Posts

Showing posts with the label భక్తి
📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Gudlavalleru : ఆశ్వీయుజ పౌర్ణమి వేళ శ్రీ కొండలమ్మ సన్నిధిలోరుద్ర సహిత చండీ హవనం

Image
కృష్ణా : గుడ్లవల్లేరు /వేమవరం (స్వచ్ఛవార్త) : ఆశ్వీయుజ పౌర్ణమి సందర్భంగా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలోని శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించిన అనంతరం ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి సన్నిధిలో రుద్ర సహిత చండీ హవనం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ముఖ్య అర్చకుడు రుద్రపాక శివ సంతోష్ శర్మ ఆధ్వర్యంలో దేవస్థాన సిబ్బంది సమిష్టిగా కృషి చేసి నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు, ధర్మకర్తల మండలి చైర్మన్ ఈడే వెంకట విష్ణు మోహనరావు, మండలి సభ్యురాలు నూతలపాటి లక్ష్మీ పావని, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. ఈ వివరాలను ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఒక ప్రకటనలో తెలిపారు.

Bhimavaram : శ్రీ మావుళ్లమ్మ సన్నిధిలో 160 మంది భక్తుల మాలధారణ.. 41 రోజుల మండల దీక్షకు శ్రీకారం

Image
ప.గో జిల్లా : భీమవరం (స్వచ్ఛవార్త) : భీమవరం పట్టణంలోని ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో 41 రోజుల మండల దీక్ష మాలధారణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 160 మంది భక్తులు అమ్మవారి మాలలు ధరించి మండల దీక్షను ప్రారంభించినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి. హరిసూర్య ప్రకాష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మాలధారణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా జరిపించారు. అమ్మవారిపై భక్తితో మాలలు ధరించిన భక్తులు రానున్న 41 రోజుల పాటు నియమనిష్ఠలతో మండల దీక్షను ఆచరించనున్నారు. దీక్షా కాలంలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ అమ్మవారి అనుగ్రహం పొందేందుకు భక్తులు సిద్ధమయ్యారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం పాల్గొన్నారు. ఆలయంలో నిర్వహించిన మాలధారణ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

Gudlavalleru : శ్రీ కొండలమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు.. 15వేల మందికి పైగా అమ్మ దర్శనం

Image
కృష్ణా : గుడ్లవల్లేరు ( స్వచ్ఛవార్త) :   మండలంలోని వేమవరం గ్రామంలోని కొలువై ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆదివారం అమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. సుమారు 15 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాలపొంగళ్ళు సమర్పించి తమ మొక్కుబడులు తీర్చుకున్నారు.  భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చేపట్టిన ఏర్పాట్లను ఆలయ చైర్మన్ ఈడే వెంకట విష్ణు మోహనరావు, కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు, ధర్మకర్తల మండలి సభ్యులు కళ్లేపల్లి సుగుణ శేఖర్, వడ్లమూడి రవీంద్రబాబు పర్యవేక్షించారు. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.  భక్తులు సౌకర్యవంతంగా దర్శనం చేసుకునేలా అవసరమైన చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గుడ్లవల్లేరు ఎస్‌ఐ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు కల్పించిన సౌకర్యాలు, ఏర్పాట్ల వివరాలను ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఒక ప్రకటనలో తెలిపారు.

Bhimavaram : శ్రీ మావుళ్లమ్మ ఆలయంలో 9 వేల మంది భక్తులకు అన్నదానం.. శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా అన్నప్రసాద వితరణ

Image
ప.గో జిల్లా : భీమవరం (స్వచ్ఛవార్త) : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని ప్రముఖ ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 9 వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించారు. భక్తులకు అన్నప్రసాదం అందించే కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి. హరి సూర్యప్రకాష్, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఉదిసి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్, గుసిడి శిరీష, కారెంపూడి ఆదిలక్ష్మి, అరసవల్లి సుబ్రహ్మణ్యం, మిర్తిపాటి గున్నేశ్వరరావు, మల్లువలస లక్ష్మి నిర్మల, గొంతెన రమణ, యండ సత్యవతి, ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, పాపోలు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన అన్నదానంలో వేలాది మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

Bhimavaram : నేడు శ్రీ మావుళ్లమ్మ ఆలయంలో అన్నదానం.. శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం

Image
ప.గో జిల్లా : భీమవరం (స్వచ్ఛవార్త) : పట్టణంలోని ప్రముఖ ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా  ఈ రోజు ఉదయం 11:00 గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి. హరి సూర్యప్రకాష్, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదం అందించనున్నారు. అమ్మవారి ఆశీస్సులు పొందడంతో పాటు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు దేవస్థానం చర్యలు చేపడుతోంది. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని వివిధ అలంకరణల్లో దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

Ghantasala : శ్రీకాకుళం అయోద్య రామాలయంలో వెయ్యి మందికి అన్నసమారాధన.. అమ్మవారిని దర్శించుకున్న ఎస్ఐ చందన

Image
కృష్ణా : శ్రీకాకుళం / ఘంటసాల (స్వచ్ఛవార్త) : విజయవంతంగా ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలోని సోమిశెట్టి వారి వీధిలోని అయోద్య రామాలయంలో దసరా నవరాత్రులు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మ వారికి ఘంటసాల ఎస్ఐ వేమన చందన మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం వెయ్యి మందికి జరిగిన అన్నసమారాధన కార్యక్రమాన్ని ఎస్ఐ చందన ప్రారంభించారు.  కార్యక్రమంలో కఠారి తాతయ్య, సోమిశెట్టి ముసలయ్య, అడపా విజయ్, సోమిశెట్టి రవి, సోమిశెట్టి గంగయ్య, సోమిశెట్టి వెంకట నారాయణ, సోమిశెట్టి రమేష్, సోమిశెట్టి సాయి, కఠారి శ్రీనివాసరావు, సోమిశెట్టి ఎమ్మెల్యే, సోమిశెట్టి పండు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Gudlavalleru : శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు కొండలమ్మ దర్శనం

Image
శరన్నవరాత్రులకు భక్తుల తాకిడి.. ముగింపు రోజున ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు... కృష్ణా : గుడ్లవల్లేరు/ వేమవరం (స్వచ్ఛవార్త) : శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. ఆశ్వయుజ శుద్ధ దశమి సందర్భంగా అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన పూజలు, ఏర్పాట్లను దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు, ధర్మకర్తల మండలి చైర్మన్ ఈడే వెంకట విష్ణు మోహనరావు, సభ్యులు, ముఖ్య అర్చకుడు ఆర్.ఎస్.సి.ఎస్. సంతోష్ శర్మ పర్యవేక్షించారు. తొలుత సహస్రనామార్చన నిర్వహించి, అనంతరం కుంకుమ పూజ, శ్రీ లలితా హవనం, రుద్ర హవనం నిర్వహించారు. సమస్త విజయప్రాప్తిని ఆకాంక్షిస్తూ మహా పూర్ణాహుతి, నీరాజనం, మంత్రపుష్పం సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. సాయంత్రం సాయంకాలార్చన, శమీపూజ, ఉయ్యాల సేవ, పంచహారతులు, చతుర్వేద స్వస్తి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు సౌకర్యాలు : ఉత్సవాలకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ పరిసరాల్లో పారిశ...

Kaikaluru : శ్రీ వాసవి అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి కుటుంబం

Image
ఏలూరు జిల్లా : కైకలూరు (స్వచ్ఛవార్త) : దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని కైకలూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్ కుటుంబ సభ్యులు ఆదివారం దర్శించుకున్నారు.  ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కైకలూరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. దసరా పండుగ ప్రతి కుటుంబంలో ఆనందాన్ని నింపాలని, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. అనంతరం ఆలయ పాలకవర్గం కమ్మిలి విఠల్ కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి సత్కరించింది .

