Gudlavalleru : ఆశ్వీయుజ పౌర్ణమి వేళ శ్రీ కొండలమ్మ సన్నిధిలోరుద్ర సహిత చండీ హవనం
కృష్ణా : గుడ్లవల్లేరు /వేమవరం (స్వచ్ఛవార్త) :
ఆశ్వీయుజ పౌర్ణమి సందర్భంగా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలోని శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించిన అనంతరం ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి సన్నిధిలో రుద్ర సహిత చండీ హవనం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ముఖ్య అర్చకుడు రుద్రపాక శివ సంతోష్ శర్మ ఆధ్వర్యంలో దేవస్థాన సిబ్బంది సమిష్టిగా కృషి చేసి నిర్వహించారు.

కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు, ధర్మకర్తల మండలి చైర్మన్ ఈడే వెంకట విష్ణు మోహనరావు, మండలి సభ్యురాలు నూతలపాటి లక్ష్మీ పావని, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. ఈ వివరాలను ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఒక ప్రకటనలో తెలిపారు.
