📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Jeelugumilli : భారీ ర్యాలీతో ఎంపీటీసీ నామినేషన్లు దాఖలు చేసిన కూటమి అభ్యర్థులు


  • ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆధ్వర్యంలో జీలుగుమిల్లిలో నామినేషన్ల సమర్పణ

 ఏలూరు జిల్లా : జీలుగుమిల్లి (స్వచ్ఛవార్త) :

జీలుగుమిల్లి మండలంలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో 9 ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేస్తున్న కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) అభ్యర్థులు శుక్రవారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ పత్రాలను సమర్పించారు.

ముందుగా బర్రింకలపాడులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరారు. అనంతరం జీలుగుమిల్లి ప్రధాన కూడలికి చేరుకుని జగదాంబ అమ్మవారిని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అభ్యర్థులతో కలిసి దర్శించుకున్నారు. అక్కడి నుంచి తీన్మార్ డప్పుల నడుమ ఉత్సాహంగా ర్యాలీగా జీలుగుమిల్లి ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని సంబంధిత అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు.

నామినేషన్లు దాఖలు చేసిన కూటమి అభ్యర్థులు :

  1. జీలుగుమిల్లి: కారం సుజాత
  2.  కామయ్యపాలెం: సోదేం విజయకుమారి
  3. వంకవారిగూడెం: కుంజా రాంబాబు
  4.  తాటియాకులగూడెం: జాస్తి హేమ
  5.  రాచాన్నగూడెం: వెన్నెం మాధవి
  6. అంకన్నగూడెం: జమ్మి గోపి ములగలంపల్లి: వనమా శాంతి
  7. దర్భగూడెం: పద్దం వెంకటకృష్ణ

కార్యక్రమంలో కూటమి నాయకులు గడ్డమనగు రవికుమార్, పసుపులేటి రాము, సుంకవల్లి సాయి, బండారు అనిల్ కుమార్, ఉండవల్లి సోమసుందరం, జాస్తి సత్యనారాయణ, సూరిశెట్టి మహేష్, గుడపాటి పుల్లయ్య, గుడపాటి అరుణ్ కుమార్, పానుగంటి శ్రీను, నాలి శ్రీను, సంకుల రామకృష్ణ, గూడెల్లి లక్ష్మీనారాయణ, కోర్స దుర్గారావు, తమ్మన సాంబ, చాపా రవి, మరీదు కొండయ్య, పండు, నారాయణ, కుంజా రమేష్, వీరంకి వెంకటేశ్వరరావు, కిరణ్, రాయి సుబ్బారావు, వనమా రాంబాబు, చప్పిడి హరికృష్ణ, చిర్రి శ్రీను, కోలా మధు, రూపా సత్యనారాయణ, కొప్పుల శ్రీకాంత్, సొంటి రామకృష్ణ, కక్కిరాల శ్రీను, సాదు చెన్నారావు, మందపాటి సూర్య, పేరుబోయిన దాము, భరగడ రాజు, మద్దాల రమేష్, దేవుడు శ్రీను తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం