Vizag : రాష్ట్ర మంత్రులకు జర్నలిస్టు సంఘాల సత్కారం
విశాఖపట్నం జిల్లా : విశాఖపట్నం : స్వచ్ఛవార్త :
విశాఖపట్నంను సందర్శించిన వైద్య ,ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి లను లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్, ఆంధ్ర ప్రదేశ్ ఎంప్యానల్డ్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సత్కరించారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పిఐబి ) ఆధ్వర్యంలో విశాఖ నగరంలోని అంబిక బీచ్ గ్రాండ్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా వర్క్ షాప్ కు ముఖ్యఅతిథిగా హాజరైన సత్య కుమార్ యాదవ్ ను సన్మానించారు.
అదేవిధంగా విజేఫ్ క్లబ్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరైన కొలుసు పార్థ సారధిని జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు సత్కరించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, దాడుల నివారణకు కమిటీలు, రైల్వే పాసులు పునరుద్ధరణ తదితర సమస్యలను వారి దృష్టికి తీసుకొని వచ్చారు. దానిపై సానుకూలంగా స్పందించిన మంత్రులు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తామని జర్నలిస్టు సంఘ నేతలకు హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. సత్యనారాయణ,ఆంధ్ర ప్రదేశ్ ఎంప్యానల్డ్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విజయ కుమారి, కె .తిరుమలేశ్వర్, అసోసియేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా జాతీయ కౌన్సిల్ సభ్యుడు మొల్లి కమల్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. రామచంద్రరావు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి కె.చంద్రమోహన్,, ఎం శ్రీహరి, కడలి రాజేంద్రప్రసాద్, బి నారాయణరావు, పృద్వి రాజు తదితరులు పాల్గొన్నారు.

