Showing posts from July, 2026
📅 డేట్ లోడింగ్...
|
⏰ టైమ్ లోడింగ్...
కృష్ణాజిల్లా : మచిలీపట్నం : స్వచ్ఛవార్త : కృష్ణా జిల్లా నూతన జిల్లా రెవెన్యూ అధికారిగా (డీఆర్వో) కె. శ్రీధర్ రెడ్డి శుక్రవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ఆయన అధికారికంగా జిల్లా రెవెన్యూ అధికారి బాధ్యతలను చేపట్టారు. ఇంతకుముందు ఆయన ప్రకాశం జిల్లాలో వెలుగు ప్రాజెక్ట్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. పరిపాలనలో తనకు ఉన్న అనుభవాన్ని జిల్లాలో సమర్థవంతమైన రెవెన్యూ పరిపాలన, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు వినియోగిస్తానని ఈ సందర్భంగా డిఆర్ఓ తెలిపారు. అధికారులు, సిబ్బంది నూతన జిల్లా రెవెన్యూ అధికారికి శుభాకాంక్షలు తెలియజేసి, ఆయనకు స్వాగతం పలికారు.
విజయనగరం జిల్లా : స్వచ్ఛవార్త : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు(KNR) గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజును శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా శాలువా కప్పి జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. ప్రజా జీవితంలో అశోక్ గజపతి రాజు అందిస్తున్న సేవలను కోళ్ల నాగేశ్వరరావు అభినందించారు. ఈ సందర్భంగా గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ.. ప్రజా సేవే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆకాంక్షించారు. అనంతరం కోళ్ల నాగేశ్వరరావు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి సత్కరించారు.
ఏలూరు జిల్లా : బుట్టాయగూడెం : స్వచ్ఛవార్త : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో విస్తృత పోరాటాలు చేపట్టనున్నట్లు సీపీఐ పోలవరం నియోజకవర్గ కార్యదర్శి కారం దారయ్య తెలిపారు. మండలంలోని బుట్టాయగూడెం, సీపీఐ కార్యాలయంలో ఆ పార్టీ మండల కార్యవర్గ సభ్యుడు తెల్లం ముణేశ్వరావు అధ్యక్షతన శుక్రవారం సీపీఐ మండల శాఖ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దారయ్య మాట్లాడుతూ.... దేశంలో బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో బిజెపి అనుకూల ప్రభుత్వాల పాలనలో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య కుటుంబాల పోషణ ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలను తక్షణమే అరికట్టాలని డిమాండ్ చేశారు. రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరారు. విద్య, వైద్య సేవలను మరింత మెరుగుపరిచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జీపు జాత, ఆగస్టు 6 నుండి 15 వరకు జరిగే పాదయాత్ర, అలాగే సె...
కాకినాడ జిల్లా : కాకినాడ : స్వచ్ఛవార్త : జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కాకినాడ (జేఎన్టీయూకే) ఆధ్వర్యంలో జాతీయ క్వాంటమ్ మిషన్ (ఎన్‌క్యూఎం) కార్యకలాపాలు, శాస్త్ర సాంకేతిక శాఖ (డీఎస్టీ) అందిస్తున్న పరిశోధన నిధుల అవకాశాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్‌ను శుక్రవారం యూనివర్సిటీ సెనేట్ హాలులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ క్వాంటమ్ మిషన్ డైరెక్టర్ డాక్టర్ జె.బి.వి. రెడ్డి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్వాంటమ్ మిషన్ డైరెక్టర్ సి.వి. శ్రీధర్ ముఖ్య వక్తలుగా హాజరయ్యారు. జేఎన్టీయూకే ఉపకులపతి ప్రొఫెసర్ సి.ఎస్.ఆర్.కె. ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ.. భవిష్యత్ శాస్త్ర, సాంకేతిక, ఇంజినీరింగ్ రంగాల్లో క్వాంటమ్ టెక్నాలజీలు విప్లవాత్మక మార్పులకు దారితీస్తాయని అన్నారు. అధ్యాపకులు అంతరశాఖ పరిశోధనలకు ప్రాధాన్యతనిస్తూ క్వాంటమ్ ప్రయోగశాలల ఏర్పాటుకు కృషి చేయాలని, డీఎస్టీ ద్వారా లభిస్తున్న నిధుల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డాక్టర్ జె.బి.వి. రెడ్డి జాతీయ క్వాంటమ్ మిషన్ లక్ష్యాలు, క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన...
కృష్ణాజిల్లా : మచిలీపట్నం ఎంపీ కార్యాలయం : స్వచ్ఛవార్త : మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి రూల్–377 కింద మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలోని మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను శుక్రవారం లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రధానమంత్రి రైతులు, మత్స్యకారులు, పశుపోషకుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని చేసిన ప్రకటనను ప్రస్తావించిన బాలశౌరి, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం సుమారు 20–22 లక్షల జనాభాతో పాటు పడవల నిర్మాణం, మత్స్య పరిశ్రమ, రొయ్యలు మరియు సముద్ర ఆహార ఎగుమతులకు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతమని పేర్కొన్నారు. అయితే ఈ ప్రాంత మత్స్యకారులు పడవల నిర్మాణం, వేట సామగ్రి, సబ్సిడీ పథకాల అమలులో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో కేంద్ర మత్స్యశాఖ మంత్రి తక్షణమే క్రింది డిమాండ్లను పరిశీలించి ఆమోదించాలని కోరారు : చిన్న చేపల వేట పడవల యూనిట్ వ్యయాన్ని ప్రస్తుతం ఉన్న రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షలకు పెంచాలి. చేపల వేట వలల వ్యయం గణనీయంగా పెరిగినందున వాటిపై అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని రూ.70 వేల నుంచి రూ.1 లక్షకు పెంచాలి. పడవల...
అనాసాగరంలో ఇంటింటికీ 'రెండేళ్ల నమ్మకం' కరపత్రాల పంపిణీ... ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ : అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వమే చిరునామా అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. పట్టణంలోని 1వ వార్డు అనాసాగరంలో శుక్రవారం కూటమి నాయకులతో కలిసి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రభుత్వ పథకాల ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Coalition Government Committed to Development and Welfare ➖MLA Sowmya Andhra Pradesh Government Whip and Nandigama MLA Tangirala Sowmya on Friday said the coalition government remains firmly commi...
పోలవరం జిల్లా : పోలవరం : స్వచ్ఛవార్త : ప్రస్తుతం పెరుగుతున్న గోదావరి వరదలను దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రభుత్వ శాఖల అధికార యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అప్రమత్తం చేశారు. శుక్రవారం వేలేరుపాడు లోని తాసిల్దార్ కార్యాలయంలో అన్ని శాఖల ప్రభుత్వ అధికారులతో వరదలపై అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ముఖ్యంగా ప్రప్రదంగా వరదలు చుట్టుముట్టే గ్రామాలలోని ప్రజలను, పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమాన్ని ముమ్మరం చేయాల్సిందిగా ఆదేశించారు. వైద్య సిబ్బంది గర్భిణీ స్త్రీలను సురక్షిత ప్రాంతాలలోని వైద్యశాలలో ఉంచి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిరక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. వరద చుట్టుముట్టిని గ్రామాల్లో ప్రజలకు ప్రభుత్వ పరంగా అందించాల్సిన సేవలను ఎవరికి వారు బాధ్యతాయుతంగా అందించాలని తెలిపారు. ముంపునకు గురయ్యే గ్రామాలను ఖాళీ చేపించి పునరావాస కాలనీలకు వరదలు సంభవించే మూడు నెలల వరకు అక్కడే ఉంచే ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, ఐటీడీఏ పీవో రాములు నాయక్, డి.ఎ...
ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కళా వెంకట్రావు, మాజీమంత్రి దేవినేని ఉమ, కోళ్ల నాగేశ్వరరావు (KNR) భీమవరం/చీపురుపల్లి : స్వచ్ఛవార్త : భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి చీపురుపల్లి నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున ప్రజలను తరలించే ఏర్పాట్లపై ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు లతో ప్రత్యేక పరిశీలకుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు (KNR) శుక్రవారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ స్థాయిలో వివిధ మండలాల నుంచి ఎన్ని బస్సులు, కార్లు, ఆటోలు, మోటార్ సైకిళ్లు వస్తున్నాయి, ఏ సమయానికి బయలుదేరాలి, అల్పాహారం, భోజన వసతులు తదితర అంశాలపై ఇంచార్జిలు, నాయకులు, అధికారులతో విస్తృతంగా చర్చించి తగు సూచనలు చేశారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. విమానాశ్రయం ప్రారంభోత్సవం రాష్ట్ర అభివృద్ధికి కీలక ఘట్టమని పేర్కొన్న కోళ్ల నాగేశ్వరరావు(KNR), చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనేలా అన్ని మండలాల్లో సమన్వయంతో...
కైకలూరు /చింతలపూడి : స్వచ్ఛవార్త : పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ధరల పతనం, పంట కొనుగోళ్లలో జరుగుతున్న అవకతవకలపై రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగస్టు 5న తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో నిర్వహించనున్న రైతు సమావేశాన్ని విజయవంతం చేయాలని ఏలూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్ఆర్) పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జ్ కంభం విజయరాజు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాల్, రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు జక్కంపూడి రాజా, ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్ (జేపీ), పోలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ తెల్లం బాలరాజుతో కలిసి డీఎన్ఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎన్ఆర్ మాట్లాడుతూ... పొగాకు రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు జగన్మోహన్ రెడ్డి దేవరపల్...
ప.గో జిల్లా : జిల్లా పోలీసు కార్యాలయం : భీమవరం : స్వచ్ఛవార్త : పశ్చిమగోదావరి జిల్లా పోలీసు విభాగంలో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందిన పోలీసు సిబ్బందిని శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా సన్మానించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పదవీ విరమణ పొందిన సిబ్బందికి జ్ఞాపికలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ ఎస్.వి.వి.ఎస్. కృష్ణాజీ, నర్సాపురం డీఎస్పీ కార్యాలయానికి చెందిన హోంగార్డు బి. జయరాజును సత్కరించారు. డీఎస్పీ రఘువీర్ విష్ణు మాట్లాడుతూ.. 35 నుంచి 40 సంవత్సరాల పాటు ప్రజల భద్రత కోసం అహర్నిశలు శ్రమించి, విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి గౌరవప్రదంగా పదవీ విరమణ పొందడం అభినందనీయమన్నారు. పోలీసు శాఖకు ప్రతి ఉద్యోగి అందించే సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. పోలీసు విధులు సవాళ్లతో కూడుకున్నవని, ఈ క్రమంలో సిబ్బందికి అండగా నిలిచిన కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఎంతో గొప్పదని ఆయన తెలిపారు. పదవీ విరమణ అనేది ఉద్యోగానికి మాత్రమేనని, పోలీసు కుటుంబంతో వారి అనుబం...
కోరుకొల్లు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం... ఏలూరు జిల్లా : కలిదిండి : కోరుకొల్లు : స్వచ్ఛవార్త : ప్రపంచ మానవ అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా కలిదిండి మండలం కోరుకొల్లు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కైకలూరు న్యాయమూర్తి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణా సమాజానికి పెను ముప్పుగా మారిన నేరమని పేర్కొన్నారు. ఉద్యోగాలు, ఉన్నత విద్య, వివాహాల పేరుతో మోసగాళ్లు అమాయకులను వలలో వేసే ప్రయత్నాలు చేస్తున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. అడ్వకేట్ మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణాకు సంబంధించిన చట్టాలు, బాధితులకు అందుబాటులో ఉన్న న్యాయ సహాయం గురించి వివరించారు. చట్టాలపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా ఇటువంటి నేరాలను అరికట్టవచ్చన్నారు. కలిదిండి పోలీస్ స్టేషన్ ఎస్ఐ మాట్లాడుతూ.. యువత సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించార...
3 సెంట్ల స్థలం, హెల్త్ కార్డులు, పెన్షన్ సాధనకు APWJF, APBJA పిలుపు ఏలూరు : స్వచ్ఛవార్త :.. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ - APWJF మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ - APBJA ఆధ్వర్యంలో * ఈ నెల 31వ తేదీ శుక్రవారం * రాష్ట్రవ్యాప్తంగా 'జర్నలిస్ట్ డిమాండ్ డే' నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా లోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, ప్రధాన మండల కేంద్రాల్లో, అలాగే జిల్లా కేంద్రంలోనూ శాంతియుత నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. "డిమాండ్ డే" విజయవంతం చేయాలని పిలుపు... ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని *ఏలూరు APWJF అధ్యక్ష, కార్యదర్శులు జబీర్, హరీష్* మరియు *APBJA అధ్యక్ష, కార్యదర్శులు పి నారాయణ, ఎం కిరణ్* కోరారు. వారు మాట్లాడుతూ ... " ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునేందుకే ఈ ఆందోళన. ప్రతి జర్నలిస్టు ఈ కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలపాలి " అని అన్నారు. ప్రధాన డిమాండ్లు : 1. ప్రతి జర్నలిస్టుకు 3 సెంట్ల స్థ...
ఎన్టీఆర్ జిల్లా : విజయవాడ : గొల్లపూడి : స్వచ్ఛవార్త : ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న అర్చకుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ అర్చక జేఏసీ నాయకులు గురువారం గొల్లపూడిలోని దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ కె. రామచంద్ర మోహన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అర్చక జేఏసీ ప్రతినిధులు వంశపారంపర్య హక్కులకు సంబంధించిన 439 జీవోను త్వరితగతిన అమలు చేయాలని, వేతన అర్చకులకు 65ఏ నిబంధనలను అమలు చేయాలని కోరారు. అలాగే అర్చకుల సంక్షేమ పథకాలను వంద శాతం అమలు చేయడంతో పాటు దరఖాస్తుల స్థితిని తెలుసుకునేలా ఆన్లైన్ ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అర్చకులందరికీ కనీస వేతనం రూ.15 వేల చొప్పున అమలు చేయాలని, ఇనాం భూముల వివరాలను రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. వినతులను స్వీకరించిన కమిషనర్ కె. రామచంద్ర మోహన్ అర్చకుల సమస్యల పరిష్కారంపై సానుకూలంగా స్పందించినట్లు జేఏసీ నాయకులు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న అంశాల పరిష్కారానికి అవసరమైన సర్క్యులర్లు త్వరలో జారీ చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. కమిషనర్‌ను కలిసిన వారిలో అర్చక జేఏసీ నాయకులు మురమ...
విజయనగరం జిల్లా : జిల్లా పోలీసు కార్యాలయం : స్వచ్ఛవార్త : భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి మరియు బహిరంగ సభలో పాల్గొనడానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1 విచ్చేస్తున్న నేపద్యంలో భద్రత చర్యల్లో భాగంగా విమానాశ్రయం పరిసరాల్లో 48 గంటలపాటు అధికారికంగా 'నో ఫ్లైయింగ్ జోన్' ప్రకటించినట్లు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ జూలై 30న తెలిపారు. జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ .- అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం, సభా వేదిక, హెలిపాడ్ మరియు పరిసర మార్గాల చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిని, బీఎన్ఎస్ఎస్, 2023 సెక్షన్ 163 ప్రకారం 'నో ఫ్లైయింగ్ జోన్'గా పరిగణించనున్నామన్నారు. ఈ నిషేధిత ఉత్తర్వులు జూలై 30 రాత్రి 20:00 గంటల నుండి ఆగస్టు 1 రాత్రి 20:00 గంటల వరకు (మొత్తం 48 గంటల పాటు) రెండు రోజులపాటు కఠినంగా అమల్లో ఉంటాయి. ఈ నిషిద్ధ సమయాల్లో విమానాశ్రయ ప్రాంతం చుట్టూ డ్రోన్లు, మానవరహిత విమానాలు, పారా-గ్లైడర్స్, మైక్రో-లైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు మరియు ఇతర వైమానిక వస్తువుల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్...
మూడేళ్ల గడువుతో రుణం అందించేందుకు పొగాకు బోర్డు అంగీకారం : ఎంపీ పుట్టా మహేష్‌కుమార్... ఢిల్లీ / ఏలూరు : స్వచ్ఛవార్త : పొగాకు రైతులకు ఆర్థిక ఊరట కల్పించే కీలక నిర్ణయంగా లో గ్రేడ్ పొగాకు ఉత్పత్తి చేసిన రైతులకు బ్యారెల్‌కు రూ.50 వేల చొప్పున మూడేళ్లపాటు వడ్డీలేని రుణం అందించేందుకు పొగాకు బోర్డు అంగీకరించినట్లు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ఉన్న ఎంపీ గురువారం నిర్వహించిన పొగాకు బోర్డు సమావేశానికి వర్చువల్‌గా హాజరై రైతుల సమస్యలను ప్రస్తావించారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, అనుమతులకు మించి సాగు విస్తీర్ణం పెరగడం, లో గ్రేడ్ పొగాకుకు కొనుగోలుదారులు ముందుకు రాకపోవడం వంటి కారణాలతో ధరలు తగ్గాయని సమావేశంలో వివరించారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, పొగాకు బోర్డు సమన్వయంతో కృషి చేస్తున్నాయని ఎంపీ తెలిపారు. గత రెండేళ్లలో కేజీ పొగాకుకు గరిష్టంగా రూ.470 వరకు ధర లభించేలా చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు. ఈ ఏడాది కూడా రైతులకు కనీసం కేజీకి రూ.300కు పైగా ధర వచ్చేలా అన్ని స్థాయిల్లో ప్రయత్నాలు కొనస...
పశ్చిమగోదావరి జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త : భీమవరం పట్టణంలోని ప్రసిద్ధ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్ర ప్రాజెక్టుకు చినఅమిరం గ్రామానికి చెందిన గొట్టుముక్కల వెంకట రమేష్ రాజు, వెంకట లక్ష్మి పద్మావతి దంపతులు రూ.2,01,116 విరాళం అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు సమక్షంలో ఈ విరాళాన్ని ఆలయ అధికారులకు అందించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి దాతలకు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, జ్ఞాపికను అందజేసి దాతలను సత్కరించారు. మావుళ్లమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్ర ప్రాజెక్టు కోసం భక్తులు స్వచ్ఛందంగా అందిస్తున్న విరాళాలు ఆలయ అభివృద్ధికి దోహదపడుతున్నాయని ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, గుసిడి నాగ శిరీష, పాపోలు ఏడుకొండలు, స్వర్ణ వస్త్ర ప్రాజెక్టు కమిటీ సభ్యులు గొంట్ల నారాయణ ప్రసాదం తదితరులు పాల్గొన్నారు.
బాపట్ల జిల్లా : బాపట్ల : స్వచ్ఛవార్త : మండలంలోని బేతపూడి గ్రామంలో మండల తహసీల్దార్ ఎస్.కె. సలీమా అధ్యక్షతన పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఎస్.కె. సలీమా మాట్లాడుతూ... భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిందని, కులం, మతం, వర్ణం, లింగ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు, గౌరవం లభించేలా రాజ్యాంగం హామీ ఇస్తుందని తెలిపారు. పౌరులు తమ హక్కులను తెలుసుకుని వాటిని సద్వినియోగం చేసుకోవడంతో పాటు రాజ్యాంగం కల్పించిన విధులను కూడా బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పారదర్శకంగా, వివక్ష లేకుండా అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. సమాజంలో సామరస్యం, సమానత్వం, సామాజిక న్యాయం నెలకొల్పడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. పౌర హక్కుల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన సేవలందించడంలో మండల స్థాయి అధికారులు సమిష్టిగా కృషి చేస్తున్నారని ఆమె అభినందించారు. కార్యక్రమాన్ని విజయ...
భీమవరం/చీపురుపల్లి : స్వచ్ఛవార్త : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు(KNR )గురువారం చీపురుపల్లి నియోజకవర్గంలోని చీపురుపల్లి, గరివిడి మండలాల్లో ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, అధికార గణంతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా రానున్న కార్యక్రమాల విజయవంతానికి చేపట్టాల్సిన జన సమీకరణ ఏర్పాట్లపై నాయకులు, కార్యకర్తలతో సమావేశమై చర్చించారు. గ్రామాల వారీగా పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. కార్యక్రమాల నిర్వహణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు సమర్థవంతమైన కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు. ఈ పర్యటనలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా : కామవరపుకోట : స్వచ్ఛవార్త : మండలంలోని రావికంపాడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుకుంటున్న కునుసోతు బాల సాయి సుబ్రహ్మణ్యం ఆత్మహత్య పై సమగ్ర న్యాయ విచారణ జరపాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి డి ఎస్ యు) జిల్లా ప్రధాన కార్యదర్శి బన్నె వినోద్ గురువారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం మే లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చేరీ రెండు నెలలు గడవకముందే జూలై 24 తారీఖున ఎవరూ లేని సమయంలో జంగారెడ్డిగూడెం ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోవడం చాలా బాధాకరం అన్నారు. విద్యార్థి ఆత్మహత్యపై పాఠశాల ఉపాధ్యాయులు వేధింపులు కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషాద ఘటన లేటుగా వెలుగులోకి రావడం జరిగిందన్నారు. కావున విద్యార్థి ఆత్మహత్యపై సమగ్రంగా న్యాయ విచారణ జరపాలని ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు .
ఏలూరు జిల్లా : జీలుగుమిల్లి : స్వచ్ఛవార్త : పోలవరం నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడే మరో కీలక నిర్ణయం వెలువడింది. పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్, విజయవాడ జారీ చేసిన మెమో ప్రకారం, పోలవరం మరియు జీలుగుమిల్లి మండలాల పశుసంవర్ధక సేవల పరిపాలనా పరిధిని నూజివీడు డివిజన్ నుంచి ఏలూరు పశుసంవర్ధక డివిజన్‌కు మార్చే ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోద ప్రక్రియను పూర్తి చేసింది. ఈ మార్పు కోసం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఏపీఎస్టీసీఎఫ్సీఎల్ (ట్రికర్ ) ఛైర్మన్ బొరగం శ్రీనివాసులు ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్లి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. వారి ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకున్న జిల్లా పశుసంవర్ధక అధికారి ( డి ఏ హెచ్ ఓ ), అనంతరం పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్ ఈ అంశంపై తుది చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయంతో పోలవరం, జీలుగుమిల్లి ప్రాంతాల పశుసంవర్ధక సేవల నిర్వహణ మరింత సులభతరం కానుండగా, రైతులు, పశుపోషకులకు పరిపాలనా సేవలు వేగంగా అందే అవకాశం ఏర్పడనుంది. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తమ విజ్ఞప్తిని ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కృతజ్ఞతలు తెలిపా...
అంబేద్కర్ కోనసీమ జిల్లా : రావులపాలెం : స్వచ్ఛవార్త : రావులపాలెంకు చెందిన సాయి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ రాధా రంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు గురువారం విజయవాడలో ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రాధా రంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కాళ్లపాలెం బుజ్జి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో, సాయి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి న్యాయం జరిగేలా చూడాలని కోరినట్లు తెలిపారు. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందించేందుకు సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ గౌరవ సలహాదారు వాడపల్లి సతీష్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కళ్యాణ్, కొణిజేటి రవి, అజయ్, మనోజ్, నటరాజ్ మణి, సోషల్ మీడియా సలహాదారు రవి తదితరులు పాల్గొన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు.
అమరావతి / కలిదిండి : స్వచ్ఛవార్త : పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతిని ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుక (స్టేట్ ఫంక్షన్)గా నిర్వహిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంపై అగ్నికుల క్షత్రియ సమాజంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా అమరావతి వెలగపూడి సచివాలయంలో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ డైరెక్టర్ ఆండ్రాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అగ్నికుల క్షత్రియ సమాజం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న చిరకాల వాంఛను నెరవేర్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సమాజం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతిని ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా గుర్తించడం ద్వారా అగ్నికుల క్షత్రియుల చరిత్ర, సేవలకు తగిన గౌరవం దక్కిందన్నారు. ఈ నిర్ణయం సమాజ ఆత్మగౌరవాన్ని మరింత పెంచడమే కాకుండా భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, డైరెక్టర్లు ఆండ్రాజు శ్రీనివాసరావు, బొమ్మిడ...
దస్తావేజు లేఖరుల ఉపాధి పరిరక్షణకు వైఎస్సార్సీపీ అండ... ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని భరోసా... గుంటూరు జిల్లా : తాడేపల్లి : స్వచ్ఛవార్త : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం ప్రతినిధులు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. ఏపీ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖ జారీ చేసిన జీవో నంబర్ 396ను రద్దు చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. జీవో నంబర్ 396 దస్తావేజు లేఖరుల ఉపాధికి మరణశాసనంగా మారుతుందని సంఘం ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. పబ్లిక్–ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తే దశాబ్దాలుగా ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న దస్తావేజు లేఖరులు తమ ఉపాధితోపాటు ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని వివరించారు. ఈ విధానం వల్ల దస్తావేజు లేఖరులతోపాటు స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, సహాయకులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. వీరిపై ఆధారపడిన కుటుంబాలను కలుపుకొంటే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక...
తిరుపతి జిల్లా : జిల్లా పోలీస్ శాఖ : తిరుమల : స్వచ్ఛవార్త : - టీటీడీ సేవల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న నకిలీ వెబ్సైట్లపై పోలీసుల నిరంతర నిఘా... - 32 నకిలీ వెబ్సైట్లను గుర్తించి తొలగించిన తిరుపతి జిల్లా పోలీసులు... - అధికారిక టీటీడీ వెబ్సైట్, యాప్ ద్వారా మాత్రమే బుకింగ్‌లు చేసుకోవాలి.. జిల్లా ఎస్పీ... తిరుమలకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం టీటీడీ దర్శనం, వసతి, ప్రత్యేక ప్రవేశ దర్శనం, సేవా టికెట్లు తదితర సేవలను అధికారిక వెబ్సైట్ మరియు అధికారిక మొబైల్ యాప్ ద్వారా అందుబాటులో ఉంచింది. అయితే భక్తుల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని కొందరు సైబర్ నేరగాళ్లు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను పోలి ఉండే నకిలీ వెబ్సైట్లు, మొబైల్ యాప్‌లు, సోషల్ మీడియా లింకులను రూపొందించి భక్తులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చిన “ttddevasthanam.online” వంటి నకిలీ వెబ్సైట్ల ద్వారా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు దర్శనం, సేవా టికెట్లు అందుబాటులో ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తూ భక్తుల నుంచి నగదు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో తిరుపతి జి...
ఏలూరు జిల్లా : కలిదిండి : స్వచ్ఛవార్త : మండలంలోని మట్టగుంట గ్రామం 232 బూత్ పరిధిలోని దళితవాడలో, కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే లక్ష్యంతో ఇంటింటా ప్రచారం నిర్వహించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ అండ్రాజు శ్రీనివాసరావు హాజరై, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం (దీపం–2), గ్రామీణ రహదారులు, తాగునీరు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న సేవలు ప్రతి అర్హులైన కుటుంబానికి చేరేలా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షులు బళ్లా రాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుమలశెట్టి ఈశ్వర పరశురాముడు, మందపాటి పెంటయ్య, గరికిముక్కుల అమ్మరాజు తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా : ఏలూరు II టౌన్ క్రైమ్ : స్వచ్ఛవార్త : చెడు అలవాట్లకు బానిసై ఇంటిని విడిచి తిరుగుతున్న 11 ఏళ్ల బాలుడిని ఏలూరు టూ టౌన్ పోలీసులు సకాలంలో గుర్తించి రక్షించి పునరావాసం కల్పించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం. సుబ్బారావు ఆధ్వర్యంలోని శక్తి టీమ్ సహకారంతో బాలుడిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఎదుట హాజరుపరిచి, శనివారపుపేటలోని బాలల వసతి గృహంలో చేర్పించారు. పోలీసుల కథనం ప్రకారం... టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన బాలుడు కొంతకాలంగా వైట్నర్, సొల్యూషన్ వంటి మత్తు పదార్థాలను పీల్చడం, సిగరెట్లు తాగడం వంటి చెడు అలవాట్లకు లోనయ్యాడు. దీంతో పాటు చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడుతూ, పాఠశాలకు వెళ్లకుండా తరచూ ఇంటి నుంచి వెళ్లిపోతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ సమాచారంతో టూ టౌన్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ అప్రమత్తమై చర్యలు చేపట్టారు. డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్, సీఐ ఎం. సుబ్బారావు ఆదేశాల మేరకు పోలీసులు, శక్తి టీమ్ సభ్యులు బుధవారం బాలుడిని గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం బాలుడిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరుపరిచి, అతని భవిష్యత...
ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా జరిగిన ఘటన... వైయస్సార్ కడప జిల్లా : వల్లూరు : స్వచ్ఛవార్త : కడప - తాడిపత్రి జాతీయ రహదారిపై వల్లూరు మండల పరిధిలోని ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా బుధవారం ప్యాసింజర్ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. కమలాపురం నుంచి కడప వైపు వెళ్తున్న ఆటో ఒక్కసారిగా అదుపు కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అనంతరం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
తూ.గో జిల్లా : అమలాపురం : పేరూరు : స్వచ్ఛవార్త : అమలాపురం సమీపంలోని పేరూరు లో నూతనంగా ప్రారంభించబడిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు విద్యార్థుల సౌకర్యార్థం అమలాపురం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారని కళాశాల ప్రిన్సిపాల్ డా. విన్నా నరసింహ స్వామి తెలిపారు. ఉదయం అయినవిల్లి మండలంలోని విరవల్లిపాలెం, ఎస్. యానాం, ఆదుర్రు ప్రాంతాల నుండి ఆర్టీసీ బస్సులు బయలుదేరి నేరుగా కళాశాలకు చేరుకుంటాయని ఆయన వివరించారు. ఈ సౌకర్యాన్ని ఆయా ప్రాంతాల విద్యార్థినీ, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా రాజోలు నుండి అమలాపురం వెళ్లే మరియు అమలాపురం నుండి రాజోలు వచ్చే ఆర్టీసీ బస్సులు పేరూరులో ఆగేందుకు కూడా ఆర్టీసీ అధికారులు అనుమతి ఇచ్చారని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలపై కొన్ని ప్రైవేట్ కళాశాలలు అసత్య ప్రచారం చేస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా తమ దృష్టికి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. కళాశాల ఎక్కడికీ తరలించబడదని, ప్రభుత్వ జి.ఓ. నెం. 64 ప్రకారం పేరూరులోనే శాశ్వతంగా స్థాపించబడిందని స్పష్టం చేశారు. ప్రభుత్వ కళాశాలలో ఫీజులు చా...
విజయవాడ/విశాఖపట్నం : పత్రికా సమాచార కార్యాలయం(PIB) : స్వచ్ఛవార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు విశాఖపట్నంలో పత్రికా సమాచార కార్యాలయం (పిఐబి) విజయవాడ ప్రాంతీయ కార్యాలయం, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లా మరియు గ్రామీణ విలేకరుల కోసం ఏర్పాటు చేసిన ఒక రోజు మీడియా వర్క్‌షాప్ "వార్తాలాప్" ను ప్రారంభించారు. వర్క్ షాప్ ను ప్రారంభిస్తున్న మంత్రి సత్య కుమార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధి మరియు సుపరిపాలనతో కూడిన 12 ఏళ్ల పాలనను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఈ వర్క్‌షాప్‌ను నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి విలేకరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. గడిచిన పన్నెండేళ్లలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, విద్య, మహిళా సాధికారత, డిజిటల్ గవర్నెన్స్, ఆర్థిక విలీనం మరియు సామాజిక సంక్షేమం వంటి వివిధ రంగాలలో భారత ప్రభుత్వం సాధించిన అ...
ఏలూరు జిల్లా : చింతలపూడి : స్వచ్ఛవార్త : స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన ప్రత్యేక పాఠశాల టీకా కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పాల్గొన్నారు. విద్యార్థులకు అందిస్తున్న టీకా కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి, ఆరోగ్య సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఐదేళ్ల వయస్సు గల చిన్నారులకు డీపీటీ (DPT) టీకా, 10 మరియు 16 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులకు టీడీ (Td) టీకాలను అందించారు. టీకాల ద్వారా పిల్లలను పలు వ్యాధుల నుంచి రక్షించవచ్చని వైద్య సిబ్బంది వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ.. వ్యాక్సిన్లు పిల్లల ఆరోగ్య రక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. భవిష్యత్ ఆరోగ్య భద్రత కోసం ప్రతి చిన్నారికి ప్రభుత్వం సూచించిన టీకాలు తప్పనిసరిగా వేయించాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో చైతన్యంతో వ్యవహరించి పిల్లలకు సకాలంలో టీకాలు వేయించేందుకు సహకరించాలని కోరారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి టీకాలు అత్యంత అవసరమని, ప్రభుత్వం చేపడుతున్న ఆరోగ్య కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ అఫ...
తెలంగాణ : హైదరాబాద్ : స్వచ్ఛవార్త : రాష్ట్రంలో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియలో భాగంగా చేపడుతున్న ఓటరు జాబితా సవరణకు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిపై జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రక్రియ కేవలం తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించడానికేనని, ప్రజల్లో ఎలాంటి అపోహలు అవసరం లేదని తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు మరో ఐదు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉన్నందున ఆగస్టు 3లోగా డిజిటలైజేషన్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 76 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని, గ్రామీణ ప్రాంతాల్లో ఇది 90 శాతానికి చేరుకుందని వెల్లడించారు. ఖానాపూర్, బాల్కొండ, ఎల్లారెడ్డి, హుజూర్నగర్, నర్సంపేట్, వర్ధన్నపేట, పరకాల, బోధ్ నియోజకవర్గాల్లో డిజిటలైజేషన్ పూర్తిస్థాయిలో ముగిసిందని పేర్కొంటూ సంబంధిత అధికారులను అభినందించారు. మరోవైపు శేరిలింగంపల...
పశ్చిమగోదావరి జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భవిష్యత్తుపై భయాందోళనలతోనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌పై అనవసర విమర్శలు చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు(KNR)విమర్శించారు. భీమవరంలో ఆయన మాట్లాడుతూ.. డీఎస్సీ విషయంలో మంత్రి నారా లోకేష్ ఇప్పటికే స్పష్టమైన సవాల్ విసిరారని, జిల్లాలోని వైసీపీ నాయకులు ఎవరైనా సరే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. డీఎస్సీ నియామకాల అంశంపై వాస్తవాలను ప్రజల ముందుంచేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఎలాంటి వివాదాలు, అవకతవకలు లేదా చిన్నపాటి రిమార్క్ కూడా లేకుండా 16 వేల మంది ఉపాధ్యాయుల నియామక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన ఘనత మంత్రి నారా లోకేష్‌కే దక్కుతుందని కోళ్ల నాగేశ్వరరావు పేర్కొన్నారు. విద్యారంగాన్ని బలోపేతం చేయడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలకు కాలం చెల్లిందని, ఆధారాలు లేని ఆరోపణలు చేయడం మానుకుని వాస్తవాలపై చర్చకు రావాలని వైసీపీ నాయకులకు ఆయన సూచిం...
విశాఖపట్నం జిల్లా : విశాఖపట్నం : స్వచ్ఛవార్త : విశాఖపట్నంను సందర్శించిన వైద్య ,ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి లను లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్, ఆంధ్ర ప్రదేశ్ ఎంప్యానల్డ్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సత్కరించారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పిఐబి ) ఆధ్వర్యంలో విశాఖ నగరంలోని అంబిక బీచ్ గ్రాండ్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా వర్క్ షాప్ కు ముఖ్యఅతిథిగా హాజరైన సత్య కుమార్ యాదవ్ ను సన్మానించారు. అదేవిధంగా విజేఫ్ క్లబ్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరైన కొలుసు పార్థ సారధిని జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు సత్కరించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, దాడుల నివారణకు కమిటీలు, రైల్వే పాసులు పునరుద్ధరణ తదితర సమస్యలను వారి దృష్టికి తీసుకొని వచ్చారు. దానిపై సానుకూలంగా స్పందించిన మంత్రులు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తామని జర్నలిస్టు సంఘ నేతలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. సత్యనారాయణ,ఆంధ్ర ప్రదేశ్ ఎంప్యానల్డ్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ...