Bhimavaram : శ్రీ ఎలైట్ ఐఏఎస్ అకాడమీని ప్రారంభించిన "కేఎన్ఆర్"
పశ్చిమగోదావరి జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త :
పట్టణంలోని విజేత ఫ్రీ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ ఏలైట్ ఐఏఎస్ అకాడమీని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు (కేఎన్‌ఆర్) ప్రారంభించారు. ఈ సందర్భంగా అకాడమీ ద్వారా యువతకు పోటీ పరీక్షలకు మెరుగైన శిక్షణ అందించాలని ఆకాంక్షించారు.
కేఎన్‌ఆర్ మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో 16,400 పోస్టులకు గాను ఈ అకాడమీ సంతృప్తికరమైన ఫలితాలు సాధించిందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1లో వివిధ కేటగిరీల కింద 892 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అకాడమీ ద్వారా అత్యధిక విజయాలు సాధించేలా విద్యార్థులు కష్టపడి చదవాలని కోరారు.
కార్యక్రమంలో అకాడమీ చైర్మన్ గుడిసె రాము, ఓబిలిశెట్టి వెంకటేశ్వరులు, అకాడమీ ప్రిన్సిపాల్, సెక్రటరీ, సిబ్బంది, యువత, విద్యార్థులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
