📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kalidindi : ప్రతి ఇంటికి అభివృద్ధి.. ప్రతి కుటుంబానికి సంక్షేమం.. అదే కూటమి ప్రభుత్వ లక్ష్యం : అండ్రాజు శ్రీను


ఏలూరు జిల్లా : కలిదిండి : స్వచ్ఛవార్త :

మండలంలోని మట్టగుంట గ్రామం 232 బూత్ పరిధిలోని దళితవాడలో, కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే లక్ష్యంతో ఇంటింటా ప్రచారం నిర్వహించి కరపత్రాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ అండ్రాజు శ్రీనివాసరావు హాజరై, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం (దీపం–2), గ్రామీణ రహదారులు, తాగునీరు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న సేవలు ప్రతి అర్హులైన కుటుంబానికి చేరేలా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షులు బళ్లా రాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుమలశెట్టి ఈశ్వర పరశురాముడు, మందపాటి పెంటయ్య, గరికిముక్కుల అమ్మరాజు తదితరులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం