📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Polavaram : వరద పరిస్థితులపై ముందస్తు చర్యలు చేపట్టాలి : అధికారులకు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశం

పోలవరం  జిల్లా  : పోలవరం : స్వచ్ఛవార్త : 

ప్రస్తుతం పెరుగుతున్న గోదావరి వరదలను దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రభుత్వ శాఖల అధికార యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అప్రమత్తం చేశారు. శుక్రవారం వేలేరుపాడు లోని తాసిల్దార్ కార్యాలయంలో అన్ని శాఖల ప్రభుత్వ అధికారులతో వరదలపై అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ముఖ్యంగా ప్రప్రదంగా వరదలు చుట్టుముట్టే గ్రామాలలోని ప్రజలను, పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమాన్ని ముమ్మరం చేయాల్సిందిగా ఆదేశించారు. వైద్య సిబ్బంది గర్భిణీ స్త్రీలను సురక్షిత ప్రాంతాలలోని వైద్యశాలలో ఉంచి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిరక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. వరద చుట్టుముట్టిని గ్రామాల్లో ప్రజలకు ప్రభుత్వ పరంగా అందించాల్సిన సేవలను ఎవరికి వారు బాధ్యతాయుతంగా అందించాలని తెలిపారు. ముంపునకు గురయ్యే గ్రామాలను ఖాళీ చేపించి పునరావాస కాలనీలకు వరదలు సంభవించే మూడు నెలల వరకు అక్కడే ఉంచే ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, ఐటీడీఏ పీవో రాములు నాయక్, డి.ఎస్.పి జై కృష్ణ, సీఐ బాల సురేష్ బాబు, ఎస్సై నవీన్ కుమార్, తాసిల్దార్ శ్రీనివాస్ సిబ్బంది ఉన్నారు.

వరద పరిస్థితిపై జెసి సమీక్ష...

గోదావరి వరద పరిస్థితిని శుక్రవారం జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ సిబ్బందితో కలిసి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వరద చుట్టుముట్టిన గ్రామాల్లో ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని, ముఖ్యంగా కాలవుల్లో దాటే ప్రయత్నాలు చేయనివ్వకూడదని చేపల వేటకు వెళ్లే వారిని నిలుపుదల చేయాలని తదితర రక్షణకు సంబంధించిన సూచనలు అందించారు. ఇప్పటికే వరద పరిస్థితిపై 9 బోట్లు అవసరం ఉండగా నాలుగు బోట్లను సమీకరణ చేయడం జరిగిందని మరో అయిదు బోట్లను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు జెసి తెలిపారు. వరద ముంపుకు గురై గుట్టలపై తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసుకునేందుకు రుద్రంకోట గ్రామస్తులకు 750 తార్పాలియలను పంపిణీ చేయడం జరిగింది అన్నారు.

ప్రజారక్షణ చర్యలు పై పోలీసు అప్రమత్తం...

వరదల సమయంలో ఏ విధమైన ప్రాణ నష్టాలు జరగకుండా పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలని డి.ఎస్.పి జై కృష్ణ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ముఖ్యంగా రహదారుల పై చేరిన వరద నీటిలో దాటే ప్రయత్నం చేసే వారిని నిరువదించాలని, వరద ఉధృతం గా ఉన్నందున చేపల వేటను నియంత్రించాలని ప్రధానుగుణంగా ఎక్కడ సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిందిగా డి.ఎస్.పి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిఐ బాల సురేష్ బాబు, ఎస్సై నవీన్ కుమార్, సిబ్బంది ఉన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం