Vijayanagaram : గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజును మర్యాదపూర్వకంగా కలిసిన కోళ్ళ(KNR)
విజయనగరం జిల్లా : స్వచ్ఛవార్త :
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు(KNR) గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజును శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా శాలువా కప్పి జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధి, సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. ప్రజా జీవితంలో అశోక్ గజపతి రాజు అందిస్తున్న సేవలను కోళ్ల నాగేశ్వరరావు అభినందించారు.

