Eluru : పొగాకు రైతులకు ఊరట.. బ్యారెల్‌కు రూ.50 వేల వడ్డీలేని రుణం
మూడేళ్ల గడువుతో రుణం అందించేందుకు పొగాకు బోర్డు అంగీకారం : ఎంపీ పుట్టా మహేష్‌కుమార్...
పొగాకు రైతులకు ఆర్థిక ఊరట కల్పించే కీలక నిర్ణయంగా లో గ్రేడ్ పొగాకు ఉత్పత్తి చేసిన రైతులకు బ్యారెల్‌కు రూ.50 వేల చొప్పున మూడేళ్లపాటు వడ్డీలేని రుణం అందించేందుకు పొగాకు బోర్డు అంగీకరించినట్లు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ తెలిపారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ఉన్న ఎంపీ గురువారం నిర్వహించిన పొగాకు బోర్డు సమావేశానికి వర్చువల్‌గా హాజరై రైతుల సమస్యలను ప్రస్తావించారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, అనుమతులకు మించి సాగు విస్తీర్ణం పెరగడం, లో గ్రేడ్ పొగాకుకు కొనుగోలుదారులు ముందుకు రాకపోవడం వంటి కారణాలతో ధరలు తగ్గాయని సమావేశంలో వివరించారు.
పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, పొగాకు బోర్డు సమన్వయంతో కృషి చేస్తున్నాయని ఎంపీ తెలిపారు. గత రెండేళ్లలో కేజీ పొగాకుకు గరిష్టంగా రూ.470 వరకు ధర లభించేలా చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు.
ఈ ఏడాది కూడా రైతులకు కనీసం కేజీకి రూ.300కు పైగా ధర వచ్చేలా అన్ని స్థాయిల్లో ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పుట్టా మహేష్‌కుమార్ వెల్లడించారు. వడ్డీలేని రుణం అందుబాటులోకి రావడంతో ధరల సమస్యల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పొగాకు రైతులకు కొంతమేర ఉపశమనం కలగనుందని ఆయన పేర్కొన్నారు.
Three year interest free loan for tobacco farmers - MP Putta Mahesh Kumar
.. Interest-free loan of Rs 50,000 per barrel.
.. Three-year concession for farmers who grow "low grade" tobacco.
.. Price reduced with international developments.
.. We are working to provide remunerative prices.
.. Eluru MP speaking at the Tobacco Board meeting.
Delhi/Eluru : Swachavartha :
Eluru MP Putta Mahesh Kumar said that the coalition government is committed to the welfare of tobacco farmers. The MP, who was in Delhi during the monsoon session of Parliament, virtually attended the Tobacco Board meeting held on Thursday. On this occasion, MP Putta Mahesh Kumar brought to the attention of the board the fall in tobacco prices at the purchasing centers this year and the debt problems of farmers. Later, the MP released a video statement on the details of the meeting. He said that he, Chief Minister Chandrababu Naidu, Agriculture Minister Atchannaidu have spoken to the Union Commerce Minister, the Chairman and members of the board several times to help the tobacco farmers. The MP revealed that the Tobacco Board has agreed to provide an interest-free loan of Rs 50,000 per barrel in the meeting held today. He said that this will provide some relief to the farmers who have grown "low grade" tobacco.
The MP said that it is true that the price has come down significantly this year due to international developments, but that farmers are also growing more than allowed, which is causing problems. The MP said that difficulties have arisen as companies have not come forward to purchase low grade tobacco, and that they are working hard to provide remunerative prices. The MP explained that their goal is to make farmers happy, and that they have worked hard to get a good price for tobacco in the last two years and have managed to get a maximum of Rs. 470 per kg, and this year they are making every effort to keep it above 300 at least.
