📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Bhimavaram : శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో నవరాత్రుల శోభ.. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనం


పశ్చిమగోదావరి జిల్లా : భీమవరం (స్వచ్ఛవార్త) :

దసరా శరన్నవరాత్రుల సందర్భంగా పట్టణంలోని ప్రముఖ ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారు ఉత్సవాలు 6వ రోజున శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా బెంగళూరుకు చెందిన ఏలూరి వినోద్, భక్త కిరణ్మయి అమ్మవారి దేవస్థానానికి రూ.50,000 విరాళంగా అందజేశారు. ఈ విషయాన్ని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

విరాళం అందించిన భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు దాతలను శేషవస్త్రంతో సత్కరించి, అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు.

కార్యక్రమంలో ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఉదిశి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్, గుసిడి నాగ శిరీష, మల్లువలస లక్ష్మి నిర్మల, పాపోలు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం