📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Chipurupalli : జన సమీకరణ ఏర్పాట్లపై నేతలతో కలిసి తెదేపా రాష్ట్ర కార్యదర్శి "KNR" పర్యటన

 

భీమవరం/చీపురుపల్లి : స్వచ్ఛవార్త : 

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు(KNR )గురువారం చీపురుపల్లి నియోజకవర్గంలోని చీపురుపల్లి, గరివిడి మండలాల్లో ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, అధికార గణంతో కలిసి పర్యటించారు. 

ఈ సందర్భంగా రానున్న కార్యక్రమాల విజయవంతానికి చేపట్టాల్సిన జన సమీకరణ ఏర్పాట్లపై నాయకులు, కార్యకర్తలతో సమావేశమై చర్చించారు. గ్రామాల వారీగా పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు.

కార్యక్రమాల నిర్వహణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు సమర్థవంతమైన కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు.

ఈ పర్యటనలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం