📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kaikaluru : డ్రైనేజీ సమస్యపై నేతల చొరవ.. రాచపట్నం ఎస్సీ, బీసీ కాలనీల్లో సమస్యకు తక్షణ పరిష్కారం

ఏలూరు జిల్లా : కైకలూరు : స్వచ్ఛవార్త :

రాచపట్నం గ్రామంలోని ఎస్సీ, బీసీ కాలనీల్లో పూడిపోయిన డ్రైనేజీలతో మురుగునీరు రోడ్లపైకి వచ్చి గ్రామస్తులు, పాఠశాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని టీడీపీ, రాష్ట్ర దళిత నాయకుడు జక్కుల విజయ్ కుమార్ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం సమస్యను పరిశీలించిన ఆయన వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామ సచివాలయ కార్యదర్శి టీ. శ్రీవిద్యకు తెలియజేశారు.జక్కుల విజయ్ కుమార్‌తో పాటు రాష్ట్ర దళిత నాయకులు పాట్రిక్ పాల్, మానికొండ రాజారావు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన గ్రామ సచివాలయ కార్యదర్శి వెంటనే సిబ్బందిని పంపి డ్రైనేజీ పూడిక తీయించారు. దీంతో కాలనీల్లో మురుగునీటి సమస్యకు పరిష్కారం లభించింది.

సమస్యను వెంటనే పరిష్కరించేందుక చొరవ చూపిన జక్కుల విజయ్ కుమార్, పాట్రిక్ పాల్, ఇతర నాయకులు, సచివాలయ సిబ్బందికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం