📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kalidindi : స్థానిక ఎన్నికలకు పోలీసుల ముందస్తు కసరత్తు.. ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల పరిశీలన

ఏలూరు జిల్లా : కలిదిండి : స్వచ్ఛవార్త :

రాబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో కలిదిండి మండలంలోని వివిధ పోలింగ్ కేంద్రాలను కైకలూరు రూరల్ సీఐ వి. రవికుమార్, కలిదిండి ఎస్సై ఎస్.ఎస్.ఎస్. పవన్ కుమార్ శనివారం సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న వసతులు, భద్రతా పరిస్థితులను వారు పరిశీలించారు.పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ఆరా తీశారు. ఓటర్ల రాకపోకలకు అనుకూలంగా ఉండే పరిస్థితులు, అవసరమైన మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అవసరమైన చర్యలను పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత సిబ్బందికి సీఐ రవికుమార్, ఎస్సై పవన్ కుమార్ సూచించారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం