📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Bhimavaram : పదవీ విరమణ పొందిన పోలీసు సిబ్బందికి ఘన సన్మానం.. ఆత్మీయ వీడ్కోలు పలికిన డీఎస్పీ రఘువీర్

ప.గో జిల్లా : జిల్లా పోలీసు కార్యాలయం : భీమవరం : స్వచ్ఛవార్త : 

పశ్చిమగోదావరి జిల్లా పోలీసు విభాగంలో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందిన పోలీసు సిబ్బందిని శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా సన్మానించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పదవీ విరమణ పొందిన సిబ్బందికి జ్ఞాపికలు అందజేసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సబ్‌ ఇన్‌స్పెక్టర్ ఎస్‌.వి.వి.ఎస్‌. కృష్ణాజీ, నర్సాపురం డీఎస్పీ కార్యాలయానికి చెందిన హోంగార్డు బి. జయరాజును సత్కరించారు.

డీఎస్పీ రఘువీర్ విష్ణు మాట్లాడుతూ.. 

35 నుంచి 40 సంవత్సరాల పాటు ప్రజల భద్రత కోసం అహర్నిశలు శ్రమించి, విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి గౌరవప్రదంగా పదవీ విరమణ పొందడం అభినందనీయమన్నారు. పోలీసు శాఖకు ప్రతి ఉద్యోగి అందించే సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

పోలీసు విధులు సవాళ్లతో కూడుకున్నవని, ఈ క్రమంలో సిబ్బందికి అండగా నిలిచిన కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఎంతో గొప్పదని ఆయన తెలిపారు. పదవీ విరమణ అనేది ఉద్యోగానికి మాత్రమేనని, పోలీసు కుటుంబంతో వారి అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు.

కార్యక్రమంలో జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ కె.వి.వి.ఎన్. సత్యనారాయణ, మహిళా ఆర్మ్డ్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (అడ్మిన్) ఇందుమతి, హోంగార్డు ఇన్‌చార్జ్ ఆర్‌ఎస్‌ఐ కె. గోపీకృష్ణ, జిల్లా పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు సి.హెచ్. మోజేష్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం