📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Buttayagudem : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలి : సీపీఐ

 

ఏలూరు జిల్లా : బుట్టాయగూడెం : స్వచ్ఛవార్త :

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో విస్తృత పోరాటాలు చేపట్టనున్నట్లు సీపీఐ పోలవరం నియోజకవర్గ కార్యదర్శి కారం దారయ్య తెలిపారు. మండలంలోని బుట్టాయగూడెం, సీపీఐ కార్యాలయంలో ఆ పార్టీ మండల కార్యవర్గ సభ్యుడు తెల్లం ముణేశ్వరావు అధ్యక్షతన శుక్రవారం సీపీఐ మండల శాఖ సమావేశం నిర్వహించారు. 

ఈ సమావేశంలో దారయ్య మాట్లాడుతూ.... 

దేశంలో బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో బిజెపి అనుకూల ప్రభుత్వాల పాలనలో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య కుటుంబాల పోషణ ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలను తక్షణమే అరికట్టాలని డిమాండ్ చేశారు. రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరారు. విద్య, వైద్య సేవలను మరింత మెరుగుపరిచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. 

ప్రజా సమస్యల పరిష్కారం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జీపు జాత, ఆగస్టు 6 నుండి 15 వరకు జరిగే పాదయాత్ర, అలాగే సెప్టెంబర్ 1న నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ ప్రజాపోరాటాల్లో మండలంలోని రైతులు, కూలీలు, యువకులు, ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని దారయ్య కోరారు. అనంతరం చలో ఢిల్లీ గోడ పత్రికలను పార్టీ కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు. 

సమావేశంలో సిపిఐ జిల్లా సమితి సభ్యుడు కొప్పుల నాగరాజు, పార్టీ కార్యకర్తలు మడకం దుర్గారావు, కొడమంచిలి బాబురావు, కోరం సత్తిబాబు, ఉయుకే నాగేశ్వరరావు, కుర్సం రామలక్ష్మి, ఉడత మంగమ్మ, గుండి నాగరత్నం, బుద్దుల ముత్యాలమ్మ, కారం వీరమ్మ, మడకం గంగరాజు, పోలోజు సుబ్రమణి, తెల్లం వీరమ్మ తదితరులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం