📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Eluru : జిల్లాలో రేపటి నుంచి పింఛన్ల పంపిణీ : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి


ఏలూరు జిల్లా : ఏలూరు కలెక్టరేట్ (స్వచ్ఛవార్త) :

జిల్లాలో నవంబర్ నెలకు సంబంధించిన సామాజిక పింఛన్ల పంపిణీ ఈనెల 30వ తేదీ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 2,52,397 మంది పింఛనుదారులకు రూ.111.04 కోట్లను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.

అనివార్య కారణాల వల్ల అక్టోబర్ 30న పింఛను తీసుకోలేని లబ్ధిదారులకు నవంబర్ 5వ తేదీ వరకు పంపిణీ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీ కోసం జిల్లావ్యాప్తంగా 4,916 మంది గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగులను నియమించినట్లు తెలిపారు.

నవంబర్ నెల పింఛన్ల పంపిణీపై మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ చెప్పారు. అక్టోబర్ 30న పింఛన్ల పంపిణీకి నగదు కొరత లేకుండా చూడాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్‌ను ఆదేశించినట్లు తెలిపారు.

పింఛనుదారులకు ముందస్తుగా సమాచారం అందించి, పింఛను తీసుకునే సమయంలో సంబంధిత సచివాలయ సిబ్బందికి తమ ఇళ్ల వద్ద అందుబాటులో ఉండేలా చూడాలని జెడ్పీ సీఈవో ఎం. కృష్ణమోహన్, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ టి. విజయలక్ష్మి, జిల్లా స్వర్ణ గ్రామ, సచివాలయ నోడల్ అధికారి వెంకటనాయుడుతో పాటు సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం