📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Machilipatnam : తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎంపీ వల్లభనేని బాలశౌరి

కృష్ణా : మచిలీపట్నం/ఎంపీ కార్యాలయము (స్వచ్ఛవార్త) : 

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుఫాను నేపథ్యంలో మచిలీపట్టణం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మచిలీపట్టణం ఎంపీ వల్లభనేని బాలశౌరి సూచించారు. తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, అధికారులు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.

బుధవారం ఆయన మాట్లాడుతూ.. తీర ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంతాల నివాసితులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలు, పాత భవనాలు, చెట్లకు దూరంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికారుల సూచనల మేరకు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని తెలిపారు.

జనసైనికులు సహాయక చర్యల్లో పాల్గొనాలి :

తుఫాను సమయంలో ప్రజలకు అండగా నిలవాలని ఎంపీ బాలశౌరి జనసేన నాయకులు, కార్యకర్తలకు సూచించారు. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చోట సహాయక చర్యల్లో పాల్గొనాలని, ఆహారం, తాగునీరు, మందులు వంటి అత్యవసర సదుపాయాలు అవసరమైన వారికి అందించేందుకు సహకరించాలని కోరారు.

లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్నవారు, వృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లలు, ఇతర అవసరాల్లో ఉన్నవారికి సహాయం అందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అయితే, ప్రజలు తమ భద్రతను ప్రమాదంలో పెట్టకుండా, అధికారుల అనుమతి మరియు సూచనల మేరకే సహాయక చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి : 

తుఫాను కారణంగా ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎంపీ బాలశౌరి గారు కోరారు. లోతట్టు ప్రాంతాలు, తీర గ్రామాలు, ముంపు ముప్పు ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అవసరమైన చోట సహాయక శిబిరాలు, తాగునీరు, ఆహారం, వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు.

విద్యుత్, రహదారులు, తాగునీటి సరఫరా వంటి అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందనకు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని కోరారు.


షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం