Bhimavaram : మావుళ్లమ్మ సన్నిధిలో చిన్నారులకు చదువుల కానుక.. 7వ రోజు సరస్వతీ దేవిగా అమ్మవారి దర్శనం
పశ్చిమగోదావరి జిల్లా : భీమవరం (స్వచ్ఛవార్త) :
భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శ్రీదేవీ శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం భీమవరం పట్టణంలోని ప్రముఖ ఇలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ విద్యార్థుల కోసం సరస్వతీ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి. హరిసూర్య ప్రకాష్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఉదిసి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్, గుసిడి శిరీష, కారెంపూడి ఆదిలక్ష్మి, అరసవల్లి సుబ్రహ్మణ్యం, మిర్తిపాటి గున్నేశ్వరరావు, మల్లువలస లక్ష్మి నిర్మల, గొంతెన రమణ, యండ సత్యవతి, ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, పాపోలు ఏడుకొండలు విద్యార్థులకు విద్యాసామగ్రిని అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన మేజిక్ షో భక్తులను, చిన్నారులను అలరించింది.

