📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

TG : Bayyaram : రేవంత్ పాలనకు మద్దతుగా పాలాభిషేకం.. గంధంపల్లి-కొత్తపేటలో కాంగ్రెస్ శ్రేణుల సందడి

తెలంగాణ : బయ్యారం : స్వచ్ఛవార్త :

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పాలనకు మద్దతుగా గంధంపల్లి-కొత్తపేట గ్రామపంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్ పిలుపు మేరకు, మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు డాక్టర్ భూక్య ఉమా మురళీ నాయక్, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు.

బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జూలకంటి సీతారాం రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గంధంపల్లి-కొత్తపేట గ్రామపంచాయతీ సర్పంచ్ భూక్య ప్రవీణ్ నాయక్ పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ప్రజా పాలనకు ప్రతీకగా రేవంత్ పాలన :

ఈ సందర్భంగా జూలకంటి సీతారాం రెడ్డి మాట్లాడుతూ.. 

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అవినీతి, విధ్వంసం చోటుచేసుకున్నాయని విమర్శించారు. రేవంత్‌రెడ్డి పాలనలో తెలంగాణ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని అన్నారు. ఇది ప్రజా పాలన.. గడీల పాలన కాదని పేర్కొన్నారు.

పేద ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలకు మద్దతుగా పాలాభిషేకం నిర్వహించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజా సంక్షేమానికి కృషి చేస్తోందని అన్నారు.

కార్యక్రమంలో గ్రామపంచాయతీ మాజీ గ్రామశాఖ అధ్యక్షుడు కారుబోతుల రామ్మూర్తి, గ్రంథాలయ చైర్మన్ గట్టు శ్రీను, చల్ల సురేష్, భూక్య శ్రీను, పసుపులేటి సతీష్, పుల్లూరి బాలరాజు, కొత్త వినయ్‌బాబు, సభావత్ రాందాస్, పెనుగొండ పుల్లయ్య, భూక్య బాలకృష్ణ, మాచర్ల సుక్కయ్య, తిప్పారపు మదన్, పర్షిక రాజు, ఎస్‌కే యూసుఫ్, వడ్డే ఉదయ్, పుల్లూరి ప్రశాంత్, పున్నం రామయ్య, యాకుబ్తో పాటు మండల కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, గ్రామపంచాయతీ సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం