Ghantasala : శ్రీకాకుళం అయోద్య రామాలయంలో వెయ్యి మందికి అన్నసమారాధన.. అమ్మవారిని దర్శించుకున్న ఎస్ఐ చందన
కృష్ణా : శ్రీకాకుళం / ఘంటసాల (స్వచ్ఛవార్త) :
విజయవంతంగా ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలోని సోమిశెట్టి వారి వీధిలోని అయోద్య రామాలయంలో దసరా నవరాత్రులు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మ వారికి ఘంటసాల ఎస్ఐ వేమన చందన మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం వెయ్యి మందికి జరిగిన అన్నసమారాధన కార్యక్రమాన్ని ఎస్ఐ చందన ప్రారంభించారు.
కార్యక్రమంలో కఠారి తాతయ్య, సోమిశెట్టి ముసలయ్య, అడపా విజయ్, సోమిశెట్టి రవి, సోమిశెట్టి గంగయ్య, సోమిశెట్టి వెంకట నారాయణ, సోమిశెట్టి రమేష్, సోమిశెట్టి సాయి, కఠారి శ్రీనివాసరావు, సోమిశెట్టి ఎమ్మెల్యే, సోమిశెట్టి పండు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
