📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kaikaluru : జోరువానలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే కామినేని పర్యటన

  • ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలి...

ఏలూరు జిల్లా : కైకలూరు (స్వచ్ఛవార్త) :

అర్నాబ్ తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యుడు, ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్ డా. కామినేని శ్రీనివాస్ బుధవారం జోరువానలో పలు ప్రాంతాల్లో పర్యటించి తుఫాన్ ప్రభావాన్ని, నష్ట తీవ్రతను పరిశీలించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ సహాయక చర్యలను సమీక్షించారు.

ఈ సందర్భంగా కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. 

తుఫాన్ ప్రభావం తగ్గే వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడి కనిపిస్తే వాటికి దూరంగా ఉండాలని, వెంటనే సంబంధిత అధికారులకు లేదా తన కార్యాలయ సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. రహదారులపై కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, స్థానిక పోలీసులు, వివిధ శాఖల అధికారులు గత రాత్రి నుంచే సహాయక చర్యలు చేపడుతున్నారని తెలిపారు.

ప్రజలు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఎమ్మెల్యే సూచించారు. తుఫాన్ ప్రారంభమైనప్పటి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగుసార్లు అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, జిల్లాల వారీగా పరిస్థితులపై నివేదికలు తీసుకుంటూ సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారని పేర్కొన్నారు. విపత్తు సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం, అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం