Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం
కృష్ణా జిల్లా : గుడ్లవల్లేరు/వేమవరం(స్వచ్ఛవార్త) :
మండలంలోని వేమవరంలో కొలువై ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఈ నెల 18న నిర్వహించనున్న మహాఅన్న సమారాధనకు గుడివాడకు చెందిన రాజులపాటి లక్ష్మీనారాయణ 10 కట్టల బియ్యం (250 కిలోలు) విరాళంగా సమర్పించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
విరాళం అందజేసిన లక్ష్మీనారాయణను దేవస్థానం చైర్మన్ ఈడే వెంకట విష్ణు మోహన్ రావు, కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు సత్కరించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు.
ఈ నెల 18న నిర్వహించనున్న మహాఅన్న సమారాధనకు వస్తు రూపంలోగానీ, ధన రూపంలోగానీ విరాళాలు అందించదలచిన భక్తులు దేవస్థానం వద్ద సమర్పించి తగిన రసీదు పొందాలని.. అలాగే దాతలు నేరుగా ఆన్లైన్ ద్వారా account కు జమ చేయవచ్చునని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు కోరారు.
