📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Machilipatnam : ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం చూపితే ఉపేక్షించేదే లేదు : మంత్రి కొల్లు రవీంద్ర

  • మచిలీపట్నంలో డ్రైనేజీ సమస్యను దగ్గరుండి పరిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర 
  • మౌలిక సదుపాయాల ఫిర్యాదులకు 24 గంటల్లోనే పరిష్కారం చూపాలని ఆదేశం

కృష్ణాజిల్లా : మచిలీపట్నం : స్వచ్ఛవార్త :

తాగు నీరు, సాగు నీరు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సోమవారం మచిలీపట్నంలోని తోటవారితుళ్ల సెంటర్ వద్ద రోడ్డుపై మురుగు ప్రవహిస్తోందని ప్రజలు ఫిర్యాదు చేయడంతో మంత్రి స్వయంగా రంగంలోకి దిగారు. 

పార పట్టి మురుగు కాలువల్లోని పూడిక తొలగించారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నియోజకవర్గంలో ఎక్కడ ఎలాంటి సమస్యపై ఫిర్యాదు వచ్చినా.. 24 గంటల్లోనే సమస్యకు పరిష్కారం చూపాలని సూచించారు. గత ఐదు సంవత్సరాలు అభివృద్ధిని గాలికి వదిలేశారు. మౌలిక సదుపాయాల ఊసే లేకుండా చేశారు. 

కానీ నేడు అలాంటి పరిస్థితికి ఆస్కారం లేదు. ఎక్కడ సమస్య ఉందని ఫిర్యాదు వచ్చినా.. తక్షణమే పరిష్కరించాలి. ఎవరైనా అధికారులు నిర్లక్ష్యం వహించినట్లు గుర్తిస్తే చర్యలుంటాయని హెచ్చరించారు. అధికారులైనా, ప్రజాప్రతినిధులైనా ప్రజల కోసమే పని చేస్తున్నామని, వారికి మెరుగైన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిందేనని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం