📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Bhimavaram : శ్రీ మావుళ్లమ్మ ఆలయంలో 9 వేల మంది భక్తులకు అన్నదానం.. శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా అన్నప్రసాద వితరణ

ప.గో జిల్లా : భీమవరం (స్వచ్ఛవార్త) :

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని ప్రముఖ ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 9 వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించారు.

భక్తులకు అన్నప్రసాదం అందించే కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి. హరి సూర్యప్రకాష్, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఉదిసి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్, గుసిడి శిరీష, కారెంపూడి ఆదిలక్ష్మి, అరసవల్లి సుబ్రహ్మణ్యం, మిర్తిపాటి గున్నేశ్వరరావు, మల్లువలస లక్ష్మి నిర్మల, గొంతెన రమణ, యండ సత్యవతి, ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, పాపోలు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన అన్నదానంలో వేలాది మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం