📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Bhimavaram : శ్రీ మావుళ్లమ్మ సన్నిధిలో 160 మంది భక్తుల మాలధారణ.. 41 రోజుల మండల దీక్షకు శ్రీకారం

ప.గో జిల్లా : భీమవరం (స్వచ్ఛవార్త) :

భీమవరం పట్టణంలోని ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో 41 రోజుల మండల దీక్ష మాలధారణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 160 మంది భక్తులు అమ్మవారి మాలలు ధరించి మండల దీక్షను ప్రారంభించినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి. హరిసూర్య ప్రకాష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మాలధారణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా జరిపించారు. అమ్మవారిపై భక్తితో మాలలు ధరించిన భక్తులు రానున్న 41 రోజుల పాటు నియమనిష్ఠలతో మండల దీక్షను ఆచరించనున్నారు. దీక్షా కాలంలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ అమ్మవారి అనుగ్రహం పొందేందుకు భక్తులు సిద్ధమయ్యారు.

కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం పాల్గొన్నారు. ఆలయంలో నిర్వహించిన మాలధారణ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.


షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం