📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Bapatla : పౌర హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత – తహసీల్దార్ షేక్ సలీమా


బాపట్ల జిల్లా : బాపట్ల : స్వచ్ఛవార్త :

మండలంలోని బేతపూడి గ్రామంలో మండల తహసీల్దార్ ఎస్.కె. సలీమా అధ్యక్షతన పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ ఎస్.కె. సలీమా మాట్లాడుతూ...

భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిందని, కులం, మతం, వర్ణం, లింగ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు, గౌరవం లభించేలా రాజ్యాంగం హామీ ఇస్తుందని తెలిపారు. పౌరులు తమ హక్కులను తెలుసుకుని వాటిని సద్వినియోగం చేసుకోవడంతో పాటు రాజ్యాంగం కల్పించిన విధులను కూడా బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పారదర్శకంగా, వివక్ష లేకుండా అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. 

సమాజంలో సామరస్యం, సమానత్వం, సామాజిక న్యాయం నెలకొల్పడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. పౌర హక్కుల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన సేవలందించడంలో మండల స్థాయి అధికారులు సమిష్టిగా కృషి చేస్తున్నారని ఆమె అభినందించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన అధికారులు, సిబ్బంది, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్థుల సహకారాన్ని తహసీల్దార్ ప్రత్యేకంగా ప్రశంసించారు. 

కార్యక్రమంలో మండల స్థాయి వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.ఎంఇఓ నిరంజన్, ఎంపీడీవో బాబూరావు, డిప్యూటీ ఎంపీడీవో పల్నాటి శ్రీరాములు, సాంఘిక సంక్షేమ శాఖ డిడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం