజీ సమస్యను దగ్గరుండి పరిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర  మౌలిక సదుపాయాల ఫిర్యాదులకు 24 గంటల్లోనే పరిష్కారం చూపాలని ఆదేశం కృష్ణాజిల్లా : మచిలీపట్నం : స్వచ్ఛవార్త : తాగు నీరు, సాగు నీరు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సోమవారం మచిలీపట్నంలోని తోటవారితుళ్ల సెంటర్ వద్ద రోడ్డుపై మురుగు ప్రవహిస్తోందని ప్రజలు ఫిర్యాదు చేయడంతో మంత్రి స్వయంగా రంగంలోకి దిగారు.  పార పట్టి మురుగు కాలువల్లోని పూడిక తొలగించారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నియోజకవర్గంలో ఎక్కడ ఎలాంటి సమస్యపై ఫిర్యాదు వచ్చినా.. 24 గంటల్లోనే సమస్యకు పరిష్కారం చూపాలని సూచించారు. గత ఐదు సంవత్సరాలు అభివృద్ధిని గాలికి వదిలేశారు. మౌలిక సదుపాయాల ఊసే లేకుండా చేశారు.  కానీ నేడు అలాంటి పరిస్థితికి ఆస్కారం లేదు. ఎక్కడ సమస్య ఉందని ఫిర్యాదు వచ్చినా.. తక్షణమే పరిష్కరించాలి. ఎవరైనా అధికారులు నిర్లక్ష్యం వహించినట్లు గుర్తిస్తే చర్యలుంటా...

Machilipatnam : డ్రగ్స్ వినియోగం, అక్రమ విక్రయాల నియంత్రణకు సమగ్ర చర్యలు చేపట్టాలి – జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

Image
జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడుతో కలిసి నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశ సమీక్ష కృష్ణా జిల్లా : మచిలీపట్నం : స్వచ్ఛవార్త : జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ విక్రయాలను సమర్థవంతంగా అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు.  సోమవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్లో జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడుతో కలిసి ఈగల్, పోలీస్, విద్య, వైద్య తదితర శాఖల అధికారులతో నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించి డ్రగ్స్ నియంత్రణ చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..   విద్యాశాఖ అధికారులు సాధారణ తనిఖీలతో పాటు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, విద్యార్థుల ప్రవర్తనలో మార్పులు, తరగతులకు గైర్హాజరు, అనుమానాస్పద స్నేహ సంబంధాలు వంటి అంశాలను గమనించాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులకు సంబంధించిన అనుమానాస్పద సమాచారాన్ని గోప్యంగా అధికారులకు అందించే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాలని తెలిపారు. విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించిన ప్రాథమిక లక్షణాలను గుర్తించిన వెంటనే వారిపై క్రిమినల్ చర్యలకు బదులుగా అవసరమై...

Chintalapudi : రద్దయిన ఆర్టీసీ బస్సు సర్వీసును వెంటనే పునరుద్ధరించాలి : ఎమ్మెల్యే రోషన్‌కుమార్

Image
ఏలూరు జిల్లా : చింతలపూడి : స్వచ్ఛవార్త : నరసాపురం నుంచి కమలాపురం వెళ్లే ఆర్టీసీ బస్సు సర్వీసును ఇటీవల రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ బస్సుపై ఆధారపడే గ్రామీణ ప్రాంతాల ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఇతర రవాణా మార్గాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదనపు బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు సమయం, వ్యయంతో పాటు రాకపోకల్లో ఇబ్బందులు పడుతున్నారని పలువురు ఎమ్మెల్యే రోషన్‌కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రయాణికుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని సోమవారం ఎమ్మెల్యే రోషన్‌కుమార్ రెండు జిల్లాలకు చెందిన ఆర్టీసీ అధికారులతో మాట్లాడారు. రద్దయిన బస్సు సర్వీసును వెంటనే పునరుద్ధరించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రెండు జిల్లాల్లోని ఏడు నియోజకవర్గాల పరిధిలోని గ్రామాలను కలుపుతూ నడిచే ఈ బస్సు సర్వీసు విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, కూలీలు, వృద్ధులు తదితరులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదని ఎమ్మెల్యే తెలిపారు. బస్సు సర్వీసు రద్దుతో ఆయా గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను కోరారు.

Bhimavaram : శ్రీ ఎలైట్ ఐఏఎస్ అకాడమీని ప్రారంభించిన "కేఎన్ఆర్"

Image
పశ్చిమగోదావరి జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త  : పట్టణంలోని విజేత ఫ్రీ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ ఏలైట్ ఐఏఎస్ అకాడమీని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు (కేఎన్‌ఆర్) ప్రారంభించారు. ఈ సందర్భంగా అకాడమీ ద్వారా యువతకు పోటీ పరీక్షలకు మెరుగైన శిక్షణ అందించాలని ఆకాంక్షించారు. కేఎన్‌ఆర్ మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో 16,400 పోస్టులకు గాను ఈ అకాడమీ సంతృప్తికరమైన ఫలితాలు సాధించిందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్‌-1లో వివిధ కేటగిరీల కింద 892 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అకాడమీ ద్వారా అత్యధిక విజయాలు సాధించేలా విద్యార్థులు కష్టపడి చదవాలని కోరారు. కార్యక్రమంలో అకాడమీ చైర్మన్ గుడిసె రాము, ఓబిలిశెట్టి వెంకటేశ్వరులు, అకాడమీ ప్రిన్సిపాల్, సెక్రటరీ, సిబ్బంది, యువత, విద్యార్థులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

Kaikaluru : నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న టీడీపీ నాయకులు జక్కుల విజయ్

Image
ఏలూరు జిల్లా : కైకలూరు : స్వచ్ఛవార్త : మండలంలోని వదర్లపాడు బ్రాంచ్ సమీపంలోని కల్యాణ మండపంలో సోమవారం రాజ్ ట్రస్ట్ అధినేత గంటా రాజ్‌కుమార్ కుమారుడు రొనాల్డ్, సీతనపల్లి గ్రామానికి చెందిన షాలినిల నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. రాజ్ ట్రస్ట్ అధినేత గంటా రాజ్‌కుమార్, దళిత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్‌కుమార్ ఆహ్వానం మేరకు టీడీపీ నాయకులు, రాష్ట్ర దళిత నాయకుడు జక్కుల విజయ్‌కుమార్, రాష్ట్ర బీసీ నాయకుడు కట్టా రాఘవులు, ఆడుసుమిల్లి సంజీవరావు నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. కాబోయే వధూవరులు రొనాల్డ్, షాలినిలకు అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గంటా రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులతో పాటు ఆహ్వానితులు, బంధువులు, స్నేహితులు తదితరులు పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు.

Kalidindi : లో-వోల్టేజ్ సమస్యలకు చెక్.. కొండంగిలో రూ.4.95 కోట్ల విద్యుత్ సబ్‌స్టేషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే డా. కామినేని

Image
ఏలూరు జిల్లా : కలిదిండి : స్వచ్ఛవార్త : మండలంలోని కొండంగి గ్రామంలో రూ.4.95 కోట్ల ప్రభుత్వ నిధులతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను కైకలూరు ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్ డా. కామినేని శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. ఈ సబ్‌స్టేషన్ అందుబాటులోకి రావడంతో కొండంగి పరిసర గ్రామాల్లో లో-వోల్టేజ్ సమస్యలకు పరిష్కారం లభించడంతో పాటు గృహ, ఆక్వా, వ్యవసాయ రంగాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడనుంది. ఈ సందర్భంగా కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ..  కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తోందన్నారు. నియోజకవర్గంలో విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేయడంలో భాగంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో సబ్‌స్టేషన్లు నిర్మించామని తెలిపారు. ప్రజలు, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలనే లక్ష్యంతో కొండంగి సబ్‌స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఇప్పటివరకు కలిదిండి, మూలలంక సబ్‌స్టేషన్ల నుంచి దూర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా కావడంతో లో-వోల్టేజ్, విద్యుత్ అంతరాయాల సమస్యలు ఎదురయ్యేవని తెలిపారు. కొండంగి నుంచే విద్యుత్ సరఫరా చేయడం వ...

Machilipatnam : విద్యార్థుల హాజరు పెంచి.. పదో తరగతి ఫలితాలు మెరుగుపరచాలి : డీఈఓ

Image
కృష్ణా జిల్లా : మచిలీపట్నం : స్వచ్ఛవార్త : విద్యార్థుల హాజరు, పదో తరగతి ఫలితాల మెరుగుదలపై చర్చించేందుకు శనివారం చిలకలపూడి లేడీ ఆంప్తెల్, సీపీఎం హైస్కూళ్లలో క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించారు. సమావేశాలకు జిల్లా విద్యాశాఖాధికారి యు.వి. సుబ్బారావు హాజరై ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పదో తరగతి విద్యార్థుల విద్యా ప్రగతిని మెరుగుపరిచే లక్ష్యంతో ‘మిషన్ మార్చ్–2027’ కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు తప్పనిసరిగా ‘లీప్’ యాప్ డౌన్‌లోడ్ చేసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

Kaikaluru Rural Circle : ప్రశాంత వాతావరణంలో వినాయక విగ్రహ నిమజ్జనాలు

Image
4 మండలాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు : కైకలూరు రూరల్ సర్కిల్ సీఐ వి. రవికుమార్  ఏలూరు జిల్లా : కైకలూరు రూరల్ సర్కిల్ : స్వచ్ఛవార్త : వినాయక ఉత్సవ కమిటీ సభ్యులకు సూచనలు చేస్తున్న సీఐ రవికుమార్  కైకలూరు రూరల్ సర్కిల్ పరిధిలోని 4 మండలాల్లో 50 వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శనివారం కైకలూరు రూరల్ సర్కిల్ సిఐ వి.రవికుమార్ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జన కార్యక్రమాల భద్రత కోసం 20 మంది రిక్రూట్‌మెంట్ పోలీస్ కానిస్టేబుళ్లు (Recruit PCs), 80 మంది పోలీస్ సిబ్బందిని బందోబస్తులో వినియోగించారు. నిమజ్జన ప్రాంతాల్లో 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. అదేవిధంగా, నిమజ్జన ప్రదేశాలు, ఊరేగింపు మార్గాలు, పలు  ముఖ్యమైన ప్రాంతాలపై డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ప్రజలు, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులకు సహకరించి నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని పోలీసులు ఈసందర్భంగా సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్...