📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Chipurupalli : భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి చీపురుపల్లి నియోజకవర్గం నుంచి భారీ జన సమీకరణ

ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కళా వెంకట్రావు, మాజీమంత్రి దేవినేని ఉమ, కోళ్ల నాగేశ్వరరావు (KNR)

భీమవరం/చీపురుపల్లి : స్వచ్ఛవార్త :

భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి చీపురుపల్లి నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున ప్రజలను తరలించే ఏర్పాట్లపై ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు లతో ప్రత్యేక పరిశీలకుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు (KNR) శుక్రవారం సమగ్ర సమీక్ష నిర్వహించారు.

నియోజకవర్గ స్థాయిలో వివిధ మండలాల నుంచి ఎన్ని బస్సులు, కార్లు, ఆటోలు, మోటార్ సైకిళ్లు వస్తున్నాయి, ఏ సమయానికి బయలుదేరాలి, అల్పాహారం, భోజన వసతులు తదితర అంశాలపై ఇంచార్జిలు, నాయకులు, అధికారులతో విస్తృతంగా చర్చించి తగు సూచనలు చేశారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు.

విమానాశ్రయం ప్రారంభోత్సవం రాష్ట్ర అభివృద్ధికి కీలక ఘట్టమని పేర్కొన్న కోళ్ల నాగేశ్వరరావు(KNR), చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనేలా అన్ని మండలాల్లో సమన్వయంతో పనిచేయాలని నాయకులకు సూచించారు. కార్యక్రమం విజయవంతం కావడానికి పార్టీ శ్రేణులు సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

సమీక్ష సమావేశంలో పరిశీలకుడు పుచ్చా విజయకుమార్, యువ నాయకుడు రామ్ మల్లిక్ నాయుడు, మండల పరిశీలకుడు రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం