Bhimavaram : శ్రీ మావుళ్లమ్మ స్వర్ణ వస్త్ర ప్రాజెక్టుకు రూ.2.01 లక్షల విరాళం.. దాతలను సత్కరించిన ఆలయ అధికారులు
పశ్చిమగోదావరి జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త :
భీమవరం పట్టణంలోని ప్రసిద్ధ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్ర ప్రాజెక్టుకు చినఅమిరం గ్రామానికి చెందిన గొట్టుముక్కల వెంకట రమేష్ రాజు, వెంకట లక్ష్మి పద్మావతి దంపతులు రూ.2,01,116 విరాళం అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు సమక్షంలో ఈ విరాళాన్ని ఆలయ అధికారులకు అందించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి దాతలకు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, జ్ఞాపికను అందజేసి దాతలను సత్కరించారు.
మావుళ్లమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్ర ప్రాజెక్టు కోసం భక్తులు స్వచ్ఛందంగా అందిస్తున్న విరాళాలు ఆలయ అభివృద్ధికి దోహదపడుతున్నాయని ఆలయ అధికారులు తెలిపారు.
కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, గుసిడి నాగ శిరీష, పాపోలు ఏడుకొండలు, స్వర్ణ వస్త్ర ప్రాజెక్టు కమిటీ సభ్యులు గొంట్ల నారాయణ ప్రసాదం తదితరులు పాల్గొన్నారు.
