TG : Bayyaram : రేవంత్ పాలనకు మద్దతుగా పాలాభిషేకం.. గంధంపల్లి-కొత్తపేటలో కాంగ్రెస్ శ్రేణుల సందడి
తెలంగాణ : బయ్యారం : స్వచ్ఛవార్త : తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పాలనకు మద్దతుగా గంధంపల్లి-కొత్తపేట గ్రామపంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్ పిలుపు మేరకు, మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు డాక్టర్ భూక్య ఉమా మురళీ నాయక్, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జూలకంటి సీతారాం రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గంధంపల్లి-కొత్తపేట గ్రామపంచాయతీ సర్పంచ్ భూక్య ప్రవీణ్ నాయక్ పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రజా పాలనకు ప్రతీకగా రేవంత్ పాలన : ఈ సందర్భంగా జూలకంటి సీతారాం రెడ్డి మాట్లాడుతూ. . బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అవినీతి, విధ్వంసం చోటుచేసుకున్నాయని విమర్శించారు. రేవంత్‌రెడ్డి పాలనలో తెలంగాణ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని అన్నారు. ఇది ప్రజా పాలన.. గడీల పాలన కాదని పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకుంటున్న ...