Kaikaluru : ఎన్నికల నియమావళిని పాటిస్తూ శాంతి భద్రతలకు సహకరించాలి : రూరల్ ఎస్‌ఐ రాంబాబు
ఏలూరు జిల్లా : కైకలూరు రూరల్[క్రైమ్] (స్వచ్ఛవార్త) :
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం ఆలపాడు గ్రామంలో కైకలూరు రూరల్ ఎస్‌ఐ వి. రాంబాబు అవగాహన సమావేశం నిర్వహించారు. ఎన్నికల నియమ నిబంధనలు, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ చట్టాలను, ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. గ్రామంలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడుతూ ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు.
ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా పోలీసు శాఖకు సహకరించాలని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ వి. రాంబాబు హెచ్చరించారు.

