📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Gudlavalleru : శ్రీ కొండలమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు.. 15వేల మందికి పైగా అమ్మ దర్శనం

కృష్ణా : గుడ్లవల్లేరు ( స్వచ్ఛవార్త) : 

మండలంలోని వేమవరం గ్రామంలోని కొలువై ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆదివారం అమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. సుమారు 15 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాలపొంగళ్ళు సమర్పించి తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. 

భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చేపట్టిన ఏర్పాట్లను ఆలయ చైర్మన్ ఈడే వెంకట విష్ణు మోహనరావు, కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు, ధర్మకర్తల మండలి సభ్యులు కళ్లేపల్లి సుగుణ శేఖర్, వడ్లమూడి రవీంద్రబాబు పర్యవేక్షించారు. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. 

భక్తులు సౌకర్యవంతంగా దర్శనం చేసుకునేలా అవసరమైన చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గుడ్లవల్లేరు ఎస్‌ఐ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు కల్పించిన సౌకర్యాలు, ఏర్పాట్ల వివరాలను ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఒక ప్రకటనలో తెలిపారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం