Posts

Showing posts from May, 2026
📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

International : హిమాలయ శిఖరారోహణకు సన్నద్ధం – ఎస్‌ఐ వెంకటేశ్వరరావు విజయవంతమైన శిక్షణ

Image
  కలిదిండి/ఇంటర్నేషనల్  : స్వచ్ఛవార్త : కలిదిండి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన ఎస్‌ఐ వి. వెంకటేశ్వరరావు హిమాలయ పర్వతారోహణకు సన్నద్ధమవుతూ ప్రతిష్టాత్మక శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు. డార్జిలింగ్‌లోని హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో 28 రోజులపాటు కఠినమైన శిక్షణ పొందారు. ఈ శిక్షణలో భాగంగా యుక్సోం నుండి 20 కిలోల బరువుతో వెస్ట్ సిక్కిం ప్రాంతం గుండా నేపాల్ సరిహద్దులో ఉన్న హెచ్‌ఎమ్‌ఐ బేస్ క్యాంప్ వరకు ట్రెక్కింగ్ చేశారు. 14500 అడుగుల ఎత్తులో -25 డిగ్రీల తీవ్ర చలిలో గ్లేసియర్ ట్రైనింగ్ పూర్తి చేశారు. అనంతరం 16500 అడుగుల ఎత్తులో ఉన్న మౌంట్ రెనోక్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారు. ఈ విజయంతో హిమాలయ పర్వతారోహణలో మరింత ముందుకు సాగేందుకు సిద్ధమవుతున్నారు.