Showing posts with the label రాజకీయం
📅 డేట్ లోడింగ్...
|
⏰ టైమ్ లోడింగ్...
వీరవాసరం మండలంలో 19 ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకోవాలి ప.గో జిల్లా : వీరవాసరం (స్వచ్ఛవార్త) : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు (కేఎన్ఆర్) పిలుపునిచ్చారు. శనివారం ఆయన సభ్యులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వీరవాసరం మండలంలో జెడ్పీటీసీతో పాటు 19 ఎంపీటీసీ స్థానాల్లోనూ వందకు వంద శాతం విజయం సాధించి, అత్యధిక మెజారిటీతో కూటమి సత్తా చాటాలని అన్నారు. గతంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు, ఒత్తిళ్లను ఎదుర్కొంటూ వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ధైర్యంగా ఎదిరించి నిలబడిన ఘనత వీరవాసరం మండలానిదని కేఎన్ఆర్ పేర్కొన్నారు. 2019 నుంచి 2024 వరకు ఎదురైన రాజకీయ ప్రతికూల పరిస్థితుల్లోనూ కార్యకర్తలు వెనుకడుగు వేయకుండా పోరాటం చేశారని గుర్తుచేశారు. జిల్లాలో రెండు జెడ్పీటీసీ, రెండు ఎంపీటీసీ స్థానాల్లో కూటమి పక్షాలు విజయం సాధించగా, అందులో వీరవాసరం మండలం కీలక పాత్ర పోషించిందన్నారు. రాష్ట్రంలో టీ...
విజయవాడ : స్వచ్ఛవార్త : విజయవాడ నగర మేయర్ పదవికి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంగవీటి రాధాకృష్ణకు ఆంధ్రా తెలంగాణ రాధా రంగా మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ మద్దతు ప్రకటించింది. ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు అన్నాస పూర్ణచంద్రరావు( కాళ్లపాలెం బుజ్జి) ఆధ్వర్యంలో మిత్ర బృందం సభ్యులు గురువారం విజయవాడ బందర్ రోడ్డులోని కార్యాలయంలో రాధాకృష్ణను కలిసి ఎన్నికల సందర్భంగా తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు కాళ్లపాలెం బుజ్జి, మిత్ర బృందం సభ్యులు రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. నగర మేయర్ ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థికి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. ఆంధ్రా తెలంగాణ రాధా రంగా మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆయనకు మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సోషల్ మీడియా అధ్యక్షుడు చెల్లు వెంకట్‌తో పాటు యాళ్ల కళ్యాణ్, కూరెళ్ల కళ్యాణ్, గణిశెట్టి నాని, చలాగాళ్ల సాయి రామకృష్ణ, రవి బాబు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో అభ్యర్థికి మద్దతు తెలియజేసేందుకు మిత్ర బృందం సభ్యులంతా కలిసి కార్యాలయానికి వెళ్లారు. విజయవాడ నగర మేయర్ ఎన్నికల సందర్భంగా వంగవీటి రాధాకృష్ణను కల...
కృష్ణా : మచిలీపట్నం/ఎంపీ కార్యాలయము (స్వచ్ఛవార్త) : బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుఫాను నేపథ్యంలో మచిలీపట్టణం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మచిలీపట్టణం ఎంపీ వల్లభనేని బాలశౌరి సూచించారు. తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, అధికారులు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. తీర ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంతాల నివాసితులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలు, పాత భవనాలు, చెట్లకు దూరంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికారుల సూచనల మేరకు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని తెలిపారు. జనసైనికులు సహాయక చర్యల్లో పాల్గొనాలి : తుఫాను సమయంలో ప్రజలకు అండగా నిలవాలని ఎంపీ బాలశౌరి జనసేన నాయకులు, కార్యకర్తలకు సూచించారు. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చోట సహాయక చర్యల్లో పాల్గొనాలని, ఆహారం, తాగునీరు, మందులు వంటి అత్యవసర సదుపాయాలు అవసరమైన వారికి అందించేందుకు స...
ప్రజలను అప్రమత్తం చేస్తూ.. అధికారులతో పరిస్థితిపై సమీక్ష... ప.గో జిల్లా : భీమవరం (స్వచ్ఛవార్త) : అర్నాబ్ తుఫాన్ ప్రభావంతో నష్టం జరిగిన భీమవరం నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు(కేఎన్ఆర్) బుధవారం పరిశీలించారు. తుఫాన్ కారణంగా ఎదురైన ఇబ్బందులపై స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, పరిస్థితులపై సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకుంటున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలిస్తూ, ప్రజల భద్రతకు సంబంధించి అధికారులతో సమన్వయం చేసుకున్నారు.
ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలి... ఏలూరు జిల్లా : కైకలూరు (స్వచ్ఛవార్త) : అర్నాబ్ తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యుడు, ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్ డా. కామినేని శ్రీనివాస్ బుధవారం జోరువానలో పలు ప్రాంతాల్లో పర్యటించి తుఫాన్ ప్రభావాన్ని, నష్ట తీవ్రతను పరిశీలించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ సహాయక చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. తుఫాన్ ప్రభావం తగ్గే వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడి కనిపిస్తే వాటికి దూరంగా ఉండాలని, వెంటనే సంబంధిత అధికారులకు లేదా తన కార్యాలయ సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. రహదారులపై కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానిక పోలీసులు, వివిధ శాఖల అధికారులు గత రాత్రి నుంచే సహాయక చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఎమ్మెల్యే సూచించారు. తుఫాన్ ప్రారంభమైనప్పటి నుంచి ముఖ్యమంత్...
ఏలూరు జిల్లా : కైకలూరు (స్వచ్ఛవార్త) : స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఐక్యతను చాటుతూ జనసేన పార్టీ ఆశావహులు తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటున్నారని ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ తెలిపారు. మంగళవారం ఆటపాకలోని తన కార్యాలయంలో జనసేన నాయకులు చనుమోలు చంద్రశేఖర్, కొల్లి వరప్రసాద్ (బాబీ), దాసరి రమేష్‌లతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ పిలుపు మేరకు కైకలూరు నియోజకవర్గంలో బలమైన స్థానాల్లో పోటీ చేసేందుకు పలువురు జనసేన నాయకులు జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారని వివరించారు. అయితే, పార్టీ తరఫున బీ-ఫారాలు పొందిన అభ్యర్థులకే అవకాశం కల్పిస్తూ, మిగిలిన ఆశావహులు నామినేషన్లు ఉపసంహరించుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారని తెలిపారు. అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆశావహులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకుంటున్నారని పేర్కొన్నారు. కైకలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున 16 ఎంపీటీసీ స్థానాలతో పాటు ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు జయమంగళ వెంకటరమణ వెల్లడించారు. కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య ఐక్యత కొనసాగించడం ముఖ్యమని, ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, ...
ప.గో జిల్లా : భీమవరం (స్వచ్ఛవార్త) : భీమవరం, వీరవాసరం మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు పార్టీ తరఫున బీ-ఫారాలను అందజేశారు. మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి తోట సీతారామలక్ష్మి, జిల్లా ఎన్నికల పరిశీలకుడు భాష్యం రామకృష్ణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు అభ్యర్థులకు బీ-ఫారాలు అందించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు విజయమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా : ముదినేపల్లి (స్వచ్ఛవార్త) : మండలంలోని వైవాక గ్రామంలో ముదినేపల్లి జెడ్పీటీసీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు బొర్రా చలమయ్య సోమవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కైకలూరు, మండవల్లి, ముదినేపల్లి, కలిదిండి మండలాలకు చెందిన ఎన్డీఏ కూటమి బీసీ నాయకులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, బీజేపీ నాయకుడు గంగునేని వరప్రసాద్ ఆధ్వర్యంలో చలమయ్యను మర్యాదపూర్వకంగా కలిసి ఎన్నికల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కైకలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి కొత్త నాగబాబు, ఎంపీపీ అభ్యర్థి కోటప్రోలు నాగరత్నకుమారి తనయుడు, బీజేపీ నాయకుడు కోటప్రోలు కృష్ణ, కైకలూరు నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కట్టా గోపి, జక్కుల విజయ్, పెదగొన్నూరు మాజీ సర్పంచ్ నాగిరెడ్డి శివ, మరిపి శివ, బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బలే చిరంజీవి, పరసా ఏడుకొండలు, గుమ్మా రాము, దాసరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా : మండవల్లి (స్వచ్ఛవార్త) : స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సోమవారం మండవల్లి మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులకు మద్దతుగా పులపర్రు, దెయ్యంపాడు, చింతపాడు, కొవ్వాడలంక, మణుగులూరు, పెనుమాకలంక, నందిగామలంక, శ్రీరామనగరం, ఇంగిలిపాకలంక, మూడు తాళ్లపాడు, తక్కెళ్లపాడు, నుచిమిల్లి గ్రామాల్లో పర్యటించి ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ.. కొల్లేరు సమస్యకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచార కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా : కలిదిండి (స్వచ్ఛవార్త) : మట్టగుంట గ్రామంలో కూటమి ఎంపీటీసీ అభ్యర్థి తిరుమలశెట్టి ఈశ్వర పరశురాముడి విజయాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అండ్రాజు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కూటమి నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. జనసేన, బీజేపీ మద్దతుతో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థికి మద్దతుగా ఓటర్లను కలిసి ప్రచారం సాగించారు. ఈ సందర్భంగా అండ్రాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. అర్హులైన పేద కుటుంబాలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, తల్లికి వందనం, దీపం పథకం, అన్నదాత సుఖీభవ వంటి సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. మట్టగుంట గ్రామ సమగ్ర అభివృద్ధికి, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి తిరుమలశెట్టి ఈశ్వర పరశురాముడు కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రామ అ...
ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం (స్వచ్ఛవార్త) : చింతలపూడి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు తొలగిపోయాయని, వచ్చే నవంబర్లోనే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పనులు త్వరగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సగానికి పైగా పూర్తయిన చింతలపూడి ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని ఎంపీ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఉన్న అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగిస్తూ ముందుకు సాగుతోందన్నారు. ఇటీవల కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ కూడా ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. లక్ష ఎకరాలకు సాగునీరు : చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తయితే ఏలూరు జిల్లాలో దాదాపు లక్ష ఎకరాలకు కాలువల ద్వారా సాగునీరు అందుతుందని ఎంపీ వివరించారు. చింతలపూడి, నూజివీడు నియోజకవర్గాల్లోని మెట్ట ప్రాంత రైతుల భూములకు సమృద్ధిగా నీరు అందుతుందని చెప్పారు. కాలువలు, చెరువులు నింపడం ద్వారా భూగర్భ జలాలు పెరిగి, తాగునీటి సమస్యలు కూ...
ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆధ్వర్యంలో జీలుగుమిల్లిలో నామినేషన్ల సమర్పణ ఏలూరు జిల్లా : జీలుగుమిల్లి (స్వచ్ఛవార్త) : జీలుగుమిల్లి మండలంలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో 9 ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేస్తున్న కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) అభ్యర్థులు శుక్రవారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ముందుగా బర్రింకలపాడులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరారు. అనంతరం జీలుగుమిల్లి ప్రధాన కూడలికి చేరుకుని జగదాంబ అమ్మవారిని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అభ్యర్థులతో కలిసి దర్శించుకున్నారు. అక్కడి నుంచి తీన్మార్ డప్పుల నడుమ ఉత్సాహంగా ర్యాలీగా జీలుగుమిల్లి ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని సంబంధిత అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్లు దాఖలు చేసిన కూటమి అభ్యర్థులు : జీలుగుమిల్లి: కారం సుజాత కామయ్యపాలెం: సోదేం విజయకుమారి వంకవారిగూడెం: కుంజా రాంబాబు తాటియాకులగూడెం: జాస్తి హేమ రాచాన్నగూడెం: వెన్నెం మాధవి అంకన్నగూడెం: జమ్మి గోపి ములగలంపల్లి: వనమా శాంతి ద...
డా.కామినేని శ్రీనివాస్ ఆశీస్సులతో నామినేషన్ దాఖలు.. కూటమి విజయమే లక్ష్యమన్న చలమయ్య... ఏలూరు జిల్లా : ముదినేపల్లి (స్వచ్ఛవార్త) : ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆశీస్సులతో ముదినేపల్లి మండలం పెనుమల్లి గ్రామానికి చెందిన టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి బొర్ర చలమయ్య కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఏలూరులో ఉత్సాహభరిత వాతావరణంలో భారీ ర్యాలీగా వెళ్లి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. కూటమి నాయకులు పరసా ఏడుకొండలు, కట్ట వీర రాఘవులు, కట్ట గోపి, జక్కుల విజయకుమార్, కట్టా నాగబాబు, దాసరి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చలమయ్య మాట్లాడుతూ.. ముదినేపల్లి మండలంలోని ప్రతి గ్రామంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి ఆశీస్సులతో విజయం సాధించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ అభివృద్ధి పట్ల తన నిబద్ధతను వివరిస్తానన్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడంతో పాటు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. కూటమి భాగస...
కామినేని శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఏసు రాజు.. మండల అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి... ఏలూరు జిల్లా : కైకలూరు (స్వచ్ఛవార్త) : స్థానిక సంస్థల ఎన్నికల్లో కైకలూరు మండల జడ్పీటీసీ అభ్యర్థిగా బలే ఏసు రాజు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి జడ్పీ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఏసు రాజు మాట్లాడుతూ... తనపై నమ్మకంతో జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌కు, కూటమి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే తనపై ఉంచిన నమ్మకాన్ని ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు. కైకలూరు మండల పరిధిలోని ప్రతి గ్రామ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మండలంలోని ఎంపీటీసీ అభ్యర్థులందరినీ భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు శ్రమిస్తానని తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ఎన్నికల్లో ముందుకు సాగుతానన్నారు. కార్యక్రమంలో కైకలూరు ఎక్స్ ఎమ్మెల్సీ క...
‘చెప్పాం.. చేస్తున్నాం’ బ్రోచర్తో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రచారం... ప.గో జిల్లా : భీమవరం (స్వచ్ఛవార్త) : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు నూటికి నూరు శాతం స్థానాల్లో విజయం సాధించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు (కేఎన్ఆర్) తెలిపారు. దసరా పండుగను పురస్కరించుకుని కూటమి నాయకత్వానికి, అభ్యర్థులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూటమి ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతోందన్నారు. అభివృద్ధి, సంక్షేమమే ఉమ్మడి ఎజెండా : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని నాగేశ్వరరావు పేర్కొన్నారు. గత రెండున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ‘చెప్పాం.. చేస్తున్నాం’ అనే నినాదంతో ప్రజల్ల...
ఏలూరు జిల్లా : కైకలూరు (స్వచ్ఛవార్త) : దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని కైకలూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్ కుటుంబ సభ్యులు ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కైకలూరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. దసరా పండుగ ప్రతి కుటుంబంలో ఆనందాన్ని నింపాలని, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. అనంతరం ఆలయ పాలకవర్గం కమ్మిలి విఠల్ కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి సత్కరించింది .
అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం... ఏలూరు జిల్లా : జీలుగుమిల్లి (స్వచ్ఛవార్త) : స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి బలాన్ని నిరూపించి, అన్ని స్థానాల్లో విజయ దుందుభి మోగిస్తామని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. సోమవారం బర్రింకలపాడులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పోలవరం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి బలంగా ఉందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై మూడు పార్టీల ముఖ్య నాయకులతో చర్చించినట్లు వెల్లడించారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంతో పాటు పోలవరం నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయంతో గ్రామాల్లో మరింత అభివృద్ధి సాధిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ ఇంచార్జ్, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, కూటమి నాయకులు శీలం వెంకటే...
ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం (స్వచ్ఛవార్త( : విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. దుష్టశక్తులపై దైవశక్తి, అధర్మంపై ధర్మం, చెడుపై మంచి సాధించిన విజయానికి విజయదశమి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. దుర్గామాత దివ్య ఆశీస్సులు ఏలూరు జిల్లాతోపాటు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఇటీవల ఏలూరులోని పలు దేవాలయాల్లో అమ్మవారి సేవలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. అమ్మవారి కరుణాకటాక్షాలతో ఏలూరు జిల్లా సుభిక్షంగా వర్ధిల్లాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని, ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని కోరుకుంటున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
నంద్యాల జిల్లా : బనగానపల్లె (స్వచ్ఛవార్త) : బనగానపల్లె నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాపులపల్లె ఫామ్‌హౌస్‌లో కూటమి నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ అభ్యర్థుల ఎంపికపై వార్డులవారీగా సమీక్షించారు. స్థానిక పరిస్థితులు, ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యమిస్తూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా వైసీపీపై విమర్శలు చేసిన మంత్రి, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమకు బలమని పేర్కొన్నారు. సమావేశంలో బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు పాల్గొన్నారు.
30 వేల మందికి అన్నసమారాధన.. వైభవంగా గ్రామోత్సవం కృష్ణా : గుడ్లవల్లేరు/ వేమవరం (స్వచ్ఛవార్త) : దసరా శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం దుర్గాష్టమిని పురస్కరించుకుని అమ్మవారు శ్రీ కనకదుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు, హోమాలు, గ్రామోత్సవం, అన్నసమారాధన కార్యక్రమాలు వైభవంగా జరిగాయని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 గంటలకు అమ్మవారికి కుంభం పోసే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సహస్రనామార్చన, దుర్గామూల మంత్ర హవనాలు, కుంకుమ పూజ, హోమాలు నిర్వహించారు. సమస్త కాలసర్పదోషాల నివారణను ఉద్దేశించి ప్రత్యేక హవనాలు చేపట్టారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు దేవస్థానం సిబ్బంది ప్రసాదాలను అందజేశారు. హైదరాబాద్ కళాకారుల బోనాల నృత్యాలు, ఇతర రాష్ట్రాల కళాకారుల పూణేడప్పుల ప్రదర్శనలు, మొగల్తూరు కళాకారుల గరగ నృత్యం, తీన్మార్ వాయిద్యాలు, బ్యాండ్ మేళం, సన్నాయి బృందాల ప్రదర్శనల నడుమ అమ్మవారి గ్రామోత్సవం ప్రారంభమైంది. ఈ వేడుకలను తిలకించేందు...