📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Machilipatnam : సమన్వయమే బలం.. కూటమి గెలుపే లక్ష్యం.. కూటమి సమన్వయ కమిటీ సమావేశంలో నేతలు

కృష్ణాజిల్లా : మచిలీపట్నం : స్వచ్ఛవార్త :

జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి అధ్యక్షతన కూటమి సమన్వయ కమిటీ సమావేశం శనివారం మచిలీపట్నంలో జరిగింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అనుసరించాల్సిన విధానాలు, మూడు పార్టీల మధ్య క్షేత్రస్థాయి సమన్వయం, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో, ఐక్యతతో ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా కూటమి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు.

పదవులను ఆశించే నాయకులు, కార్యకర్తలు ఎంతోమంది ఉన్నప్పటికీ, ఎవరికి ఏ సీటు కేటాయించాలన్నది కూటమి పార్టీల అధిష్ఠానాలు నిర్ణయిస్తాయని, ఆ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించి కూటమి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని నాయకులు స్పష్టం చేశారు. అవసరమైన చోట వ్యక్తిగత ఆశలను పక్కనపెట్టి త్యాగాలకు కూడా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

సీటు ఏ పార్టీకి దక్కిందనేది ముఖ్యం కాదు.. పోటీ చేసేది కూటమి అభ్యర్థి. అభ్యర్థి ఎవరిదైనా గెలుపు మాత్రం కూటమిదే. మూడు పార్టీల శ్రేణులు క్షేత్రస్థాయిలో కలిసికట్టుగా పనిచేసి కూటమి బలాన్ని మరింత పెంచాలని నాయకులు పేర్కొన్నారు.

కూటమి పార్టీల మధ్య పరస్పర గౌరవం, సమన్వయం, ఐక్యతను మరింత బలోపేతం చేసుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని నాయకులు పిలుపునిచ్చారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే కూటమి ప్రయోజనాలు, పదవుల కంటే కూటమి విజయం ముఖ్యమనే భావనతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు కొమ్మలపాటి శ్రీధర్, జనసేన కోఆర్డినేటర్, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్, జనసేన కోఆర్డినేషన్ టీం సభ్యులు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, పినిశెట్టి నాగచాయాదేవి, జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు తాతినేని శ్రీరామ్ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం