Mudinepalli : వైవాకలో జెడ్పీటీసీ అభ్యర్థి బొర్రా చలమయ్య ఎన్నికల ప్రచారం.. ఎన్డీఏ కూటమి అభ్యర్థికి బీసీ నాయకుల మద్దతు
ఏలూరు జిల్లా : ముదినేపల్లి (స్వచ్ఛవార్త) :
మండలంలోని వైవాక గ్రామంలో ముదినేపల్లి జెడ్పీటీసీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు బొర్రా చలమయ్య సోమవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కైకలూరు, మండవల్లి, ముదినేపల్లి, కలిదిండి మండలాలకు చెందిన ఎన్డీఏ కూటమి బీసీ నాయకులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, బీజేపీ నాయకుడు గంగునేని వరప్రసాద్ ఆధ్వర్యంలో చలమయ్యను మర్యాదపూర్వకంగా కలిసి ఎన్నికల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కైకలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి కొత్త నాగబాబు, ఎంపీపీ అభ్యర్థి కోటప్రోలు నాగరత్నకుమారి తనయుడు, బీజేపీ నాయకుడు కోటప్రోలు కృష్ణ, కైకలూరు నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కట్టా గోపి, జక్కుల విజయ్, పెదగొన్నూరు మాజీ సర్పంచ్ నాగిరెడ్డి శివ, మరిపి శివ, బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బలే చిరంజీవి, పరసా ఏడుకొండలు, గుమ్మా రాము, దాసరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