Gudlavalleru : 9వ రోజు శ్రీ మహిషాసురమర్దినిగా కొండలమ్మ దర్శనం

Image
శరన్నవరాత్రి వేడుకల్లో ప్రత్యేక పూజలు, హోమాలు... రాత్రి కూచిపూడి నృత్య ప్రదర్శన.. హరికథ, పౌరాణిక నాటకం... కృష్ణా : గుడ్లవల్లేరు/వేమవరం (స్వచ్ఛవార్త) : శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సోమవారం నవమి సందర్భంగా అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దినీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకోగా, ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల వివరాలను ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తొలుత సహస్రనామార్చన నిర్వహించి, అనంతరం నరఘోష, శత్రుఘోష నివారణకు ఉద్దేశించిన శ్రీ ప్రత్యంగిర, శ్రీ బగళాముఖి హవనాలు చేపట్టారు. సాయంత్రం సాయంకాలార్చన, ఉంజల్ సేవ, పంచహారతులు, మంత్రపుష్పాలు, చతుర్వేద స్వస్తి కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులకు ఉచిత ప్రసాదం పంపిణీ : సోమవారం భక్తులకు ఉచిత ప్రసాదం అందించేందుకు వెనిగళ్ల రామకృష్ణ, లక్ష్మీ ప్రసన్న దంపతులు, వారి పిల్లలు బాంధవి, పృథ్వి, వెనిగళ్ల మదన్ కిషోర్, తిరుమల, దీప్షిత చౌదరి, షణ్ముఖ చౌదరి సహకారం అందించారు. భక్తుల సౌకర్యార...

Gudlavalleru : కొండలమ్మ సన్నిధిలో కనకదుర్గాదేవి అలంకరణ.. దుర్గాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల

Image
30 వేల మందికి అన్నసమారాధన.. వైభవంగా గ్రామోత్సవం కృష్ణా : గుడ్లవల్లేరు/ వేమవరం (స్వచ్ఛవార్త) : దసరా శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం దుర్గాష్టమిని పురస్కరించుకుని అమ్మవారు శ్రీ కనకదుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.  ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు, హోమాలు, గ్రామోత్సవం, అన్నసమారాధన కార్యక్రమాలు వైభవంగా జరిగాయని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 గంటలకు అమ్మవారికి కుంభం పోసే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సహస్రనామార్చన, దుర్గామూల మంత్ర హవనాలు, కుంకుమ పూజ, హోమాలు నిర్వహించారు. సమస్త కాలసర్పదోషాల నివారణను ఉద్దేశించి ప్రత్యేక హవనాలు చేపట్టారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు దేవస్థానం సిబ్బంది ప్రసాదాలను అందజేశారు. హైదరాబాద్‌ కళాకారుల బోనాల నృత్యాలు, ఇతర రాష్ట్రాల కళాకారుల పూణేడప్పుల ప్రదర్శనలు, మొగల్తూరు కళాకారుల గరగ నృత్యం, తీన్మార్‌ వాయిద్యాలు, బ్యాండ్‌ మేళం, సన్నాయి బృందాల ప్రదర్శనల నడుమ అమ్మవారి గ్రామోత్సవం ప్రారంభమైంది. ఈ వేడుకలను తిలకించేందు...

Bhimavaram : మావుళ్లమ్మ సన్నిధిలో చిన్నారులకు చదువుల కానుక.. 7వ రోజు సరస్వతీ దేవిగా అమ్మవారి దర్శనం

Image
పశ్చిమగోదావరి జిల్లా : భీమవరం (స్వచ్ఛవార్త) : భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శ్రీదేవీ శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం భీమవరం పట్టణంలోని ప్రముఖ ఇలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ విద్యార్థుల కోసం సరస్వతీ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి. హరిసూర్య ప్రకాష్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఉదిసి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్, గుసిడి శిరీష, కారెంపూడి ఆదిలక్ష్మి, అరసవల్లి సుబ్రహ్మణ్యం, మిర్తిపాటి గున్నేశ్వరరావు, మల్లువలస లక్ష్మి నిర్మల, గొంతెన రమణ, యండ సత్యవతి, ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, పాపోలు ఏడుకొండలు విద్యార్థులకు విద్యాసామగ్రిని అందజేశారు.  అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన మేజిక్ షో భక్తులను, చిన్నారులను అలరించింది.

Gudlavalleru : కొండలమ్మ సన్నిధిలో భక్తిభావం.. కాత్యాయనీ దేవిగా అమ్మవారి దర్శనం

Image
ఆదివారం 30 వేల మందికి అఖండ అన్నసమారాధన.. దాతల నుంచి భారీగా బియ్యం విరాళాలు కృష్ణా : గుడ్లవల్లేరు/వేమవరం (స్వచ్ఛవార్త) : శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం వేమవరం శ్రీ కొండలమ్మ అమ్మవారు కాత్యాయనీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ వివరాలను ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆర్.ఎస్.సి.ఎస్. సంతోష్ శర్మ ఆధ్వర్యంలో సహస్రనామార్చన, కుంకుమ పూజలు, హోమాలు నిర్వహించారు. త్వరిత వివాహం, కుజదోష పరిహారం కోసం కాత్యాయనీ మూలమంత్ర హవనాలు జరిపారు. అనంతరం భక్తులకు ఆలయ సిబ్బంది తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చైర్మన్ ఈడే వెంకట విష్ణు మోహనరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, కార్యనిర్వహణాధికారి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అన్నసమారాధనకు భారీగా బియ్యం విరాళాలు : ఆదివారం (అక్టోబర్ 18) నిర్వహించనున్న అఖండ అన్నసమారాధనలో సుమారు 30 వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి గుడివాడకు చెందిన ఆచంట కావ్యశ్రీ 593 కిలోలు, గుమ్మడి దుర్గకు...

T. Narasapuram : శివాలయంలో వైభవంగా కుంకుమ పూజలు.. శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకరణలో దర్శనమిచ్చిన విశాలాక్షి అమ్మవారు

Image
ఏలూరు జిల్లా : టి.నరసాపురం (స్వచ్ఛవార్త) : శ్రీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం శివాలయంలో కొలువుదీరిన విశాలాక్షి అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు నిర్వహించి అమ్మవారి కృపాకటాక్షాలు పొందారు. ఆలయ ప్రాంగణం భక్తుల రాకతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆలయ అర్చకులు రవీంద్ర శర్మ భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధన, ధాన్య, ఐశ్వర్యాలను ప్రసాదించే మహాలక్ష్మీ అమ్మవారిని ఈ పవిత్రమైన నవరాత్రి వేళ దర్శించుకోవడం ఎంతో అదృష్టమని అన్నారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరికీ సుఖసంతోషాలు, సిరిసంపదలు కలగాలని ఆకాంక్షించారు.

Bhimavaram : శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో నవరాత్రుల శోభ.. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనం

Image
పశ్చిమగోదావరి జిల్లా : భీమవరం (స్వచ్ఛవార్త) : దసరా శరన్నవరాత్రుల సందర్భంగా పట్టణంలోని ప్రముఖ ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారు ఉత్సవాలు 6వ రోజున శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా బెంగళూరుకు చెందిన ఏలూరి వినోద్, భక్త కిరణ్మయి అమ్మవారి దేవస్థానానికి రూ.50,000 విరాళంగా అందజేశారు. ఈ విషయాన్ని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. విరాళం అందించిన భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు దాతలను శేషవస్త్రంతో సత్కరించి, అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఉదిశి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్, గుసిడి నాగ శిరీష, మల్లువలస లక్ష్మి నిర్మల, పాపోలు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

Gudlavalleru : శ్రీ సరస్వతీ దేవి అలంకరణలో కొండలమ్మ అమ్మవారు.. వేలాదిగా తరలివచ్చిన భక్తులు.. విద్యార్థులకు పుస్తకాల వితరణ

Image
కృష్ణా : గుడ్లవల్లేరు/వేమవరం (వేమవరం) : శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని వేమవరం శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం ఆశ్వయుజ శుద్ధ షష్ఠి, అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ కొండలమ్మ అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థుల సకల విద్యాభివృద్ధిని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం ప్రాతఃకాలార్చన అనంతరం 8.30 గంటల నుంచి అమ్మవారికి సహస్రనామార్చన, సరస్వతీ మూలమంత్ర హవనాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, యాజ్ఞిక బ్రహ్మ ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులతో సరస్వతీ దేవి పూజ చేయించారు.  అనంతరం ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి ప్రతినిధులు విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు, స్కేళ్లు, పెన్సిళ్లు, రబ్బర్లు, చాక్‌మార్కర్లు వితరణ చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అమ్మవారి దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తులకు విస్తృత ఏర్పాట్లు :  భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పరిసరాల్లో పారిశుధ్య చర్యలు చేప...