📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Amaravati : అమరావతి ఉద్యమకారులకు డాక్టర్ మనోజ్ శ్రద్ధాంజలి.. విజయవాడలో పాస్టర్ల రూ.116 సాయం

  • మందడంలో సంస్మరణ సభ.. అనంతరం విజయవాడలో పాస్టర్ల రూ.116 సాయం కార్యక్రమం

అమరావతి/విజయవాడ : స్వచ్ఛవార్త :

ఇటీవల జరిగిన వరుస దురదృష్టకర సంఘటనల్లో మృతి చెందిన అమరావతి ఉద్యమానికి చెందిన ఆత్మీయులకు శ్రద్ధాంజలి ఘటించేందుకు శనివారం ఉదయం మందడం గ్రామంలో సంస్మరణ సభ నిర్వహించారు. కట్టా రాజేంద్ర ఇంటి ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యుడు, అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ అంబుల మనోజ్ పాల్గొని ఆలూరి జతిన్, జేఏసీ సమన్వయకర్త ధనేకుల రామారావు, ఇడుపులపాటి ఎల్లేశ్వరరావులకు శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపారు.

అమరావతి ఉద్యమంలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆలూరి జతిన్, ఉద్యమ విజయానికి జేఏసీ సమన్వయకర్తగా దిశానిర్దేశం చేసి న్యాయ పోరాటంలో కీలక పాత్ర పోషించిన ధనేకుల రామారావు, అమరావతి నిర్మాణం, ఉద్యమానికి మొదటి నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించిన ఇడుపులపాటి ఎల్లేశ్వరరావుల సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

అనంతరం విజయవాడకు చేరుకున్న డాక్టర్ అంబుల మనోజ్ ఆధ్వర్యంలో స్థానిక ఐలాపురం హోటల్‌లో “అమరావతికి జీవం పోద్దాం–రూ.116 సాయం చేద్దాం” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 200 మంది పాస్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాస్టర్లు ఏపీ సీఆర్‌డీఏ ఖాతాకు క్యూఆర్ కోడ్ ద్వారా రూ.116 చొప్పున సాయం అందించారు.

ఈ సందర్భంగా డాక్టర్ అంబుల మనోజ్ మాట్లాడుతూ :

అమరావతి అభివృద్ధికి రూ.116 చొప్పున సాయం అందించిన పాస్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి అభివృద్ధికి పాస్టర్లు తమవంతు భాగస్వామ్యం అందించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా సహకరించి అమరావతి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.

ఈ సందర్భంగా పాస్టర్లు డాక్టర్ అంబుల మనోజ్‌ను ఘనంగా సన్మానించారు. అనంతరం సుమారు 50 మంది పాస్టర్లను కూడా సన్మానించారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం