Kalidindi : మానవ అక్రమ రవాణాపై అప్రమత్తత అవసరం : కైకలూరు న్యాయమూర్తి లక్ష్మి
కోరుకొల్లు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం...
ఏలూరు జిల్లా : కలిదిండి : కోరుకొల్లు : స్వచ్ఛవార్త :
ప్రపంచ మానవ అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా కలిదిండి మండలం కోరుకొల్లు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కైకలూరు న్యాయమూర్తి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ..
మానవ అక్రమ రవాణా సమాజానికి పెను ముప్పుగా మారిన నేరమని పేర్కొన్నారు. ఉద్యోగాలు, ఉన్నత విద్య, వివాహాల పేరుతో మోసగాళ్లు అమాయకులను వలలో వేసే ప్రయత్నాలు చేస్తున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు.
అడ్వకేట్ మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణాకు సంబంధించిన చట్టాలు, బాధితులకు అందుబాటులో ఉన్న న్యాయ సహాయం గురించి వివరించారు. చట్టాలపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా ఇటువంటి నేరాలను అరికట్టవచ్చన్నారు.
కలిదిండి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ మాట్లాడుతూ..
యువత సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా అత్యవసర సేవల నంబర్ 112కు సమాచారం అందించాలని తెలిపారు. మహిళలు, బాలికల భద్రత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలు, సైబర్ మోసాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

