📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Gudlavalleru : శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు కొండలమ్మ దర్శనం

  • శరన్నవరాత్రులకు భక్తుల తాకిడి.. ముగింపు రోజున ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు...

కృష్ణా : గుడ్లవల్లేరు/ వేమవరం (స్వచ్ఛవార్త) :

శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. ఆశ్వయుజ శుద్ధ దశమి సందర్భంగా అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన పూజలు, ఏర్పాట్లను దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు, ధర్మకర్తల మండలి చైర్మన్ ఈడే వెంకట విష్ణు మోహనరావు, సభ్యులు, ముఖ్య అర్చకుడు ఆర్.ఎస్.సి.ఎస్. సంతోష్ శర్మ పర్యవేక్షించారు.

తొలుత సహస్రనామార్చన నిర్వహించి, అనంతరం కుంకుమ పూజ, శ్రీ లలితా హవనం, రుద్ర హవనం నిర్వహించారు. సమస్త విజయప్రాప్తిని ఆకాంక్షిస్తూ మహా పూర్ణాహుతి, నీరాజనం, మంత్రపుష్పం సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. సాయంత్రం సాయంకాలార్చన, శమీపూజ, ఉయ్యాల సేవ, పంచహారతులు, చతుర్వేద స్వస్తి కార్యక్రమాలు నిర్వహించారు.

భక్తులకు సౌకర్యాలు :

ఉత్సవాలకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ పరిసరాల్లో పారిశుధ్య పనులు చేపట్టి బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో హోమియో వైద్య శిబిరం, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. పోలీసు శాఖ ఔట్‌పోస్ట్‌ను ఏర్పాటు చేయగా, అగ్నిమాపక శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు :

ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి దత్త సాయి శ్రీ శివాని కూచిపూడి నాట్యాలయం వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన, లక్ష్మీ లీలా భాగవతారిణి వారిచే హరికథా కాలక్షేపం, చల్లపల్లి కళాకారులచే బాలనాగమ్మ పౌరాణిక నాటకం ప్రదర్శించారు. మంగళవారం మధ్యాహ్నం మచిలీపట్నం శ్రీ వెంకటేశ్వర మహిళా భజన సమాజం, శ్రీ శివకేశవ భజన సమాజం వారిచే భజన కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి కైకలూరుకు చెందిన శ్రీ నటరాజ కళాక్షేత్రం వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన, శ్రీ సత్యహరిశ్చంద్ర పౌరాణిక నాటకం ప్రదర్శించనున్నట్లు కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు.

ధర్మకర్తల మండలి సభ్యులు తూము రాజ్యలక్ష్మి, గుడ్లవల్లేటి వాణి, కళ్లేపల్లి సుగుణ శేఖర్, వడ్లమూడి రవీంద్రబాబు, మన్నెం వీర నాగేంద్రరావు, ముంగం ఆంజనేయులు, నూతలపాటి లక్ష్మీ పావని, పెద్దిబోయిన శ్యామల దేవి, ఉస్తేల కోటేశ్వరమ్మ, పెన్నేరు వీర వెంకట నాగ లీల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం