By ప్రసాద్ జర్నలిస్ట్ (Editor -Surya Reddy)
స్వచ్ఛ వార్త
ఏలూరు జిల్లా : కైకలూరు టౌన్ (క్రైమ్), స్వచ్ఛవార్త : మనవడిని పాఠశాలలో దింపేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన టిప్పర్ లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మృతుని మనవడికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం ఉదయం ఏలూరు జిల్లా కైకలూరు ప్రభుత్వ జడ్పీ పాఠశాల సమీపంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కైకలూరు మండలం ఆటపాక గ్రామానికి చెందిన ముంగర దుర్గాప్రసాద్ (60) తన ఐదేళ్ల మనవడు మోక్షిత్ పవన్‌ను కైకలూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో దింపేందుకు శుక్రవారం ఉదయం స్కూటీపై బయలుదేరాడు. ప్రభుత్వ పాఠశాల సమీపానికి చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ లారీ (ఏపీ 07 టీఎఫ్ 4466) స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దుర్గాప్రసాద్ రోడ్డుపై పడిపోగా, టిప్పర్ లారీ అతని తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మనవడు మోక్షిత్ పవన్ రోడ్డుకు అవతలి వైపు పడటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న కైకలూరు పట్టణ ఇన్స్పెక్టర్ ఏవీఎస్ రామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదాన్ని పరిశీలించారు. స్థానికుల సహకారంతో మృతదేహాన్ని కైకలూరు ప్రభుత్వ ...
By ప్రసాద్ జర్నలిస్ట్ (Editor -Surya Reddy)
స్వచ్ఛ వార్త
ఏలూరు జిల్లా : కైకలూరు రూరల్ సర్కిల్ (స్వచ్ఛవార్త) : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా పరిధిలో ప్రశాంతకార వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసు అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా ఎస్పీ ప్రశాంత్ కిషోర్ ఆదేశాల మేరకు డి.ఎస్.పి శ్రవణ్ కుమార్ సూచనలతో కైకలూరు రూరల్ సీఐ వి రవికుమార్ పర్యవేక్షణలో గురువారం కైకలూరు రూరల్ సర్కిల్ పరిధి లోని కైకలూరు రూరల్, ముదినేపల్లి, కలిదిండి, మండవల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో ఆయా పోలీసు స్టేషన్ల అధికారులు పర్యటించి ఎన్నికల సమయంలో పాటించాల్సిన నియమ నిబంధనలు, శాంతిభద్రతల పరిరక్షణపై ప్రజలకు సూచనలు చేశారు. కైకలూరు రూరల్ ఎస్సై వి. రాంబాబు సీతనపల్లి, దొడ్డిపట్ల గ్రామాల్లో పర్యటించి గ్రామస్తులకు ఎన్నికల నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ముదినేపల్లి మండలంలోని అల...
By ప్రసాద్ జర్నలిస్ట్ (Editor -Surya Reddy)
స్వచ్ఛ వార్త
ఏలూరు/ మండవల్లి (స్వచ్ఛవార్త) : ప్రకృతి వైపరీత్యాల అనంతరం పారిశుద్ధ్యం నిర్వహణపై నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరించారు. మండవల్లి మండలంలోని పలు గ్రామాలలో గురువారం పర్యటించి పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరాల పునరుద్ధరణ పనులను పరిశీలించి, ప్రతీ ఒక్కరినీ కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండవల్లి మండలం నుచ్చిమిల్లి గ్రామంలో రోడ్లపై మురుగు నీరు నిలిచి ఉండడం, రోడ్లపై చెత్తను తీయించకపోవడంపై పంచాయతీ కార్యదర్శి పద్మ, ఎంపిడిఓ కె. రమణబాబు లపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై మురుగు నీరు, చెత్త కారణంగా దోమలు పెరిగి విషజ్వరాలు, అంటువ్యాధులు ప్రబలుతాయని, అధికారులు నిర్లక్ష్యం వీడి, తుఫాన్ అనంతరం పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని, శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. గ్రామంలోని గాలి ప్రవీణ్ బాబు, గాలి డాన్ బాస్, పరిసర గృహాల వారిని విద్యుత్ సరఫరా ఎప్పుడు వచ్చింది, త్రాగునీరు సక్రమంగా వస్తుందా లేదా, తుఫాన్ అప్రమత్తత, విద్య...
By ప్రసాద్ జర్నలిస్ట్ (Editor -Surya Reddy)
స్వచ్ఛ వార్త
కృష్ణా : జిల్లా పోలీస్ కార్యాలయం (స్వచ్ఛవార్త) : కృష్ణాజిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ అనంతరం, తదుపరి నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు (కౌంటింగ్) ప్రక్రియకు బ్యాలెట్ బాక్సుల భద్రత, కౌంటింగ్ సరళికి సంబంధించి కృష్ణా యూనివర్సిటీ, పెడన పల్లోటి స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ను జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఈరోజు పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద చేపట్టిన భద్రతా ఏర్పాట్లు, విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది సంఖ్య, సిబ్బంది విధుల కేటాయింపు, నిరంతర నిఘా తదితర అంశాలను ఎస్పీ గారు క్షుణ్ణంగా సమీక్షించారు. బ్యాలెట్ బాక్సుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్ లను స్ట్రాంగ్ రూమ్ కు తరలించే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కౌంటింగ్ సమయంలో వచ్చే ప్రజల వాహనాలు పార్కింగ్ విషయంలో చేపట్టవలసిన చర్యలను గూర్చి తెలిపారు. అదేవిధంగా, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లను పరిశీలి...
By ప్రసాద్ జర్నలిస్ట్ (Editor -Surya Reddy)
స్వచ్ఛ వార్త
ఏలూరు జిల్లా : ఏలూరు కలెక్టరేట్ (స్వచ్ఛవార్త) : జిల్లాలో నవంబర్ నెలకు సంబంధించిన సామాజిక పింఛన్ల పంపిణీ ఈనెల 30వ తేదీ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 2,52,397 మంది పింఛనుదారులకు రూ.111.04 కోట్లను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. అనివార్య కారణాల వల్ల అక్టోబర్ 30న పింఛను తీసుకోలేని లబ్ధిదారులకు నవంబర్ 5వ తేదీ వరకు పంపిణీ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీ కోసం జిల్లావ్యాప్తంగా 4,916 మంది గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగులను నియమించినట్లు తెలిపారు. నవంబర్ నెల పింఛన్ల పంపిణీపై మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ చెప్పారు. అక్టోబర్ 30న పింఛన్ల పంపిణీకి నగదు కొరత లేకుండా చూడాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. పింఛనుదారులకు ముందస్తుగా సమాచారం అందించి, పింఛను తీసుకునే సమయంలో సంబంధిత సచివాలయ సిబ్బందికి తమ ఇళ్ల వద్ద అందుబాటులో ఉండేలా చూడాలని జెడ్పీ సీఈవో ఎం. కృష్ణమోహన్, డీఆర్డీ...
By ప్రసాద్ జర్నలిస్ట్ (Editor -Surya Reddy)
స్వచ్ఛ వార్త
విజయవాడ : స్వచ్ఛవార్త : విజయవాడ నగర మేయర్ పదవికి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంగవీటి రాధాకృష్ణకు ఆంధ్రా తెలంగాణ రాధా రంగా మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ మద్దతు ప్రకటించింది. ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు అన్నాస పూర్ణచంద్రరావు( కాళ్లపాలెం బుజ్జి) ఆధ్వర్యంలో మిత్ర బృందం సభ్యులు గురువారం విజయవాడ బందర్ రోడ్డులోని కార్యాలయంలో రాధాకృష్ణను కలిసి ఎన్నికల సందర్భంగా తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు కాళ్లపాలెం బుజ్జి, మిత్ర బృందం సభ్యులు రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. నగర మేయర్ ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థికి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. ఆంధ్రా తెలంగాణ రాధా రంగా మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆయనకు మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సోషల్ మీడియా అధ్యక్షుడు చెల్లు వెంకట్‌తో పాటు యాళ్ల కళ్యాణ్, కూరెళ్ల కళ్యాణ్, గణిశెట్టి నాని, చలాగాళ్ల సాయి రామకృష్ణ, రవి బాబు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో అభ్యర్థికి మద్దతు తెలియజేసేందుకు మిత్ర బృందం సభ్యులంతా కలిసి కార్యాలయానికి వెళ్లారు. విజయవాడ నగర మేయర్ ఎన్నికల సందర్భంగా వంగవీటి రాధాకృష్ణను కల...
By ప్రసాద్ జర్నలిస్ట్ (Editor -Surya Reddy)
స్వచ్ఛ వార్త
ఏలూరు జిల్లా : ముదినేపల్లి (స్వచ్ఛవార్త) : ప్రజా రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని అమరావతి బ్రాండ్ అంబాసిడర్, వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి తండ్రి అంబుల మనోజ్ లు పిలుపునిచ్చారు. “అమరావతికి జీవం పోద్దాం – రూ.116 సాయం చేద్దాం” కార్యక్రమంలో భాగంగా ప్రజలందరూ ముందుకొచ్చి రాజధాని అభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ మనోజ్ మాట్లాడుతూ... రాజధాని అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, ప్రతి ఒక్కరూ తమకు తోచిన మొత్తాన్ని విరాళంగా అందించి అమరావతి నిర్మాణానికి సహకరించాలని అన్నారు. చిన్న మొత్తాల్లో అందించే విరాళాలు సైతం సమష్టి కృషికి బలాన్నిస్తాయని పేర్కొన్నారు. ఈ పిలుపునకు స్పందిస్తూ విజయవాడకు చెందిన జె.పి.ఎఫ్. (JPF) వ్యవస్థాపక అధ్యక్షుడు బి. దయానందం, ఆర్. రాజ్‌కుమార్ తమ రెండు కుటుంబాల తరఫున అమరావతి రాజధాని అభివృద్ధికి విరాళం అందించారు. గురువారం ఉదయం ముదినేపల్లిలోని ఆసుపత్రికి వచ్చిన వారు ఏపీసీఆర్డీఏ (APCRDA) క్యూఆర్ కోడ్ ద్వారా విరాళాన్ని చెల్లించారు. రెండు కుటుంబాలు కలిపి మొత్తం రూ.2,232 విరాళంగా అందించారు. అమరావతి అభివృద్ధికి తమ వంతు సహక...
By ప్రసాద్ జర్నలిస్ట్ (Editor -Surya Reddy)
స్వచ్ఛ వార్త
కృష్ణా : మచిలీపట్నం/ఎంపీ కార్యాలయము (స్వచ్ఛవార్త) : బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుఫాను నేపథ్యంలో మచిలీపట్టణం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మచిలీపట్టణం ఎంపీ వల్లభనేని బాలశౌరి సూచించారు. తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, అధికారులు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. తీర ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంతాల నివాసితులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలు, పాత భవనాలు, చెట్లకు దూరంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికారుల సూచనల మేరకు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని తెలిపారు. జనసైనికులు సహాయక చర్యల్లో పాల్గొనాలి : తుఫాను సమయంలో ప్రజలకు అండగా నిలవాలని ఎంపీ బాలశౌరి జనసేన నాయకులు, కార్యకర్తలకు సూచించారు. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చోట సహాయక చర్యల్లో పాల్గొనాలని, ఆహారం, తాగునీరు, మందులు వంటి అత్యవసర సదుపాయాలు అవసరమైన వారికి అందించేందుకు స...
By ప్రసాద్ జర్నలిస్ట్ (Editor -Surya Reddy)
స్వచ్ఛ వార్త
ప్రజలను అప్రమత్తం చేస్తూ.. అధికారులతో పరిస్థితిపై సమీక్ష... ప.గో జిల్లా : భీమవరం (స్వచ్ఛవార్త) : అర్నాబ్ తుఫాన్ ప్రభావంతో నష్టం జరిగిన భీమవరం నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు(కేఎన్ఆర్) బుధవారం పరిశీలించారు. తుఫాన్ కారణంగా ఎదురైన ఇబ్బందులపై స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, పరిస్థితులపై సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకుంటున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలిస్తూ, ప్రజల భద్రతకు సంబంధించి అధికారులతో సమన్వయం చేసుకున్నారు.
By ప్రసాద్ జర్నలిస్ట్ (Editor -Surya Reddy)
స్వచ్ఛ వార్త
ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలి... ఏలూరు జిల్లా : కైకలూరు (స్వచ్ఛవార్త) : అర్నాబ్ తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యుడు, ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్ డా. కామినేని శ్రీనివాస్ బుధవారం జోరువానలో పలు ప్రాంతాల్లో పర్యటించి తుఫాన్ ప్రభావాన్ని, నష్ట తీవ్రతను పరిశీలించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ సహాయక చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. తుఫాన్ ప్రభావం తగ్గే వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడి కనిపిస్తే వాటికి దూరంగా ఉండాలని, వెంటనే సంబంధిత అధికారులకు లేదా తన కార్యాలయ సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. రహదారులపై కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానిక పోలీసులు, వివిధ శాఖల అధికారులు గత రాత్రి నుంచే సహాయక చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఎమ్మెల్యే సూచించారు. తుఫాన్ ప్రారంభమైనప్పటి నుంచి ముఖ్యమంత్...
By ప్రసాద్ జర్నలిస్ట్ (Editor -Surya Reddy)
స్వచ్ఛ వార్త
ప.గో జిల్లా : భీమవరం/లోసరి (స్వచ్ఛవార్త) : అర్నాబ్ తుఫాన్ ధాటికి భీమవరం పట్టణం అల్లకల్లోలంగా మారింది. బుధవారం తెల్లవారుజామున వీచిన బలమైన గాలులకు భీమవరం మండలంలోని లోసరి రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు స్వయంగా చైన్సాతో చెట్లను కట్ చేసి తొలగించే చర్యల్లో పాల్గొన్నారు. సిబ్బందితో కలిసి రహదారిపై అడ్డుగా ఉన్న చెట్లను తొలగించి, వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు .
By ప్రసాద్ జర్నలిస్ట్ (Editor -Surya Reddy)
స్వచ్ఛ వార్త
ఏలూరు జిల్లా : కైకలూరు (స్వచ్ఛవార్త) : స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఐక్యతను చాటుతూ జనసేన పార్టీ ఆశావహులు తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటున్నారని ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ తెలిపారు. మంగళవారం ఆటపాకలోని తన కార్యాలయంలో జనసేన నాయకులు చనుమోలు చంద్రశేఖర్, కొల్లి వరప్రసాద్ (బాబీ), దాసరి రమేష్‌లతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ పిలుపు మేరకు కైకలూరు నియోజకవర్గంలో బలమైన స్థానాల్లో పోటీ చేసేందుకు పలువురు జనసేన నాయకులు జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారని వివరించారు. అయితే, పార్టీ తరఫున బీ-ఫారాలు పొందిన అభ్యర్థులకే అవకాశం కల్పిస్తూ, మిగిలిన ఆశావహులు నామినేషన్లు ఉపసంహరించుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారని తెలిపారు. అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆశావహులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకుంటున్నారని పేర్కొన్నారు. కైకలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున 16 ఎంపీటీసీ స్థానాలతో పాటు ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు జయమంగళ వెంకటరమణ వెల్లడించారు. కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య ఐక్యత కొనసాగించడం ముఖ్యమని, ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, ...
By ప్రసాద్ జర్నలిస్ట్ (Editor -Surya Reddy)
స్వచ్ఛ వార్త
ప.గో జిల్లా : భీమవరం (స్వచ్ఛవార్త) : భీమవరం, వీరవాసరం మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు పార్టీ తరఫున బీ-ఫారాలను అందజేశారు. మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి తోట సీతారామలక్ష్మి, జిల్లా ఎన్నికల పరిశీలకుడు భాష్యం రామకృష్ణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు అభ్యర్థులకు బీ-ఫారాలు అందించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు విజయమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.
By ప్రసాద్ జర్నలిస్ట్ (Editor -Surya Reddy)
స్వచ్ఛ వార్త
ఏలూరు జిల్లా : నూజివీడు (స్వచ్ఛవార్త) : తీవ్ర తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ప్రజలంతా పూర్తి అప్రమత్తంగా ఉండాలని మండల తహసీల్దార్ షేక్ షంషుద్దీన్ సూచించారు. సోమవారం అధికారులు, పంచాయతీ సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన, ప్రజలకు పలు రక్షణ సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. లోతట్టు ప్రాంతాలు మరియు పాత ఇళ్లలో నివసించే వారు ముందుజాగ్రత్తగా సమీపంలోని సురక్షిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని పిలుపునిచ్చారు. గాలులు, వర్షాల కారణంగా తెగిపడిన విద్యుత్ తీగలు, స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వద్దకు వెళ్లకుండా విద్యుత్ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పర్యటనలో వీఆర్వో ఎస్. సుబ్బారావు, పంచాయతీ కార్యదర్శి షేక్ రాహీదతో పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే స్థానిక అధికారులను సంప్రదించాలని అధికారులు తెలిపారు.
By ప్రసాద్ జర్నలిస్ట్ (Editor -Surya Reddy)
స్వచ్ఛ వార్త
అర్ణబ్ తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి – ప్రజల ప్రాణరక్షణే అత్యంత ప్రాధాన్యం పునరావాస కేంద్రాల్లో తాగునీరు, ఆహారం, మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు తప్పనిసరి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలపై జిల్లా అధికారులతో కలెక్టర్ డీకే బాలాజి సమీక్ష కృష్ణా :మచిలీపట్నం కలెక్టరేట్ (స్వచ్ఛవార్త) : అర్ణబ్ తుపాను నేపథ్యంలో ప్రజల ప్రాణనష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అప్రమత్తంగా ఉంటూ పటిష్టమైన ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ నుంచి జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తో కలిసి జిల్లా అధికారులతో పాటు తహసీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, తుపాను ముందస్తు చర్యలు, ప్రజల తరలింపు, పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు, అత్యవసర సహాయక చర్యలపై కలెక్టర్ సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... రాష్ట్ర స్థాయి ఆర్టిజిఎస్ నుంచి అందిన సమాచారం ప్రకారం తుపాను తన దిశను మార్చుకుని దక్షిణ దిశగా కదిలే అవక...
By ప్రసాద్ జర్నలిస్ట్ (Editor -Surya Reddy)
స్వచ్ఛ వార్త
ఏలూరు జిల్లా : ముదినేపల్లి (స్వచ్ఛవార్త) : మండలంలోని వైవాక గ్రామంలో ముదినేపల్లి జెడ్పీటీసీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు బొర్రా చలమయ్య సోమవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కైకలూరు, మండవల్లి, ముదినేపల్లి, కలిదిండి మండలాలకు చెందిన ఎన్డీఏ కూటమి బీసీ నాయకులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, బీజేపీ నాయకుడు గంగునేని వరప్రసాద్ ఆధ్వర్యంలో చలమయ్యను మర్యాదపూర్వకంగా కలిసి ఎన్నికల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కైకలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి కొత్త నాగబాబు, ఎంపీపీ అభ్యర్థి కోటప్రోలు నాగరత్నకుమారి తనయుడు, బీజేపీ నాయకుడు కోటప్రోలు కృష్ణ, కైకలూరు నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కట్టా గోపి, జక్కుల విజయ్, పెదగొన్నూరు మాజీ సర్పంచ్ నాగిరెడ్డి శివ, మరిపి శివ, బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బలే చిరంజీవి, పరసా ఏడుకొండలు, గుమ్మా రాము, దాసరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
By ప్రసాద్ జర్నలిస్ట్ (Editor -Surya Reddy)
స్వచ్ఛ వార్త
ఏలూరు జిల్లా : మండవల్లి (స్వచ్ఛవార్త) : స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సోమవారం మండవల్లి మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులకు మద్దతుగా పులపర్రు, దెయ్యంపాడు, చింతపాడు, కొవ్వాడలంక, మణుగులూరు, పెనుమాకలంక, నందిగామలంక, శ్రీరామనగరం, ఇంగిలిపాకలంక, మూడు తాళ్లపాడు, తక్కెళ్లపాడు, నుచిమిల్లి గ్రామాల్లో పర్యటించి ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ.. కొల్లేరు సమస్యకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచార కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
By ప్రసాద్ జర్నలిస్ట్ (Editor -Surya Reddy)
స్వచ్ఛ వార్త
కృష్ణా : గుడ్లవల్లేరు /వేమవరం (స్వచ్ఛవార్త) : ఆశ్వీయుజ పౌర్ణమి సందర్భంగా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలోని శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించిన అనంతరం ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి సన్నిధిలో రుద్ర సహిత చండీ హవనం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ముఖ్య అర్చకుడు రుద్రపాక శివ సంతోష్ శర్మ ఆధ్వర్యంలో దేవస్థాన సిబ్బంది సమిష్టిగా కృషి చేసి నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు, ధర్మకర్తల మండలి చైర్మన్ ఈడే వెంకట విష్ణు మోహనరావు, మండలి సభ్యురాలు నూతలపాటి లక్ష్మీ పావని, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. ఈ వివరాలను ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఒక ప్రకటనలో తెలిపారు.
By ప్రసాద్ జర్నలిస్ట్ (Editor -Surya Reddy)
స్వచ్ఛ వార్త
ప.గో జిల్లా : భీమవరం (స్వచ్ఛవార్త) : భీమవరం పట్టణంలోని ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో 41 రోజుల మండల దీక్ష మాలధారణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 160 మంది భక్తులు అమ్మవారి మాలలు ధరించి మండల దీక్షను ప్రారంభించినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి. హరిసూర్య ప్రకాష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మాలధారణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా జరిపించారు. అమ్మవారిపై భక్తితో మాలలు ధరించిన భక్తులు రానున్న 41 రోజుల పాటు నియమనిష్ఠలతో మండల దీక్షను ఆచరించనున్నారు. దీక్షా కాలంలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ అమ్మవారి అనుగ్రహం పొందేందుకు భక్తులు సిద్ధమయ్యారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం పాల్గొన్నారు. ఆలయంలో నిర్వహించిన మాలధారణ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
By ప్రసాద్ జర్నలిస్ట్ (Editor -Surya Reddy)
స్వచ్ఛ వార్త
ఏలూరు జిల్లా : కలిదిండి (స్వచ్ఛవార్త) : మట్టగుంట గ్రామంలో కూటమి ఎంపీటీసీ అభ్యర్థి తిరుమలశెట్టి ఈశ్వర పరశురాముడి విజయాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అండ్రాజు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కూటమి నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. జనసేన, బీజేపీ మద్దతుతో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థికి మద్దతుగా ఓటర్లను కలిసి ప్రచారం సాగించారు. ఈ సందర్భంగా అండ్రాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. అర్హులైన పేద కుటుంబాలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, తల్లికి వందనం, దీపం పథకం, అన్నదాత సుఖీభవ వంటి సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. మట్టగుంట గ్రామ సమగ్ర అభివృద్ధికి, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి తిరుమలశెట్టి ఈశ్వర పరశురాముడు కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రామ అ...
By ప్రసాద్ జర్నలిస్ట్ (Editor -Surya Reddy)
స్వచ్ఛ వార్త
కృష్ణా : గుడ్లవల్లేరు ( స్వచ్ఛవార్త) : మండలంలోని వేమవరం గ్రామంలోని కొలువై ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆదివారం అమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. సుమారు 15 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాలపొంగళ్ళు సమర్పించి తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చేపట్టిన ఏర్పాట్లను ఆలయ చైర్మన్ ఈడే వెంకట విష్ణు మోహనరావు, కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు, ధర్మకర్తల మండలి సభ్యులు కళ్లేపల్లి సుగుణ శేఖర్, వడ్లమూడి రవీంద్రబాబు పర్యవేక్షించారు. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. భక్తులు సౌకర్యవంతంగా దర్శనం చేసుకునేలా అవసరమైన చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గుడ్లవల్లేరు ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు కల్పించిన సౌకర్యాలు, ఏర్పాట్ల వివరాలను ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఒక ప్రకటనలో తెలిపారు.
By ప్రసాద్ జర్నలిస్ట్ (Editor -Surya Reddy)
స్వచ్ఛ వార్త
ఏలూరు జిల్లా : జీలుగుమిల్లి (క్రైమ్)/ స్వచ్ఛవార్త : స్థానిక మసీదు సెంటర్ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం రెండు మోటార్ సైకిళ్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. వేగంగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో టి. నర్సాపురం మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన ధారావతు భద్రం (60), బుట్టాయిగూడెం మండలం జోడేబోడె గూడెం గ్రామానికి చెందిన సింధూర్ (33) తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఇద్దరూ మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో ఆయా గ్రామాల్లో విషాదం నెలకొంది. జీలుగుమిల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
By ప్రసాద్ జర్నలిస్ట్ (Editor -Surya Reddy)
స్వచ్ఛ వార్త
ఏలూరు జిల్లా : కైకలూరు రూరల్[క్రైమ్] (స్వచ్ఛవార్త) : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం ఆలపాడు గ్రామంలో కైకలూరు రూరల్ ఎస్ఐ వి. రాంబాబు అవగాహన సమావేశం నిర్వహించారు. ఎన్నికల నియమ నిబంధనలు, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ చట్టాలను, ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. గ్రామంలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడుతూ ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా పోలీసు శాఖకు సహకరించాలని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వి. రాంబాబు హెచ్చరించారు.