Eluru : రేపు జిల్లా వ్యాప్తంగా 'జర్నలిస్ట్ డిమాండ్ డే' ఆందోళనలు
3 సెంట్ల స్థలం, హెల్త్ కార్డులు, పెన్షన్ సాధనకు APWJF, APBJA పిలుపు
ఏలూరు : స్వచ్ఛవార్త :..
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ - APWJF మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ - APBJA ఆధ్వర్యంలో *ఈ నెల 31వ తేదీ శుక్రవారం* రాష్ట్రవ్యాప్తంగా 'జర్నలిస్ట్ డిమాండ్ డే' నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా ఏలూరు జిల్లా లోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, ప్రధాన మండల కేంద్రాల్లో, అలాగే జిల్లా కేంద్రంలోనూ శాంతియుత నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
"డిమాండ్ డే" విజయవంతం చేయాలని పిలుపు...
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని *ఏలూరు APWJF అధ్యక్ష, కార్యదర్శులు జబీర్, హరీష్* మరియు *APBJA అధ్యక్ష, కార్యదర్శులు పి నారాయణ, ఎం కిరణ్* కోరారు.
వారు మాట్లాడుతూ... "ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునేందుకే ఈ ఆందోళన. ప్రతి జర్నలిస్టు ఈ కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలపాలి" అని అన్నారు.
ప్రధాన డిమాండ్లు :
1. ప్రతి జర్నలిస్టుకు 3 సెంట్ల స్థలం కేటాయించి ఇల్లు నిర్మించాలి.
2. ఇటీవల జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో *ప్రభుత్వ ఆధ్వర్యంలో అటాచ్ కమిటీ*ని వెంటనే ఏర్పాటు చేయాలి.
3. అందరు జర్నలిస్టులకు *హెల్త్ కార్డులు* జారీ చేయాలి.
4. జర్నలిస్టులకు *పెన్షన్ సదుపాయం* కల్పించాలి.
జిల్లా, మండల నాయకులు సమన్వయం చేయాలి...
ఈ 'డిమాండ్ డే'ను జిల్లా నాయకులు, మండల నాయకులు, నియోజకవర్గ నాయకులు అందరూ సమన్వయంతో నిర్వహించాలని, ప్రతి ఒక్క జర్నలిస్టు నడుం బిగించి ఈ ఆందోళనలో పాల్గొనాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.
