Machilipatnam : కృష్ణాజిల్లా నూతన జిల్లా రెవెన్యూ అధికారిగా కె. శ్రీధర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ
కృష్ణాజిల్లా : మచిలీపట్నం : స్వచ్ఛవార్త :
కృష్ణా జిల్లా నూతన జిల్లా రెవెన్యూ అధికారిగా (డీఆర్వో) కె. శ్రీధర్ రెడ్డి శుక్రవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన అధికారికంగా జిల్లా రెవెన్యూ అధికారి బాధ్యతలను చేపట్టారు.
ఇంతకుముందు ఆయన ప్రకాశం జిల్లాలో వెలుగు ప్రాజెక్ట్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వహించారు. పరిపాలనలో తనకు ఉన్న అనుభవాన్ని జిల్లాలో సమర్థవంతమైన రెవెన్యూ పరిపాలన, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు వినియోగిస్తానని ఈ సందర్భంగా డిఆర్ఓ తెలిపారు.
అధికారులు, సిబ్బంది నూతన జిల్లా రెవెన్యూ అధికారికి శుభాకాంక్షలు తెలియజేసి, ఆయనకు స్వాగతం పలికారు.
