📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kaikaluru : పార్టీ బలోపేతానికి సమన్వయంతో పనిచేస్తా : కొత్త


  • పల్లా శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపిన కైకలూరు నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ నాగబాబు

ఏలూరు జిల్లా : కైకలూరు : స్వచ్ఛవార్త :

కైకలూరు నియోజకవర్గ టీడీపీ కన్వీనర్‌గా అత్యున్నత బాధ్యతలు అప్పగించేందుకు సహకరించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను టీడీపీ కేంద్ర కార్యాలయంలో కొత్త నాగేంద్రకుమార్ (నాగబాబు) మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. తనపై నమ్మకం ఉంచి నియోజకవర్గ పార్టీ కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించడంలో సహకరించినందుకు పల్లా శ్రీనివాస్‌కు నాగేంద్రకుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలియజేస్తూ శాలువాతో సత్కరించారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ, కూటమి అభ్యర్థులు నూరు శాతం విజయాన్ని సాధించేలా కృషి చేయాలని పల్లా శ్రీనివాస్ సూచించారు. పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని, కన్వీనర్ బాధ్యతను పదవిగా కాకుండా పార్టీ కోసం పనిచేసే బాధ్యతగా భావించాలని దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా నాగేంద్రకుమార్ మాట్లాడుతూ.. 

కన్వీనర్‌గా తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని నాగేంద్రకుమార్ తెలిపారు. నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సహచర కమిటీ సభ్యులతో కలిసి సమష్టిగా పనిచేస్తానని పేర్కొన్నారు. పార్టీ అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కృషి చేస్తానన్నారు.

రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఇచ్చిన సూచనలు, దిశానిర్దేశాలను పాటిస్తూ నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయంతో పనిచేస్తానని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ, కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టి కృషి చేస్తానని పేర్కొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం