📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kaikaluru : కైకలూరు జడ్పీటీసీ అభ్యర్థిగా బలే ఏసు రాజు నామినేషన్


  • కామినేని శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఏసు రాజు.. మండల అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి...

ఏలూరు జిల్లా : కైకలూరు (స్వచ్ఛవార్త) :

స్థానిక సంస్థల ఎన్నికల్లో కైకలూరు మండల జడ్పీటీసీ అభ్యర్థిగా బలే ఏసు రాజు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి జడ్పీ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా ఏసు రాజు మాట్లాడుతూ... తనపై నమ్మకంతో జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌కు, కూటమి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే తనపై ఉంచిన నమ్మకాన్ని ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు. కైకలూరు మండల పరిధిలోని ప్రతి గ్రామ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మండలంలోని ఎంపీటీసీ అభ్యర్థులందరినీ భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు శ్రమిస్తానని తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ఎన్నికల్లో ముందుకు సాగుతానన్నారు.

కార్యక్రమంలో కైకలూరు ఎక్స్ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్, కైకలూరు మండల ముఖ్య నాయకులు, ఎంపీటీసీ అభ్యర్థులు, కొల్లేరు లంక గ్రామాల పెద్దలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బలే ఏసు రాజుకు శుభాకాంక్షలు తెలిపారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం